లేదమ్మా న్యాయం… లిరిక్స్
చిత్రం: జోహార్ (2020)
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: కాల భైరవ
నటీనటులు: అంకిత్ కొయ్య, నైనా గంగూలీ
దర్శకత్వం: నందకిశోర్
నిర్మాణం: సందీప్ మార్ని
విడుదల తేది: 14.08.2020
లేదమ్మా న్యాయం… రాధమ్మా సాయం
గుండెల్లో గాయం… ఆశలే మాయం
తుఫానుల్లే, తుఫానుల్లే మీలో…
శోఖముల్లే, శోఖముల్లే లోలో…
బ్రతకాలంటే ప్రతీరోజు అదో మహా యాతనే…
గెలుపే లేక గతి లేక చేసే పోరాటమే…
అదో శోధనో, మనో వేదనో… తుది పాఠమో, మరణంపై ప్రేమో
దేశం ఎంతెంతో ఎత్తే ఎదిగిందా… తానే పాతాళం పాలైందా
జెండా ఉండుండి రంగే మార్చిందా..!!
గూండా తండాల గూడయ్యిందా..!!
నింగే కుంగేనులే నేలకే వంగేనులే
ఆ పంచభూతాలవే… ఈ పంచప్రాణాలులే
ఇంతే ఇంతింతే ఇంతే… ముగిసి పోతాయంతే
నువ్వు నేను అంతే… బొమ్మల్లా చూస్తుంటే
బ్రతకాలంటే ప్రతీరోజు అదో మహా యాతనే…
గెలుపే లేక గతి లేక చేసే పోరాటమే…
అదో శోధనో, మనో వేదనో… తుది పాఠమో, మరణంపై ప్రేమో
ఓ ఓ ఓ… మరణంపై ప్రేమో…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
నీవే సాగిపో అలా… లిరిక్స్
చిత్రం: జోహార్ (2020)
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: హరిచరణ్
నటీనటులు: అంకిత్ కొయ్య, నైనా గంగూలీ
దర్శకత్వం: నందకిశోర్
నిర్మాణం: సందీప్ మార్ని
విడుదల తేది: 14.08.2020
హేయ్..! మధురం కాదా..! నిన్నే ప్రేమిస్తూ ఉంటే ఒక తోడూ
కోటి ఆశలే పూచే కాంతులే… నీలో దాగి లేవా
దారి మూసిన సాగరాన్నిలా… దాటుదాం ఇవాళా
కూలదోసిన, కాలరాసిన… ఆశ వీడక రా..!!
నీవే సాగిపో అలా… ప్రేమ వాగు వలే
ఓ వాలే సంధ్యాల్ని దాటే… జాబిల్లే నవ్వే జానై
గెలవాలి అంటే చెమటోడ్చాలంతే… సాగనీ పోరు
బతుకంటే ఇంతే… ఇక రాజీ అంటూ ఉండదే… ఓ ఓ
నిన్నే మార్చుకో… నీకే నువ్వు తోడూ
నీవే నీలాగ సాగిపోలేవా…?? దీక్షే పూనవా..!! ఆ ఆ
సిరులేవి లేవులే… అవి వెంటే రావులే
ప్రేమించే మనసే ఉంటే చాలులే…
ఈరోజు చేదైనా… రేపింకా నీదేరా
ప్రేమ ముద్రే నువ్వు వేసేయ్ రా..!!
ఆ మంచిరోజు కోసం నువ్వు చూస్తున్నావా..?
నీ అండా, నీ దండా… నువ్వు రాదనుకున్నావా..??
నిలువెల్లా కళ్ళే అయి వేచి చూశావా..?
యధ నీదే, వ్యధ నాదే… నన్నే చేరగ రా రా…
ధైర్యం నువ్వే కాదా… ప్రేమకే ప్రాణం నీవు లేమ్మా
జీవితం అంకితం చేసుకోమ్మా…
నీవే సాగిపో అలా… ప్రేమ వాగు వలే
ఓ వాలే సంధ్యాల్ని దాటే… జాబిల్లే నవ్వే జానై
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
నీ రూపం ఎదురుగా… లిరిక్స్
చిత్రం: జోహార్ (2020)
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: గౌతమ్ భరద్వాజ్, అమల చెబోలు
నటీనటులు: అంకిత్ కొయ్య, నైనా గంగూలీ
దర్శకత్వం: తేజ మార్ని
నిర్మాణం: సందీప్ మార్ని
విడుదల తేది: 14.08.2020
నీ రూపం ఎదురుగా… చూస్తుంటే కుదురుగా
నా కన్ను చెదిరెగా… నా గుండె అదిరెగా…
మురికి నీటిలో మెరుపు తీగలా… విరిసినావె ఓ కమలమా
నివురుకప్పనీ నిప్పురవ్వలా… నిలిచావే నా ప్రియతమా…
ఒకరు నేను ఒకరు నీవు… ఎవరికేమీ కాము
కలవలేము, కలిసిలేము, విడిచిపోము…
సన్నజాజినే కలిశా కలిశా… పందిరవ్వగా నిలిచా నిలిచా
యదనే తనకై తెరిచా తెరిచా… ఇది నీ బతుకని జతగా పరిచా
వచ్చాను నీ కోసం… చేస్తాను నీ కోసం
నీ ప్రేమ నాకు అవసరము… ఒక జ్వరము
నీ చూపే సోకితే… నీ శ్వాసే తగిలితే
నా గుండే ఊగేలే… మేఘాల్లో ఎగిరేలే
మురికి నీటిలో మెరుపు తీగలా… విరిసినావె ఓ కమలమా
నివురుకప్పనీ నిప్పురవ్వలా… నిలిచావే నా ప్రియతమా…
చిటపట చిటపట చినుకట నువ్వే… పడుచు యడదలో కితకిత నువ్వే
గతుకు గతుకుల బతుకు బాటలో… నాకు ఇక జతవు నువ్వే…
ఎవరు నేను ఎవరు నీవు… ఒకరిమేగా విను
మనసు లేనీ మమత లేనీ… మరను కానూ
ఇన్నినాళ్ళుగా బతికా శిలగా… ఉన్న చోటునే ఒక కోవెలగా
కలనై, కలకై … వెతికా-వెతికా
కలిసే జతనిక… విధినే అడిగా
ఇచ్చాడు నీ ప్రేమ… పెంచాడు నా ధీమా
నువ్వేగా నాకు ఒక వరము… కనికరము
నీతోనే నడవనా… నీతీగా బతకనా
నీతోడు నీడలో… నా గమ్యం వెతకనా
పుణ్య గంగనే మురికి గుంటగా… మార్చదంటదే లోకము
జతగ నీవలె ఒకరు దొరికితే… బతుకుతుంటదే పాపము…
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****