Kanne Manasulu (1966)

చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల
నటీనటులు: కృష్ణ , సంధ్యరాణి, సుకన్య
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత:
విడుదల తేది: 13.07.1966

పల్లవి:
ఓహో తమరేనా చూడవచ్చారు… చూసీ ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడవచ్చారు… చూసీ ఏం చేస్తారు

అమ్మమ్మ… అమ్మమ్మా … అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు… చూసీ ఏం చేస్తారు

చరణం: 1
సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా
సంతలోని జంతువును కాను సుమా
వంట యింటి కుందేలును అవను సుమా

ఎవరేమిటన్నా మగవాళ్ళకన్నా
మా వాళ్ళె మిన్నా నీ డాబు సున్నా..
వెళ్ళండి వెళ్ళండి మీ దారి మళ్ళండి…  డూ డూ డూ బసవన్నా

ఓ మామా….  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు… చూసీ ఏం చేస్తారు

చరణం: 2
అలుగుట తగదురా పెళ్ళి కుమారా
హాస్యములాడితిరా వలపుల చోరా
చెమటలు పోసినవా చెంగున వీతురా
చెమటలు పోసినవా చెంగున వీతురా
చెలరేగి నీ భరతం పట్టిస్తారా

ఓ మామా….  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు… చూసీ ఏం చేస్తారు

చరణం: 3
మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
మూడునాళ్ళ ముచ్చటకే మురిసినచో
ఆడపిల్ల బ్రతుకంతా హరోంహరా
పెళ్ళాడు రోజు ఉంటుంది మోజు
ఆపైన క్లోజు పడుతుంది బూజు
ఆనాడు ఈనాడు ఏనాడు మనువాడు ఇంతే రివాజు

ఓ మామా….  అయ్యో రామా
ఓహో తమరేనా చూడవచ్చారు… చూసీ ఏం చేస్తారు

******  *******   ******

చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  ఘంటసాల

పల్లవి:
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు
ఓ భామా…  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం: 1
ఆకతాయి రాలుగాయి అమ్మాయి
అంతకన్న గడుగ్గాయి అబ్బాయి
ఆకతాయి రాలుగాయి అమ్మాయి
అంతకన్న గడుగ్గాయి అబ్బాయి

మండేన ఒళ్ళు…  కొరికేవ పళ్ళు
ఎరుపెక్కె కళ్ళు…  అరికాళ్ళ ముళ్ళు
కోపాల తాపాల…  శాపాన రూపాన.. తొక్కేవు పరవళ్ళు..

ఓ భామా…  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం: 2
మూతిని ముడవకే ముద్దులగుమ్మా
ఆ..  ఆ…  ఆ..  ముచ్చటలాడితినే వలపుల రెమ్మా
ముసిముసి నవ్వులతో మోడీ చేతునే
ముసిముసి నవ్వులతో మోడీ చేతునే
కసిదీరా గుణపాఠం నేర్పిస్తానే

ఓ భామా…  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

చరణం: 3
కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు
చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు
కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు
చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు
అమ్మాయిగారు ముయ్యాలి నోరు
మాతోను మీరు సరిసాటి కారు
కన్నీరు మున్నీరు కాదండి పన్నీరు… తగ్గాలి మీ జోరు

ఓ భామా…  అయ్యో రామా
ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

ఓహో తమరేనా చూడ వచ్చారు.. చూసే ఏం చేస్తారు

******  *******   ******

చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దాశరథి
గానం: సుశీల

పల్లవి:
హ్మ్మ్..హ్మ్మ్మ్ …హ్మ్మ్..
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా

చరణం: 1
దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది
ఏటీ గాలికి పైట తొలిగిపోయింది… ఎగిరిపోయింది
దూరాన ఓ ఏరూ గలగలలాడింది.. గంతులేసింది
ఏటీ గాలికి పైట తొలిగిపోయింది… ఎగిరిపోయింది

ఎగిరిపోయిన పైట ఏమి సెప్పిందో… పైటలా మా బావ పెనవేసుకున్నాడు

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా

చరణం: 2
దూరాన ఓ మబ్బు తొంగి చూసింది…
సల్లగా ఓ సిన్న జల్లు కురిసింది
జల్లులో మా బావ  కళ్ళు కలిపాడు…
సిగ్గు ముంచేసింది… బుగ్గ తుంచేశాడు

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా

చరణం: 3
దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది
దూరాన మా బావ ఒళ్ళు తడిసింది.. ఒణికిపోయింది
ఒణికిపోయిన ఒళ్లు వాలిపోయింది.. సోలిపోయింది

సెంత చేరి సైగ చేసి సేతులు జాపాడు
నా వలపులోని వేడి తాను పంచుకున్నాడు

సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా
సిత్రంగా ఉన్నది ఈ ఏల.. ఊగిందినా మనసు ఉయ్యాలా
ఊగిందినా మనసు ఉయ్యాలా

******  *******   ******

చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల

పల్లవి:
వలపులో….
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే… కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే… కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో….

