చిత్రం: జ్యోతి (1976)
సంగీతం: కే. చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All Songs)
గానం: యస్. పి.బాలు, యస్. జానకి
నటీనటులు: మురళీమోహన్, జయసుధ, కృష్ణ కుమారి
దర్శకత్వం: కే. రాఘవేంద్ర రావు
నిర్మాత: క్రాంతి కుమార్
విడుదల: 04.06.1976
సిరిమల్లె పువ్వల్లె నవ్వు – హ్హ…హ్హ…హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
హ్హ…హ్హ…హ్హ
సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ
ప ని స – హ్హ…హ్హ…హ్హ
స గ మ – హ్హ…హ్హ…హ్హ
గ మ ప – ఆ…హ్హ…హ్హ
ని ని ప మ గ గ మ ప
హ్హ హ్హ హ్హ హ్హ… ఆ…ఆ…ఆ…
ఆ… చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా
రవళించగా – ఉహూ…హ్హ…హ్హ…హ్హ…
సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
ఆ…ఆ…
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
ఆ…వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా
తొలి నవ్వుగా
సిరి మల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు
హ్హ…హ్హ…హ్హ…హ్హ…హ్హ…
సిరిమల్లె పువ్వల్లె నవ్వు – హ్హ..హ్హ..హ్హా..
చిన్నారి పాపల్లె నవ్వూ – హ్హ…హ్హ…హ్హ…
******** ********* *********
చిత్రం: జ్యోతి (1976)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
ఏడుకొండలపైన ఏలవెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
ఏడుకొండలపైన ఏలవెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
తెలియని వారికి తెలుపర స్వామి
తెలియని వారికి తెలుపర స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏలవెలిశావు
ఎవరికీ అందక ఎందుకున్నావో
చరణం: 1
ఆ ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ
ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ
అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో
ఆ అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో
ఏ అర్థమున్నదో… ఏ సత్యమున్నదో
తెలియని వారికి తెలుపర స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏలవెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
చరణం: 2
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి ఋణమును తీర్చుకుంటున్నావో
రెండు ప్రేమల మధ్య బండగా మారావూ
స్వామి రెండు ప్రేమల మధ్య బండగా మారావూ
రేపు లేని నీకు దోపిడీ ఎందుకో…
తెలియని వారికి తెలుపర స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏలవెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో