Kanyadanam (1998)

చిత్రం: కన్యాదానం (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: శ్రీకాంత్ , ఉపేంద్ర , రచన బెనర్జీ
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాతలు: అంబికా కృష్ణ , ఇ. వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 1998

సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే
స్టిలు బాడీ చూపుల దాడికి
సరిగమపదమని సందడి మొదలైతే                                
అడ్డెందుకు ఈ పరదా
ఉంటేనే ఆ సరదా
అందాలే ఊరిస్తుంటే ఆగదే నా మనసు
బంధాలే లేకుంటేనే బంధినైపోనా
 
అరె సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సింగ్నల్ ఇస్తుంటే

చరణం: 1
చాకంటి గ్రీకుసుందరి పరిచాలే ప్రేమవాకిలి
పడకింటికి చూపునాకు దారి
సెంటర్లో కొంటె కృష్ణయ్య పదుగురిలో పోజులేలయా
నీ మీదే లవ్వుకేసువేశా
లవ్వాటే మిస్టేకయితే  శిక్షేంటో  చెబుతారా          
రెస్టంటు లేకుండానే ముద్దులలో ముంచాలి
ఏకాంతపు సాయంత్రం
ఈ కాంతే నీ సొంతం
పరుగెత్తే పరువంతోనే పందెం వేద్దామ

సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే

చరణం: 2
సుకుమారి స్వప్న సుందరి
మెరుపంటి మదన మంజరి
ముచ్చటగా ముద్దు తీర్చలేవా
వద్దండి అంత తొందర ముందున్నది అసలు పండగ
పద్ధతిగా కోర్సు ఉంది బాసు
లవ్ లొనే కోచింగిస్తే స్టూడెంటై సెటిలవుతా
ఆ సీనే మొదలైపోతే స్టాపంటు లేదంటా
సరదాలే తీర్చమ్మా
సరాసానికి రా ఇంకా
చిలకమ్మా…. చిక్కావంటే
చిత్రం చూపెడతా

సింగపూరు సింగారాలే
సరసకు రమ్మని సిగ్నల్ ఇస్తుంటే
స్టిలు బాడీ చూపుల దాడికి
సరిగమపదమని సందడి మొదలైతే
అడ్డెందుకు ఈ పరదా
ఉంటేనే ఆ సరదా
అందాలే ఊరిస్తుంటే ఆగదే నా మనసు
బంధాలే లేకుంటేనే బంధినైపోనా

చిత్రం: కన్యాదానం (1998)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు, చిత్ర

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో
అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో
వద్దయ్యో వద్దయ్యో అది మాత్రం వద్దయ్యో
వదిలేసి పొమ్మంటే వింటాన పాపాయో
చలిగాలి పడగెత్తి చెడ మడ చెడ మడ తరుముతు ఉంటే
అబ్బాయో ఓరబ్బాయో అది తగదంట వినవయ్యో
అవకాశం అహా కుదిరక  ఎగబడిపోనా అమ్మాయో

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో
అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో

చరణం: 1
లైలాకి వచ్చింది  లైసెస్సు ఇక చేయాలి మజ్నుతో
మగవాడికుండాలి లవ్ సెన్సు
అది ఉందంటే ఇస్తాను
ఆపలేనే ఓపలేనే చలికులుకుల చిలకమ్మో
జోడుకోసం గోడదూకే కసి వయసిది వినవయ్యో
కన్నె కోసం వెన్నెల నేనై వేచి ఉన్న
అందగత్తె ముందరికొస్తే తొందరేలా
ఒడి చేరాక మోమాటమా

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అయ్యయ్యో
అసలైన అయ్యయ్యో ముందుందే అమ్మాయో

చరణం: 2
ఊపందుకున్నాది వయ్యారి ఇక ఊరింపు చాలంట
సిద్ధంగా ఉన్నాడే అబ్బాయి తబ శృంగార పాటలు
బుజ్జగించొ  బుగ్గగిచ్చో  చెలి సొగసుని గమనించు
ముత్యమంత ముద్దుబెట్టి సరిగమలను పలికింపు
లాయీ లాయీ జిలాయీ లాయీ చేయి వేస్తే
దాయి దాయి పందాలు కాయి జాతరేలే
కసి మేళాలు మోగాలయో

అయ్యయ్యో అయ్యయ్యో ఎవయ్యిందో అమ్మాయో
అసలైన అయ్యయ్యో ముందుందోయ్ అబ్బాయో
వద్దమ్మో వద్దమ్మో  అది మాత్రం వద్దమ్మో
వదిలేసి పొమ్మంటే పోతానా బుజ్జాయో
చలిగాలి పడగెత్తి చెడ మడ చెడ మడ తరుముతు ఉంటే
అమ్మాయో అరె అమ్మాయో అది తగదంట అమ్మాయో
అవకాశం అహా కుదిరింది ఇక ఎగబడిపోవోయ్ అబ్బాయో

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Wanted (2011)
error: Content is protected !!