నీకే మనసు ఇచ్చా… లిరిక్స్
చిత్రం: కళ్యాణ రాముడు (1979)
సంగీతం: ఇళయరాజా, సత్యం
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి
దర్శకత్వం: జి.ఎన్.రంగరాజన్
నిర్మాణం: ఎం. కె. మావుళ్లయ్య
విడుదల తేది: 1979
పల్లవి :
ఆ… ఆహా… ఆఆహా… ఆ… ఆహా… ఆఆహా
ఆ… ఆహా… ఆఆహా… ఆ… ఆహా… ఆఆహా
ఆహా కన్నె చిలకా… ఆహాహా కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవనీ నిజమనీ వలపుల పాటలు పాడ వచ్చా
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా … అందుకే కోరి వచ్చా
చరణం 1 :
గాడిద పోలిన నడకలో… ఆ కాకిని పోలిన గొంతులో అ.. ఆ..
హంసను మించిన నడకలో… కోకిలనే మించిన గొంతులో
ఆశలు పొంగే పొంగి పొంగే… ఆశలు పొంగే పొంగి పొంగే
ఆ… తరువాతా.. మరచిపోయా.. ఆ… ఆ..
జ్ఞాపకం వచ్చె నాకూ… నీవు నా చిట్టి రాణీ..
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
చరణం 2 :
తీయని ముద్దొకటి ఇవ్వరాదే… నా కోరిక తీర్చుట తప్పుకాదే
తీయని ముద్దొకటి ఇవ్వరాదే… నా కోరిక తీర్చుట తప్పుకాదే
చక్కని చిలకా… టక్కరి నక్కా… అయ్యయ్యయ్యో.. మరచిపోయా..
ఆ.. చక్కని చిలకా … టక్కరి జింక… చక్కెర రంగులరవ్వా జాజి పూవా
నా మనసు ఇచ్చా మోజే మోసుకొచ్చా…
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
చరణం 3 :
తరగని ఊహలు రేగెనే నా తలపులు ఊయలలూగెనే
తరగని ఊహలు రేగెనే నా తలపులు ఊయలలూగెనే
కనకరించీ..పలకరించీ చేర రావే..కలిసిపోవే
పాడవేల నాతో..తోడుగా చిట్టిరాణీ
నీకే మనసు ఇచ్చా… అందుకే కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా … అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవనీ… నిజమనీ వలపుల పాటలు పాడ వచ్చా
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****