Keechurallu (1991)

చిత్రం: కీచురాళ్లు (1991)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: మనో , చిత్ర
నటీనటులు: భానుచందర్ , శరత్ బాబు, శోభన, పాప్ సింగర్ ఉషా ఉతఫ్ , బేబీ షామిలి, శివాజీ రాజా, రవిశంకర్, మహర్షి రాఘవ, డిస్కో శాంతి
దర్శకత్వం: గీతాకృష్ణ
నిర్మాతలు: ముళ్లపూడి రాంబాబు, కె.యల్. దుర్గేష్
విడుదల తేది: 1991

పల్లవి:
జమ్మాయ్ జమ్మా జమ్మాయ్ జమ్మా
పొద నీడలో కథ పెంచుకో
అబ్బాయి గువ్వా అవ్వాయ్ చువ్వా
పెదవందుకో సుధ పంచుకో
నీవెంట వస్తున్న చైత్రాలు
పుష్య రాగాలు తీసేనులే
క్రీగంట కాస్తున్న గ్రీష్మాలు
వర్షగీతాలు రాసేను నాలో

జమ్మాయ్ జమ్మా జమ్మాయ్ జమ్మా
పొద నీడలో కథ పెంచుకో
అబ్బాయి గువ్వా అవ్వాయ్ చువ్వా
పెదవందుకో సుధ పంచుకో

చరణం: 1
నీ నయనాలు కురిసే వలపే
నా పరువంలో అలలై కలలే కదిపే
అవి ఈ మధుమాసపు రాత్రులలోనా
రస దేశాలెన్నెన్నో పరిచే
ప్రేమ అనేది ఆలాపనైతే జీవన రాగాలే
ప్రేయసి మీద కావ్యాలు రాసే చంపక హారాలే
ఆరనీ ఈ జన్మ గంధాలు పువ్వులా దాచుకోదా
తీరనీ ఈ తేనె దాహాలు తుమ్మెదై దోచుకోనా

జమ్మాయ్ జమ్మా జమ్మాయ్ జమ్మా
పొద నీడలో కథ పెంచుకో
అబ్బాయి గువ్వా అవ్వాయ్ చువ్వా
పెదవందుకో సుధ పంచుకో

చరణం: 2
ఈ నిమిషాన గతమే తలచే
ప్రేమ పురాణం నిజమై ఎదుటే నిలిచే
అది నా ఉదయానికి ఊపిరి పోసి
మృతురాగలెన్నెన్నో పలికే
ఈ ఎడబాటే కాలాలు దాటి చేరెను కౌగిల్లే
ఆ విరహాల నా ధ్యానమంత చిందెను కన్నీళ్లే
సందెలో నీ సప్త వర్ణాల అందమే పాడుకోనా
మౌనమై నీ మంత్ర పుష్పాల మల్లెనై రాలిపోనా

జమ్మాయ్ జమ్మా జమ్మాయ్ జమ్మా
పొద నీడలో కథ పెంచుకో
అబ్బాయి గువ్వా అవ్వాయ్ చువ్వా
పెదవందుకో సుధ పంచుకో
నీవెంట వస్తున్న చైత్రాలు
పుష్య రాగాలు తీసేనులే
క్రీగంట కాస్తున్న గ్రీష్మాలు
వర్షగీతాలు రాసేను నాలో

జమ్మాయ్ జమ్మా జమ్మాయ్ జమ్మా
పొద నీడలో కథ పెంచుకో
అబ్బాయి గువ్వా అవ్వాయ్ చువ్వా
పెదవందుకో సుధ పంచుకో

error: Content is protected !!