కనులలో నీరు… లిరిక్స్
చిత్రం: కళాకారుడు (2020)
నటీనటులు: శ్రీధర్, దుర్గ, పోసాని కృష్ణమురళి, రవివర్మ
సంగీతం: రఘురామ్
సాహిత్యం: అల రాజు
గానం: కె.ఎస్. చిత్ర
దర్శకత్వం: కిరణ్ దుస్సా
నిర్మాణం : శ్రీధర్ శ్రీమంతుల
విడుదల తేది: 03.01.2020
కనులలో నీరు
తెలుపదా చూడు
మనసులో ఉన్న ప్రేమను
మరిచి పోలేదు
విడిచి రాలేను ఎవరితో
ఏమి చెప్పను
దారే తోచక
సతమతమయ్యా నేనిలా
తీరం తెలియక
శిలనై మిగిలి ఉన్నానిలా
కనులలో నీరు
తెలుపదా చూడు
మనసులో ఉన్న ప్రేమను
అలలు లేనట్టి
కడలి లేనట్టు
బతుకులో బాధలే సహజం
ఎదను కోసేటి
మాటలెదురైతే
చెదిరి పోయేనులే హృదయం
మనసా విరిగిన అతకదు పాపం
తెలిసి విరవక వదలదు లోకం
తట్టుకోవాలిక ఈ నిజం
దీని పేరే కదా జీవితం
కనులలో నీరు
తెలుపదా చూడు
మనసులో ఉన్న ప్రేమను
మరిచి పోలేదు
విడిచి రాలేను ఎవరితో
ఏమి చెప్పను
నిదురలో ఉన్న
కనులకేనాడు
కలలు కల్లాలని తెలిసేనా
వలపులో ఉన్న
వయసుకేనాడు
కన్న ప్రేమ గురుతొచ్చేనా
నిజము ఎరుగదు నిలవని ప్రాయం
కనుకే తగిలేను కద ఈ గాయం
తిరిగి మరలినా మరి ఏం లాభం
జాలిపడి మారదే ఆ గతం
కనులలో నీరు
తెలుపదా చూడు
మనసులో ఉన్న ప్రేమను
మరిచి పోలేదు
విడిచి రాలేను ఎవరితో
ఏమి చెప్పను
దారే తోచక
సతమతమయ్యా నేనిలా
తీరం తెలియక
శిలనై మిగిలి ఉన్నానిలా
కనులలో నీరు
తెలుపదా చూడు
మనసులో ఉన్న ప్రేమను
********** *********
కన్నుల్లో ఏ కలలైన… లిరిక్స్
చిత్రం: కళాకారుడు (2020)
నటీనటులు: శ్రీధర్, దుర్గ, పోసాని కృష్ణమురళి, రవివర్మ
సంగీతం: రఘురామ్
సాహిత్యం: పూర్ణ చారి
గానం: హేమ చంద్ర, రమ్య బెహరా
దర్శకత్వం: కిరణ్ దుస్సా
నిర్మాణం : శ్రీధర్ శ్రీమంతుల
విడుదల తేది: 03.01.2020
కన్నుల్లో ఏ కలలైన నీ వల్లే
వెన్నెల్లో ఆ వెలుగంతా నీదేలే
నిన్నే చూడలేని నన్ను నేను చూడలేను
నిన్నే చేరలేని గమ్యమంటు చేరలేను
ఇదివరకెపుడైనా
ఈ కల కన్నానా
మన కథ ఇక
చరితే పాడే
గీతం కావాలి
కన్నుల్లో ఏ కలలైన నీ వల్లే
పదపదమని నీవైపే
అడుగులు నను తోస్తుంటే
ఏంటీ వరసనకుని
సతమతమయ్యా నేను
తెగ ఎగబడి నా చూపే
చిలిపిగా నిను చూస్తుంటే
ఏంటీ గొడవనుకుని
తడబడిపోతున్నాను
ఎటువంటి చోటైనా
ఎందుకు నువు రాకుంటే
సంక్రాంతి కాంతైనా
ఎందుకు నువు లేకుంటే
ఇదివరకెపుడైనా
ఈ కల కన్నానా
మన కథ ఇక
చరితే పాడే
గీతం కావాలి
కన్నుల్లో ఏ కలలైన నీ వల్లే
వెన్నెల్లో ఆ వెలుగంతా నీదేలే
ఎప్పుడెప్పుడని అనుకుంటు
ఎద పదనిసలను వింటు
ఏదేదో చెప్పాలనికొని
వస్తా నేను
చనువుగా నీతో ఉంటూ
మనసున ఏం లేనట్టు
తెరవేసి తెలుపని నిజమును
దాస్తున్నాను
నే పలికే మాటల్లో
అర్ధాలే ఏమంటే
సరిగా గమనించావో
