Jwala (1985)

చిత్రం: జ్వాల (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: చిరంజీవి, రాధిక, భానుప్రియ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: పింజల నాగేశ్వరరావు
విడుదల తేది: 14.07.1985

పల్లవి:
కలికి చిలక చలికి దరికి చేరగనే…
చినుకులిగిరి వలపురగిలి కోరగనే
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది…
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది…
కౌగిలింతలోనే….హెయ్…హేయ్..

కలికి చిలక చలికి దరికి చేరగనే…
చినుకులిగిరి వలపురగిలి కోరగనే…

చరణం: 1
వానొచ్చి తడిసాక వయసెంతొ తెలిసింది…తొలిసారిగా..ఆ..
నీవొచ్చి కలిసాక…మనసంటె తెలిసింది ఒక లీలగా..ఆ..

ఆ గాలి వానల్లె కలిశాము…ఎద మంటల్లొ చలి గుళ్ళో చేరాము..
మెరుపల్లె ఉరుమల్లె కలిశాము…తొలివయసుల్లో వడగల్లె ఏరాము..

మనం మనం…ఊ..ఊ..
మనం మనం…వరించడం..తరించడం..ఇహం పరం..
క్షణం క్షణం …నిరీక్షణం…సుఖం సుఖం…

లలల…కలికి చిలక చలికి దరికి చేరగనే…
వయసు తడిసి వలపురగిలి కోరగనే
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది..
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది…
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది..
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది…
కౌగిలింతలోనే….హెయ్…హేయ్..

కలికి చిలక చలికి దరికి చేరగనే…
వయసు తడిసి వలపురగిలి కోరగనే….

చరణం: 2
వాటేసుకుంటేనే వయసొచ్చే.. ఈ సందే సందిల్లల్లో…హోయ్
వయ్యారి అందాలు.. వరదల్లె పొంగేటి కౌగిల్లలో…హా..

సూరీడు వెళ్ళాక …సాయంత్రం…
తొలి నా ఈడు కోరింది..నీ మంత్రం
చుక్కల్తో వచ్చింది…ఆకాశం…
చలి చూపుల్లో తెచ్చింది…ఆవేశం…

ప్రియం ..ప్రియం..ఉ..ఉ..
ప్రియం ..ప్రియం….జతిస్వరం…
పరస్పరం..స్వయంవరం…
నరం నరం..ఒకే స్వరం..నిరంతరం…తరార…

కలికి చిలక చలికి దరికి చేరగనే…
చినుకులిగిరి వలపురగిలి కోరగనే…
జాణ మేన వాన వీణ ఝల్లుమన్నది
ప్రేమ గాలి సోకి నన్ను అల్లుకున్నది…
మెరుపు తీగలాంటి మేను మెలికపడ్డది..
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికిపడ్డది…
కౌగిలింతలోనే….హెయ్…హేయ్..

కలికి చిలక చలికి దరికి చేరగనే…
వయసు తడిసి వలపురగిలి కోరగనే….

*******  ********  ********

చిత్రం: జ్వాల (1985)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: జానకి

పల్లవి:
అహ…అహ…హ…
అహ…అహహ…ఆ…

ఏవేవో కలలు కన్నాను.. మదిలో
ఏవేవో కలలు కన్నాను.. మదిలో..
మౌన మురళినై..విరహ వీణనై…
స్వామి గుడికి చేరువైన వేళలో…ఓ…
ఏవేవో కలలు కన్నాను.. మదిలో..

చరణం: 1
సుడిగాలులలో మిణికే దీపం
ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో …ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో …ఇదే ఋణానుబంధమో

నీకు నేను బానిసై ..నాకు నువ్వు బాసటై…సాగిపోవు వరమె చాలు..
ఏవేవో కలలు కన్నాను.. మదిలో…

చరణం: 2
నా కన్నులలో వెలుగై నిలిచీ…
చిరు వెన్నెలగా… బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా
నిట్టూర్పుగున్న గుండెకీ ..ఓదార్పు చూపినావురా

నాది పేద మనసురా .. కాంచలీయలేనురా..కనుల నీరె కాంచరా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Pelli Choopulu (1983)
error: Content is protected !!