చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల
నటీనటులు: శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: డి. రామానాయుడు
విడుదల తేది: 1973
పదిమాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంతా మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు
పల్లవి :
ఈ జీవనతరంగాలలో… ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము… ఎంతవరకీ బంధము
చరణం: 1
కడుపు చించుకు పుట్టిందొకరు
కాటికి నిన్ను మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు
ఆపై నీతో వచ్చేదెవరు… ఆపై నీతో వచ్చేదెవరు
ఈ జీవనతరంగాలలో… ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము… ఎంతవరకీ బంధము
చరణం: 2
మమతే మనిషికి బందిఖానా
భయపడి తెంచుకు పారిపోయినా
తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది
తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది
నీ భుజం మార్చుకోమంటుంది
ఈ జీవనతరంగాలలో… ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము… ఎంతవరకీ బంధము
చరణం: 3
తాళి కట్టిన మగడు లేడని
తరలించుకు పోయే మృత్యువాగదు
ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు
ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు
ఈ జీవనతరంగాలలో… ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము… ఎంతవరకీ బంధము
ఈ జీవనతరంగాలలో…
************* ********** ************
చిత్రం: జీవనతరంగలు (1973)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల
పల్లవి :
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి ఎందరికి…
చరణం: 1
కలిమికేమి వలసినంత ఉన్నా
మనసు చెలిమి కొరకు చేయి చాచుతుంది
ఆ మనసే ఎంత పేదైదైనా
అనురాగపు సిరులు పంచుతుంది
మమత కొరకు తపియించే జీవనం
మమత కొరకు తపియించే జీవనం
దైవమందిరంలా పరమపావ నం
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి… ఎందరికి…
చరణం: 2
పువ్వెందుకు తీగపై పుడుతుంది
జడలోనో గుడిలోనో నిలవాలని
ముత్యమేల కడలిలో పుడుతుంది
ముచ్చటైన హారంలో మెరవాలని
ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని
తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని
తన కోసమే కాదు పరుల కొరకు బ్రతకాలని
తానున్నా… లేకున్నా…
తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి
పుట్టినరోజు పండగే అందరికి
మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి
ఎందరికి… ఎందరికి…