చిత్రం: జీవిత చక్రం (1971)
సంగీతం: శంకర్- జైకిషన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: యన్. టి.రామారావు, వాణిశ్రీ, శారద
దర్శకత్వం: సి.ఎస్.రావు
నిర్మాత: పి.గంగాధర్ రావు
విడుదల తేది: 30.04.1971
స్నేహమూ చేయవా…. స్నేహమూ చేయవా….
ఎన్ని సార్లు విన్నా కొత్తగా ఉండే ఘంటసాల పాట..!!
వస్తావా.. మురిపిస్తావా…. !!! వస్తావా.. మురిపిస్తావా…. !!!
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా…
ఆశలు దాచకు…. ఆశలు దాచకు…
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
ఆడపిల్ల పూలతీగె ఒక్కలాగే చక్కనైనవి…
ఆడపిల్లా..ఆ.. పూలతీగె..ఏ…ఏ.. ఒక్కలాగే.. అండకోరుకుంటాయీ… ఆహా..
అందమైన మగవాడు పొందుకోరి వచ్చాడు
ఎందుకలా చూస్తావు ఓ పిల్లా….
స్నేహమూ చేయవా…. స్నేహమూ చేయవా….
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
కొమ్మమీద గోరువంక రామచిలుక జోడుగూరే..
కొమ్మమీద గోరువంక రామచిలుక జోడుగూరే…
కొమ్మమీదా..ఆ..ఆ… గోరువంకా…ఆ…ఆ… రామచిలుకా…ఆ…ఆ… ముద్దుపెట్టుకున్నాయి… ఆహా..
మెత్తనైన మనసునీది కొత్తచిగురు వేసింది.. మత్తులోన మునిగింది… ఓ పిల్లా..
మైకమూ పెంచకూ… మైకమూ పెంచకు…
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూసే
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగబూసే
చెప్పలేని..ఈ..ఈ..వింత వింతా..ఆ..ఆ.. అనుభవాలు ఎదురుచూస్తున్నాయి…. ఆహా..
నువ్వు నన్ను చేరాలి… నేను మనసు ఇవ్వాలి
ఎడమలేక ఉండాలి ..ఓపిల్లా..
కంటి చూపు చెబుతోంది
కొంటె నవ్వు చెబుతోంది
మూగమనసులో మాట ఓ పిల్లా
వస్తావా…. మురిపిస్తావా… వస్తావా..
వస్తావా…. మురిపిస్తావా… వస్తావా.. మురిపిస్తావా…. ఓపిల్లా..