Jeevana Jyothi (1975)

Advertisements

చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల
నటీనటులు: శోభన్ బాబు , వాణిశ్రీ
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: డి. వి.యస్.రాజు
విడుదల తేది: 1975

ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు…ష్..
సద్దు చేసారంటె వులికులికి పడతాడు
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు

జుజుజుజుజు  జుజుజుజుజు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు

చల్లగా నిదరోయే బాబు
నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు
చల్లగా నిదరోయే బాబు
నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు
ఏమి కలలు కంటున్నాడొ తెలుసా… తెలుసా
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ
ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ

జుజుజుజుజు  జుజుజుజుజు

Advertisements

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు

దేవుడే నా ఎదురుగ నిలబడితే
ఏమి కావాలి తల్లీ.. అని అడిగితే
దేవుడే నా ఎదురుగ నిలబడితే
ఏమి కావాలి తల్లీ.. అని అడిగితే
నేనేమని అంటానో తెలుసా…తెలుసా
నీ నీడలో నా వాడు పెరగాలనీ
నీ నీడలో నా వాడు పెరగాలనీ
పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని

జుజుజుజుజు  జుజుజుజుజు

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటె వులికులికి పడతాడు
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు

జుజుజుజుజు  జుజుజుజుజు

Advertisements

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Devullu (2001)
error: Content is protected !!