Karthikeya (2014)

చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: వనమాలి
గానం: చిన్ని చరణ్
నటీనటులు: నిఖిల్ , స్వాతి
దర్శకత్వం: చందూ మొండేటి
నిర్మాత: వెంకట్ శ్రీనివాస్
విడుదల తేది: 24.10.2014

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా
నిను దర్శించి దరి చేరి వలచేందుకు
సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా

నిను వర్ణించి ఒకసారి పిలిచేందుకు
చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం
కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే
స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా
స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా
స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా
ను… స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా

నిను దర్శించి దరి చేరి వలచేందుకు

ఏంటా నవ్వడం చూడడం గుండెనే కోయడం
దూరమే పెంచడం ఎందుకూ ఈ ఎడం
మనసుకు తెలిసిన మాట పలకదు పెదవుల జంట

ఎదురుగ నువు రాగానే నాకేదో అవుతోందట
కనుల ముందు నువ్వు నించున్నా నే కళ్ళు మూసి కలగంటున్నా
అందులోనే తేలిపోతూ నీడలాగా నీతో ఉన్నా
స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా
ను… స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా
స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా
ను… స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా

నిను దర్శించి దరి చేరి వలచేందుకు

నింగే పిడుగులే వదిలినా పూవులే తడిమినా
ఉరుములే పంచినా స్వరములే దోచినా
కలవని అపశకునాలే శుభ తరుణములుగ తేలే
వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే
ఎన్ని ఆపదలు వస్తున్నా అవి నన్ను ఆదుకొని కాచేనా
కలిసి వచ్చే వింతలన్నీ ఖచ్చితంగా నీ మహిమేనా
ఒఓ ఒఓఓఒ… ఓఓఓఒఒఒ…
ఒఓ ఒఓఓఒ… ఓఓఓఒఒఒ…
ఒఓ ఒఓఓఒ… ఓఓఓఒఒఒ…
ఒఓ ఒఓఓఒ… ఓఓఓఒఒఒ…
నిను దర్శించి దరి చేరి వలచేందుకు

********   *********   ********

చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రంజిత్

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో ఏ చోటో లేదురా
శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంట
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా… బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా… అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే…. ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

పలు రంగులు దాగి లేవా పైక్కనిపించే తెలుపులోన
చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏ జవాబు తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించారా
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా… బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా… అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే నింగినే … నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం … లేకుంటే ఎలా

ఎపుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట
ఎదిగే ప్రతి మలుపుతోను మార్చలేదా మనిషి బాట
తెలియని తనమే పునాది… తెలిసిన క్షణమే ఉగాది
తెలివికి గిరిగీత ఏది… ప్రయత్నించరా
ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా… బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా… అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ
ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

********   *********   ********

చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: చిన్మయి

ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను తెరచాటుగా నిను చూసాను
మాయవో నువు ఆశవో  నువు వీడనీ తుది శ్వాసవో
రాయని ఓ గేయమో  నువు ఎవరివో హలా…
ఇంతలో ఎన్నెన్ని వింతలో  అలవాటులో పొరపాటులెన్నెన్నో

పరిచయమే పరవశమై నిన్ను నాతో కలిపింది
వ్రాసిందే జరిగింది అయినా కలలా ఉంది
ఒకటయ్యాక మీలో ఇక  నీతో ఉంటామరి నేనిక
లేనే లేదిక తీరిక ఇది మనసులో కలయిక
ఇంతలో ఎన్నెన్ని వింతలో  అలవాటులో పొరపాటులెన్నెన్నో

********   *********   ********

చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నరేష్ అయ్యర్

ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో తెరచాటుగా నిను చూసానో
ఆయువో నువు ఆశవో నువు వీడని తుది శ్వాసవో
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో

చిరునవ్వే నీ కోసం పుట్టిదనిపిస్తుందే
నీ ప్రేమే పంచావో గమ్యం అనిపిస్తుంది
పడిపోయా నేనే నీకికా
నువు ఎవరవరైతే అరె ఎంటికా
ఉందో లేదో తీరిక ఈ రేయి ఆగాలికా …ఓఓఒ
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో

పైకెంతో అణకువగా సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది
వ్రాసుందో లేదో ముందుగా నువు కలిసావో ఇక పండుగ

ఉన్నావే నువే నిండుగా నా కలలకే రంగుగా..ఓఒ
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో తెరచాటుగా నిను చూసానో
ఆయువో నువు ఆశవో నువు వీడని తుది శ్వాసవో
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా
ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పొరపాటులెన్నెన్నో

********   *********   ********

చిత్రం: కార్తికేయ (2014)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిచరన్

పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ
నిజమును ముసిరిన నివురది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
నిదురను చెరిపిన కలవరమేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
వెలుగుకు వెనుకన వివరము ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
వేలుకు కొలువున విలయమదేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
 పలు ప్రశ్నలకొక బదులది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
తలపును తొలిచెను తరగని చీకటి చీకటి చీకటి
నరుడా గురుడా ఎవరా మూలము
కాలుని పాశమై కదిలెను కాలము
జరిగెటిదిదియే దైవ మహత్యము
కానిచొ ఇదియే మానవ యత్నము
తెలియునదెప్పుడీ మాయ రహస్యము
తెలియుట మాత్రమ-వశ్యమ-వశ్యము
బ్రతుకొక తపముగా పరుగిడు పయనము
తలవని మలుపుగ కనుగొను విజయము
ఆఆఆఆఆఅ….
ఆఆఆఆఅఆ…

పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ

error: Content is protected !!