తెలిసేను ప్రేమంటే
ఇదివరకెపుడైనా
ఈ కల కన్నానా
మన కథ ఇక
చరితే పాడే
గీతం కావాలి
కన్నుల్లో ఏ కలలైన నీ వల్లే
వెన్నెల్లో ఆ వెలుగంతా నీదేలే
నిన్నే చూడలేని నన్ను నేను చూడలేను
నిన్నే చేరలేని గమ్యమంటు చేరలేను
ఇదివరకెపుడైనా
ఈ కల కన్నానా
మన కథ ఇక
చరితే పాడే
గీతం కావాలి
కన్నుల్లో ఏ కలలైన నీ వల్లే
********** *********
చికెన్ ముక్క… లిరిక్స్
చిత్రం: కళాకారుడు (2020)
నటీనటులు: శ్రీధర్, దుర్గ, పోసాని కృష్ణమురళి, రవివర్మ
సంగీతం: రఘురామ్
సాహిత్యం: అల రాజు
గానం: మోహన భోగరాజు, దివ్య మాలిక, అదితి భవరాజు
దర్శకత్వం: కిరణ్ దుస్సా
నిర్మాణం : శ్రీధర్ శ్రీమంతుల
విడుదల తేది: 03.01.2020
మంగ పోతే గంగ
గంగ పోతే రింగ
దొరుకుతుంది కచ్చితంగా
వదిలేసేయ్ బెంగా
చిందేయరా రంగా
అరెరె అరెరె అదామ్
ముందుంది చూసుకోరా
ఇదిగో ఇప్పుడే కొట్టేయ్ నాటుసారా
అదిరే అదిరే సరుకే
నీ సొంతం చేసుకోరా
నీ దారే చెదిరిపోయే
సోకే ఇదిరా
మిసమిసలాడేటి పోరి ఉందిరా
బుసబుస పొంగేటి బీరు ఉందిరా
కసుబుసు మానేసి జోరు చూపరా
పట్టేసేయ్ గల్లాసేయ్
చేసేయ్ బాధలన్ని ఖల్లాసేయ్
చికెన్ ముక్క
లిక్కర్ చుక్క
సక్కని సుక్క
ఉన్నది నీ పక్క
సిక్కులదొంక
ఎందుకు ఇంక
డించకు చక్క
కానీ ఎంచక్క
చికెన్ ముక్క
లిక్కర్ చుక్క
సక్కని సుక్క
ఉన్నది నీ పక్క
సిక్కులదొంక
ఎందుకు ఇంక
డించకు చక్క
కానీ ఎంచక్క
వయసే ఓ పుల్ల ఐసు
కరిగేలోపే బాసు
చూసేయ్ టేస్టు లేదంటే లాసు
వదిలేసేయ్ టెన్షన్సు
కుమ్మేసేయ్ పార్ఠీసు
కాలం పోతే రాదోయ్ రివర్సు
గజిబిజి పజిల్ లాంటి
చిక్కులున్న లైఫ్ రా
బ్రతుకున్న చుక్కలేని
కిక్కు లేదురా
ఏది ఏమైనా
మిస్సు కిస్సు లేనిదే
అన్నీ సున్నా కదరా…
చికెన్ ముక్క
లిక్కర్ చుక్క
సక్కని సుక్క
ఉన్నది నీ పక్క
సిక్కులదొంక
ఎందుకు ఇంక
డించకు చక్క
కానీ ఎంచక్క
ఎదకే గొడవొచ్చింది
నిదరే చెడ గొట్టింది
గుండెల్లోన మంటే పెట్టింది
అరెరె ఇష్కే పోయినా
అదిరే విస్కీ ఉందిరా
బాధేదుమున్నా బజ్జో కొడుతుంది
క్రోసిన్ మెడిసిన్‌లా
మందు కూడా చేదురా
మనసున గాయానికి
ఇదే మందురా
నాసా రాకెట్లా
పైన తిప్పుతాదిరా
స్వర్గం చూపుతుందిరా
చికెన్ ముక్క
లిక్కర్ చుక్క
సక్కని సుక్క
ఉన్నది నీ పక్క
సిక్కులదొంక
ఎందుకు ఇంక
డించకు చక్క
కానీ ఎంచక్క
చికెన్ ముక్క
లిక్కర్ చుక్క
సక్కని సుక్క
ఉన్నది నీ పక్క
సిక్కులదొంక
ఎందుకు ఇంక
డించకు చక్క
కానీ ఎంచక్క
********** *********
kanulalo neeru song super
True love end independent movie is superhit in recent days. all songs super hit. views are millions in youtube. please add lirics.