చిత్రం: కన్నెవయసు (1973)
సంగీతం: సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: యస్. పి. బాలు
నటీనటులు: లక్ష్మీకాంత్, చంద్రమోహన్, రోజారమని
దర్శకత్వం: ఓ.యస్.ఆర్.ఆంజనేయులు
నిర్మాత: యస్.వి.నరసింహారావు
విడుదల తేది: 28.05.1973
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో…
నా మదిలో నీవై నిండిపోయెనే…
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో…
నీ రూపమె దివ్య దీపమై
నీ నవ్వులె నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే…
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో…
పాలబుగ్గలను లేతసిగ్గులు
పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్ల గాలితో
ఆటలాడగా రావే
పాలబుగ్గలను లేతసిగ్గులు
పల్లవించగా రావే
నీలిముంగురులు పిల్ల గాలితో
ఆటలాడగా రావే
కాలి అందియలు గల్లుగల్లుమన
కాలి అందియలు గల్లుగల్లుమన
రాజహంసలా రా…వే
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో…
నామదిలో నీవై నిండిపోయెనే…
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో…
చరణం: 2
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలురేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలురేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా…
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే…
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో…
నా మదిలో నీవై నిండిపోయెనే…
ఏ దివిలో విరిసిన పారిజాతమో
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో…
******** ******** ********
చిత్రం: కన్నెవయసు (1973)
సంగీతం: సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: జానకి
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..
తీయని సన్నాయి కోయిల వాయించే
తీయని సన్నాయి కోయిల వాయించే
తొలకరి మేఘాలు బాజాలు మోగించె
మల్లె పందిరేసింది మంచు చిందులేసింది
నెమలి పురివిప్పి నాట్యాలాడే
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..
హోయ్ కెరటాల చినుకులు జలకాలాడించె
ఆ కెరటాల చినుకులు జలకాలాడించె
పగడాల చివురాకు పైటను సవరించె
గాలి ఈల వేసింది.. తీగ కొంగులాగింది
కొంటె తుమ్మెదలు మాటేశాయి..
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన
సెలయేటి తీరాన అందాల తోటలోన
మందారం కన్ను విచ్చింది..
కన్నె మందారం కన్ను విచ్చిందీ..