Jebu Donga (1988)

చిత్రం: జేబుదొంగ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, భానుప్రియ, రాధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: అర్జున్ రాజు
విడుదల తేది: 25.12.1987

పల్లవి:
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

చరణం: 1
ఆ నింగికి నీలం నీవై
ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో
రేపూ మాపుల సంధ్యెలలో
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
మెల్లగా చల్లగా ముద్దుగ మెత్తగ హత్తుకుపోయి
నిలువెల్లా….

చరణం: 2
ఆ హిమగిరి శిఖరం నేనై
నీ మమతల మంచును నేనై
ఆశలు కాసే వేసవిలో
తీరని కోర్కెల తాపంలో
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
ఉరకలా పరుగులా పరువంలోనా ప్రణయంలోనా
నిలువెల్లా…

error: Content is protected !!