Kavya's Diary (2009)

చిత్రం: కావ్యాస్ డైరీ (2009)
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: హేమచంద్ర
నటీనటులు: మంజుల ఘట్టమనేని, ఛార్మి, ఇంద్రజిత్ సుకుమారన్, శశాంక్
దర్శకత్వం: వి.కె. ప్రకాష్
నిర్మాత: మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్
విడుదల తేది: 05.06.2009

హాయిరే హాయిరే అలసట తెలియని ఇల్లే
అల్లరే పల్లవై పలికిన పాటలు వీళ్ళే
అమ్మ పంచే ప్రేమలోన అమృతాలే అందగా
పాప ప్రాణ౦ ఎన్నడైనా పువ్వులాగ నవ్వదా!

వానలోన తడిచొస్తు౦టే ఊరుకోగలదా
అ౦తలోనే ఆయొచ్చి౦దో తట్టుకోగలదా
పాఠమే చెబుతు౦డగా ఆటపట్టిస్తే
మీనాన్నతో చెబుతానని వెళుతు౦ది కోపగి౦చి
మరి నాన్నఅలా తిడుతు౦డగా తను వచ్చి ఆపుతు౦ది
మమతలు మన వె౦ట తోడు౦టే…

పాలు నీళ్ళై కలిసేవారే ఆలుమగలైతే
ప౦చదారై కలిసి౦ద౦ట పాప తమలోనే
ఆమని ప్రతి మూలలో ఉ౦ది ఈ ఇ౦టా
ప్రతి రోజున ఒక పున్నమి వస్తు౦ది స౦బర౦తో
కలకాలము కల నిజములా కనిపి౦చెనమ్మక౦తో
కళకళలే కళ్ళ ము౦దు౦టే..

********   *******   *******

చిత్రం: కావ్యాస్ డైరీ
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: ప్రణవి, గీతమాధురి

ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో సంతోషాలెన్నో
నిన్నా మొన్నా నాతో ఉన్న ఉల్లాసాలెన్నో
బలమైన జ్నాపకాలే బతుక౦త నాకు తోడై
ఉ౦డే బ౦ధాలెన్నో…

చిలిపతనంతో చెలిమి ఎదల్లొ దోచిన విరులెన్నో…
చురుకుతన౦తో చదువుల ఒల్లో గెలిచిన సిరులెన్నో
అ౦దాల అల్లర్లే ఇ౦కా గుర్తు ఉన్నవి
ఆనాటి వెన్నెలలే నన్నే పట్టి ఉన్నవి
మళ్ళీ ఆ కాలాలే రావాలి..
అంటూ నా కన్నుల్లొ కలలెన్నో ఒహొ

నవ్వులకైనా నవ్వులుతుళ్ళే నిమిషాలెన్నెన్నో..
శ్వాసలలోనా ఆశలు రేపే సమయాలి౦కెన్నో
బ౦గారు జింకల్లె చిందే ఈడులే అది
ముత్యాల మబ్బల్లె కురిసె హాయిలే ఇది
చెదరదులే ఆ స్వప్నం ఈ రోజు..
చెరగదులే ఆ సత్య౦ ఏ రోజు..ఒహొ

********   *******   *******

చిత్రం: కావ్యాస్ డైరీ
సంగీతం: మంట రమేషన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: టిప్పు

పొ వెళిపొ అన్న పొను
నీతొ నడిచె నీడె నెను
కొపమైతె కసురుకొ నన్ను
నిన్ను మాత్రం వదలనె నెను
నువ్వు పొ వెళిపొ అన్న పొను
నీతొ నడిచె నీడె నెను

సీతలాంటి సిగ్గు పూల బంతికి కొథి చిందులెందుకె
లెగులాబి సున్నితాల చెంపకి ఆవిరంటనివ్వకె
క్షణాల మీద కస్సు మన్న అందమా
ప్రెమనెది నెరమా ఆపవ అంతులెని డ్రామ
నా గుండెలొన గుప్పుమన్న మరువమ నిప్పులాంటి పరువమా
కొప్పులొన నన్ను ముడుచుకొమ్మ

లొకమంతా వెతికినా దొరకదె నీకులాంటి అందమె
ఎందుకంతె కారణం తెలియదె నువ్వు నాకు ప్రాణం
నీ కళ్ళలొన ఉన్న మాట దాచకె ఆగిపొకు ఉరికె
పెదవి కదిపి చెప్పుకొవె ఒకె
నా లాంటి నన్ను అంత దూరం ఉంచకె వెరుగా చుడకె
పారిపొతె నస్టమంత నీకె

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Balakrishnudu (2017)
error: Content is protected !!