చిత్రం: కౌసల్య సుప్రజ రామ (2008)
సంగీతం: కోటి
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: ఎన్. సి. కారుణ్య, యమ్. యమ్. శ్రీలేఖ
నటీనటులు: శ్రీకాంత్, ఛార్మి, గౌరి ముంజల్
దర్శకత్వం: సూర్య ప్రసాద్
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 2008
మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో
కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో
వినవే చెలీ నా వలపుల గుస గుస వెంటే ఉంటా జతగా
వింటే తంటా నీ పరుగుల పదనిస వస్తామరీ ఘాటుగా
మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో
హే కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో
ఊరించే నీ కళ్ళల్లో ప్రేమకు ఊరు పేరుందంటా
చిరునవ్వే నీ చిరునామా దొరికిందీనాడే
వసంతమాడే వయస్సే గుభాళించే వయస్సు వచ్చి మనస్సే ఘుమాయించే
ఈడొస్తే ఇంతేనమ్మి ఈల పాటలా సంతేనమ్మి ఇద్దరొక్కటై పోదామోలమ్మి
ఓ మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో
హే కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో
మనసిచ్చే నీమాటల్లో నాకొక తోడూ నీడుందంటా
తొలిప్రేమే జీవితభీమా కుదిరిందీనాడే
గులాబి పూలే పెదాలై కలేస్తుంటే సునామి ఈడు సుఖంగా మెలేస్తుంటే
ప్రేమిస్తే ఇంతేనయ్యో పెదవిదాటని గొంతేనయ్యో ముద్దులాటకి అంతేలేదయ్యో
హా మనసుకే పుట్టిన చిగురనుకో వయసుకే ఎక్కిన పొగరనుకో
హా కలయికే కమ్మని కల అనుకో కదలికే కౌగిలి కబురనుకో