చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష
నటీనటులు: నితిన్ , సదా
దర్శకత్వం: తేజ
నిర్మాత: తేజ
విడుదల తేది: 14.06.2002
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే..నీవని
కనిపించని భావమే..ప్రేమని
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా..
చిలిపి వలపు బహుశా హొహో
మన కథకు మొదలు తెలుసా హొహో
దుడుకు వయసు వరస హుహు
అరె ఎగిరిపడకే మనసా హుహు
మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా
వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా
నీకు సందేహమా..ఆఅ..ఆఅ..ఆహా..
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
ప్రియతమా తెలుసునా..
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయ లయల జతుల గతుల తిల్లాన
మనసు కనులు తెరిచా హొహో
మన కలల జడిలో అలిశా హొహో
చిగురు పెదవినడిగా హుహు
ప్రతి అణువు అణువు వెతికా హుహు
మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా
మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా
ప్రేమ సందేశమా..ఆఅ..ఆఅ..ఆహా..
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని
హృదయమా తెలుపనా నీకోసమే నేనని
కనుపాపలో రూపమే..నీవని
కనిపించని భావమే..ప్రేమని
********* ********* ********
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి.పట్నాయక్, ఉష
పల్లవి:
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
చరణం: 1
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నోఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే
రైలుబండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యేనా
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెనా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
చరణం: 2
ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ
కంటి చూపుతోనే కొంటె సైగచేసి కలవరపెడుతోందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరెనేమొ ప్రేమ
గాలివాటు కాదేమైనా
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా… అందుకోవె ప్రేమ దీవెన
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
ఎందుకో అసలెందుకో అడుగెందుకో
మొదటిసారి ప్రేమ కలిగినందుకా
అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో..
********** ********** ********
చిత్రం: జయం (2002)
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: కులశేఖర్
గానం: ఆర్.పి. పట్నాయక్, ఉష
ఏమైందిరా – బాధగా ఉంది
నాకు లేని బాధ నీకెందుకురా
నీ బాధ నా బాధ కాదా
ఎహే రాయే..
హబ్బబ్బబ్బ రాను రాను
నాను రాను కుదరదయ్యో
కాదు కాదు ఈలు కాదు వొగ్గేయ్ వయ్యో
వొద్దు వొద్దు మీద మీద పడకరయ్యో
సిగ్గు సిగ్గు సిన్నకోక లాగకయ్యో
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయ్
యాపిలు పండు నారింజ పండు
బత్తాయి పండు బొప్పాయి పండు
అనస పండు పనస పండు
నిమ్మ పండు దానిమ్మ పండు
మామిడి పండు అరటి పండు
రాను అని కాదు అని అంతలేసి మాటలని
సంతకొచ్చె సూడవయ్యో సిన్నది
కాదనంటే ఔనని లే లేదనంటే ఉందనిలే
ఆడవారి మాట తీరు వేరులే
ఔనా మైనా మాతో చిందేయ్ చిందేయ్
బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్
సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో
సీరంతా జార్చిందా సిన్నదో సిన్నది
కస్సుబుస్సంటూనే కుర్రదో కుర్రదో
కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రది
హరిలో రంగ హరి హరి
స్వామి రంగ హరి హరి
ఏంటో ఎవరూ పట్టించుకోట్లేదేంటి
గాజువాక పిల్లా మే గాజులోళ్ళం కాదా
చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా
తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని
సాటుకొచ్చి సిందులేసె సిన్నది
తప్పనంటే ఒప్పనలే ఒప్పనంటే తప్పనలే
సూటిగాను సెప్పదయ్యో ఆడది
రావే పిల్లా ఎందుకు మల్లాగుల్లా
ఎల్లోయ్ ఎల్లోయ్ ఎల్లెల్లోయ్ ఎల్లో ఎల్లోయ్
రాను రానంటూనే సిన్నదో సిన్నదో
రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది
కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో
తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది
పచ్చి పచ్చివంటూనే పిల్లదో పిల్లదో
పళ్ళట్టుకొచ్చిందోయ్ పిల్లదో పిల్లది