Josh (2009)

1.2BJosh 2009

చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్
నటీనటులు: నాగ చైతన్య, కార్తీక
దర్శకత్వం: వాసు వర్మ
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 05.09.2009

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నే రప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు
చిత్రంగా నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు
నీలాగా నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసీ
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ
గమనించే ఆశ్చర్యమా
యే పనిచేస్తున్నా ఏదో ఘనకార్యం లాగే
గర్వించే పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

*********   *********   *********

చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బెన్నీ దయాల్, రంజిత్

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా
ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీదవ్వాలంతే
నిప్పు నైనా నేర్పుగ దాటే యవ్వనం నీదిరా
బీ కేర్ ఫుల్ మాటలో అర్ధమేం వున్నా గాని
నీలో ఫియర్ లేదనీ అందరూ చూడని
లేలో డియర్ ఇప్పుడే ఎదురయేఅవకాశాన్ని
నౌ ఆర్ నెవెర్ తెలుసుకో సత్యాన్ని
I am a bad bad boy, bad bad boy
I am a bad bad boy
I am a bad bad boy, bad bad boy
అని ఎవరు అనుకొనీ

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా

చరణం: 1
లోకమెంతో పెద్దది కాదుర పొల్చుకుంటే చిన్నదే చూడర
చీకటి లేని వేకువ రాని చోటసలెక్కడ వున్నది సోదరా
ఇష్టమైతే సమ్మర్ హీట్ చల్లగ అనిపిస్తుంది
నచ్చకుంటే చంద్రుడి లైట్ నల్లగా కనిపిస్తుంది
ఏదో ట్రబుల్ ఉండదా స్వర్గలొకంలో ఐనా
డైలీ స్ట్రగుల్ తప్పదే ఎక్కడున్నా
I am a bad bad boy, bad bad boy
I am a bad bad boy
I am a bad bad boy, bad bad boy
అని ఎవరు అనుకొనీ

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా

చరణం: 2
లైఫనేది చిన్నది కాదుర బౌండరికి అది అందదు సోదరా
నిన్నలాగే వుండదు నిత్యం రేపు అన్నది సరికొత్త ఉగాదిరా
ఎప్పుడైనా గెలుపును గెలిచే చాన్సు నీకూ ఉన్నదిరా
గాయమైనా హాయనుకుంటే సమరమైనా సరదారా
ఏ రొజు ను అడగదా జీవితం నా సిగ్నేచర్
ఏ హిస్టరీ చదవదా నా చాప్టర్
I am a bad bad boy, bad bad boy
I am a bad bad boy
I am a bad bad boy, bad bad boy
అని ఎవరు అనుకొనీ

ఆగే పీచే ఆలోచిస్తే సాగలేవోయ్ సందేహిస్తే
సాహసంగా ముందడుగేస్తే ఈ క్షణం నీదిరా
ఏ పనైనా చెయ్యాలంటే నిర్ణయం నీదవ్వాలంతే
నిప్పు నైనా నేర్పుగ దాటే యవ్వనం నీదిరా

*********   *********   *********

చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సందీప్ చౌతా, కునాల్ గంజ్ వాలా

ఓయ్ ఓయ్ వయసుకి తోవ చెప్పకొయ్ రైటో లెఫ్టో
ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్ ఓయ్ ఓయ్
ఓయ్ ఓయ్ వయసుకి తోవ చెప్పకొయ్ రైటో లెఫ్టో
ఓయ్ ఓయ్ మనసుకు తోచినట్టు చెయ్ ఓయ్ ఓయ్

ఎన్నాళ్ళు వొళ్ళో వుంటాం పసిపాపలల్లె
భూమ్మీద పాదం పడకుండా
ఎన్నాళ్ళు బళ్ళో వింటాం బెంచీలమల్లే
బూజెత్తి పోదా బ్రైనంతా

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

జోష్… జోష్… జోష్….

చరణం: 1
కళ్ళుండేం లాభం కాలాన్నేం చూస్తాం
క్లాస్రూంలో బ్లాకుబోర్డై చూస్తుంటే
కాళ్ళుండేం లాభం కదలము యేమాత్రం
కాలేజీ ఖైదీలై పడి వుంటే
పాతికేళ్ళకీ పూర్తి కాని ఈ పుస్తకాలతో ఎదురీత
ఎందుకంటె యెం చెప్పగలవు బేటా
జీవితాన్నెలా దాటగలవురా సొంత అనుభవం
లేకుండా అందుచేత ఇది మాయలేడి వేటా
చెప్పిందెలాగా వినరు ఈ కుర్రకారు
అయినా మరెందుకు ఈ పొరు
ఉప్పెనను ఆపేదెవరు పారా హుషారు
మీకే ప్రమాదం మాస్టారు