చరణం: 1
అందలం నే దిగి వచ్చాను… అందని మనసే ఇచ్చాను
అందలం నే దిగి వచ్చాను… అందని మనసే ఇచ్చాను
నీలో ఏదో ఉన్నదిలే.. అది నీతో నన్నే కలిపెనులే..

వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే…

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో….

చరణం: 2
కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
కనపడగానే కరిగిస్తావని కలలే ఎన్నో కన్నాను
ఉలకవు పలకవు ఎందుకని?… ఈ అలకకు కారణం ఏమిటని?

వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే…

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో….

చరణం: 3
మగవారంటే పగవారనుట… తగదని నేడే తెలిసింది
మగవారంటే పగవారనుట… తగదని నేడే తెలిసింది
నదులు కడలిలో చేరాలి… కలువ జాబిలి కలవాలి

వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే…

కలలలో రా రమ్మంటు పిలిచావులే
వలపులో….

******  *******   ******

చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

పల్లవి:
ఓ హృదయం లేని ప్రియురాలా
ఓ హృదయం లేని ప్రియురాలా
వలపును రగిలించావు
పలుకక ఊర్కున్నావు
ఏంకావాలనుకున్నావు
వీడేం కావాలనుకున్నావు

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

చరణం: 1
చిరుజల్లు వలే చిలికావు.. పెను వెల్లువగా ఉరికావు
చిరుజల్లు వలే చిలికావు..పెను వెల్లువగా ఉరికావు
సుడిగుండముగా వెలిశావు
అసలెందుకు కలిసావు…నన్నెందుకు కలిసావు..

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

చరణం: 2
అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు
అగ్గి వంటి వలపంటించి హాయిగ వుందామనుకోకు
మనసు నుంచి మనసుకు పాకి
ఆరని గాయం చేస్తుంది…అది తీరని తాపం ఔతుంది

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

చరణం: 3
నీ మనసుకు తెలుసు నా మనసు.. నీ వయసుకు తెలియదు నీ మనసు
నీ మనసుకు తెలుసు నా మనసు..నీ వయసుకు తెలియదు నీ మనసు
రాయి మీటితే రాగం పలుకును
రాయి కన్న రాయివి నీవు…కసాయివి నీవు

ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా

******  *******   ******

చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

పల్లవి:
ఈ ఉదయం…నా హృదయం
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది
పురులు విరిసి ఆడింది..పులకరించి పాడింది

ఈ ఉదయం..ఊ…ఊ…ఊ…ఊ…

చరణం: 1
పడుచు పిల్ల పయ్యెదలా…పలుచని వెలుగు పరచినది
పడుచు పిల్ల పయ్యెదలా…పలుచని వెలుగు పరచినది
కొండల కోనల మలుపుల్లో…కొత్త వంపులు చూపినది

ఈ ఉదయం…ఊ…ఊ….ఊ…ఊ..

చరణం: 2
చిగురాకులతో చిరుగాలీ…సరసాలాడి వచ్చినది
చక్కలిగింతలు పెట్టినదీ…వేసవికే చలి వేసినదీ
ఓ..ఓ..ఓహో…ఓ…ఓ…ఓహో…

ఈ ఉదయం….ఊ…ఊ…ఊ…ఊ…

చరణం: 3
సరస్సున జలకాలాడేదెవరో…తేటిని వెంట తిప్పేదెవరో
సరస్సున జలకాలాడేదెవరో…తేటిని వెంట తిప్పేదెవరో
రేయికి సింగారించే కలువో…పగలే వగలు రగిలే కమలమో…

ఈ ఉదయం…నా హృదయం..
పురులు విరిసి ఆడింది…పులకరించి పాడింది
ఈ ఉదయం…ఊ…ఊ…ఊ…ఊ

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Nene Ambani (2010)
error: Content is protected !!