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

చరణం: 2
ఉరికే వేగంతొ ఊహాలొకం లో
ఊరేగె ఊత్సాహం మా సొంతం
ఆపే హద్దులతో సాగే యుధ్ధంలో
సాధించే స్వాతంత్రం మాకిష్టం
నరనరాలలో ఉడుకుతున్నదీ నిప్పుటేరులా యువరక్తం
నివురు చాటుగా నిద్దరొదు నిత్యం
నీతిగోలతో నోటిగాలితో ఆపలేరుగా ఏ మాత్రం
తెలిసి తెలిసి అసలెందుకంత పంతం
ఓ ఈ జొష్ సాధ్యం కాదా సుడిగాలి లాగ
కామోష్ అవడం మర్యాదా
మా ఫోర్సు క్రైమవుతుందా బోఫోర్సు లాగా
శాబాషు అనుకోడం రాదా

డీరి డీరిడీ బీ రెడీ యవ్వనం పరమ కిలాడి
దీని గారడీ చూడనీ తక్షణం వెంటపడి (2)

With josh if u not had enough
u can get high enough
Say josh if u not had enough
u can get high enough

*********   *********   *********

చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాహుల్ విద్యా, ఉజ్జయిని ముఖర్జీ

పల్లవి:
ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం
కనకే… అపురాపం కలిగే… అనురాగం

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం
కనకే… అపురాపం కలిగే… అనురాగం

అనుపల్లవి:
ఎదలోనే కొలువున్నా ఎదురైనా పోల్చలేక
నిజమేలే అనుకున్నా రుజువేది తేల్చలేక
మరెలా… ఆ… ఆ… ఆ…

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం

చరణం: 1
దారి అడగక పాదం నడుస్తున్నదా
వేళ తెలుపక కాలం గడుస్తున్నదా
తడి ఉన్నదా… ఎదలో తడిమి చూసుకో…
చెలిమిగ అడిగితే చెలి చెంత
చిలిపిగ పలకదా వయసంతా
జతపడు వలపులు గుడిగంట
తలపుల తలుపులు తడుతుందా
చూస్తూనే పసికూన ఎదిగిందా ఇంతలోన
చెబితేనే ఇపుడైనా తెలిసిందా ఈ క్షణాన
అవునా… ఆ… ఆ… ఆ…

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం

చరణం: 2
కళ్ళు నువ్వొస్తుంటే మెరుస్తున్నవి
వెళ్ళివస్తానంటే కురుస్తున్నవి
కొన్నాళ్ళుగా నాలో ఇన్ని వింతలు ఓహో
గలగల కబురులు చెబుతున్నా
వదలదు గుబులుగ ఘడియైనా
మది అనవలసినదేదైనా పెదవుల వెనకనె అణిగేనా
హృదయంలో వింత భావం పదమేదీ లేని కావ్యం
ప్రణయంలో ప్రియ నాదం వింటూనే ఉంది ప్రాణం
తెలుసా… ఆ… ఆ… ఆ…

ఎవ్వరికీ కనపడదే ప్రేమది ఏ రూపం
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగం

*********   *********   *********

చిత్రం: జోష్ (2009)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్యారావు

పల్లవి:
నువ్వెళ్ళని చోటుంటుందా
నువ్వెరుగని మాటుంటుందా
గాలి నన్ను రానీ నీ వెంటా
నువు చూసొచ్చిన ప్రతి వింతా
నేనెవ్వరికీ చెప్పొద్దా
నీ ఊసులనే ఊకొడుతూ వింటా
ఒక్క చోట నిలవొద్దు అంటూ
తెగ తరుముతున్న ఈ ఉత్సాహం
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా (2)

నువ్వెళ్ళని చోటుంటుందా
నువ్వెరుగని మాటుంటుందా
గాలి నన్ను రానీ నీ వెంటా

చరణం: 1
వేళాపాళా గోళీ మార్ విసిరేసా చూడు వాచీని
అప్పుడప్పుడు నవ్వుదామా టైం టేబుల్ వేసుకుని
దాగుడుమూత దండాకోరు ఎవ్వరికి జాడచెప్పమని
ఇట్టే తప్పించుకోమా ఆపేసే చూపుల్నీ
పట్టకంటు పట్టించుకోని పాటల్లె సాగనీ పొద్దంతా
ఒద్దు అంటూ ఆపేది ఎవ్వరంటా
కాటుకపిట్టల్లా కళ్ళెగిరి వాలిన చోటల్లా
ఎన్ని వర్ణాలో చూడిల్లా తెలుగు పోగుల్లా

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా

చరణం: 2
కిటికీ లోంచి చూడాలా కదిలెళ్ళే అన్ని ఋతువుల్ని
చెయ్యారా తాకరాదా వేకువని వెన్నెల్ని
గుమ్మం బయటే ఆపాలా ఎదురొచ్చే చిన్ని ఆశలని
గుండెల్లో చోటులేదా ఊరించె ఊహలకి
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనై ఈ పూట
ఎగిరి ఎగిరి ఆకాశమందుకుంటా
ఎల్లలు ఆగేనా అల్లరిగ దూకే వేగేనా
అదుపులో ఉంచె వీలేనా నన్ను నేనైనా

ఆవారా హవా అదిరిపడి ఔరా అంటావా
హాయిగా నాతో వస్తావా సాయ పడతావా

నువ్వెళ్ళని చోటుంటుందా
నువ్వెరుగని మాటుంటుందా
గాలి నన్ను రానీ నీ వెంటా (2)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top