సత్యం పలికే… హరిశ్చంద్రులం… లిరిక్స్
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శక్తి
గానం: హనీ
నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాణం: సుంకర మధుమురళి
విడుదల తేది: 29.11.2002
దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్ , త-ధీమ్-త-నక్-చిక్ ;;
దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్-త , ధి-నక్-చిక్ ;
దోం-ధి-నక్-చిక్ , త-ధీమ్-త-నక్-చిక్ ;;
హోయ్…
మ్మ్మ్మ్… తికమక పెట్టే.. అమాయకత్వం.. మ్మ్…
చక చక లాడే… వేగం… మ్మ్…
అలాగ ఉంటాం… ఇలాగ ఉంటాం…
ఆకతాయిలం మేము… ఊ… మ్మ్మ్మ్.. మ్.మ్.మ్.మ్..
రే… చెప్పేదేదో.. అర్థమయ్యేట్టు చెప్పురా….
అరె భాయ్.. ఇస్ట్రైట్గానే.. చెప్తా.. ఇనుకో…
హే… సత్యం పలికే… హరిశ్చంద్రులం
సత్యం పలికే… హరిశ్చంద్రులం
అవసరానికో… అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం…
రోజూ… తన్నుకు చస్తాం…
హొయ్… హొయ్…
హొయ్ సత్యం పలికే… హరిశ్చంద్రులం
అవసరానికో… అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం…
రోజూ… తన్నుకు చస్తాం…
నమ్మితె ప్రాణాలైనా.. ఇస్తాం…
నమ్మడమేరా… కష్టం…
అరె, ముక్కుసూటిగా ఉన్నది చెప్తామ్…
నచ్చకుంటే నీ ఖర్మం…
అరె, కష్టమొచ్చినా… కన్నీళ్లొచ్చినా…
చెదరని నవ్వుల ఇంద్రధనసులం…
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
అరె , మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
ఉఊఊ.. ఉఉఉ, ఉఊఊ.. ఉఉఉ,
ఉఊఊ.. ఉఉఉ ఉ ఉ ఉ ఉ ఊ…
వందనోటు జేబులొవుంటే.. నవాబు నైజం.. మ్మ్..
పర్సు ఖాళీ అయ్యిందంటే.. పకీరుతత్వం.. మ్మ్.. మ్మ్..
కళ్లులేని ముసలవ్వలకూ.. చెయ్యందిస్తాం..
పడుచు పోరి ఎదురుగ వస్తే.. పళ్ళికిలిస్తాం..
ప్రేమా.. కావాలంటాం.. పైసా.. కావాలంటాం..
ఏవో.. కలలే కంటాం… తిక్క తిక్కగా.. ఉంటాం..
ఏడేళ్లయినా టీవీ.. సీరియల్, ఏడుస్తూనే చూస్తాం…
తోచకపోతే.. సినిమాకెళ్లి.. , రికార్డు డాన్సులు చేస్తాం…
కోర్టు తీర్పుతో.. మనకేం పనిరా.. , నచ్చినోడికోటేస్తాం…
అందరు దొంగలె , అసలు దొంగకే , సీటు అప్ప జెప్పిస్తాం…
రూలూ… ఉంది హ హ రాంగూ… ఉంది హెయ్ హెయ్
రూలూ… ఉంది, రాంగూ…. ఉంది
తప్పుకు తిరిగే… లౌక్యం ఉంది…
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
అరె , మే… మే… , ఇండియన్స్
దోం-చి-నక-దోం , ధి-నక-దోం ; దోం-చి-నక-దోం , ధి-నక-దోం ;
వందేమాతరం… , వందేమాతరం ;
(దోం-చి-నక-దోం , ధి-నక-దోం ; దోం-చి-నక-దోం , ధి-నక-దోం)
వందేమాతరం… , వందేమాతరం ;
(దోం-చి-నక-దోం , ధి-నక-దోం ; దోం-చి-నక-దోం , ధి-నక-దోం)
వందేమాతరం… , వందేమాతరం… , వందేమాతరం… , వందె-మాతరం ;
వందేమాతరం… , వందేమాతరం… , వందేమాతరం… , వందేమాతరం…
కలలూ.. కన్నీళ్ళెన్నో.. మనకళ్ళల్లల్లో…
ఆశయాలు , ఆశలు ఎన్నో.. మన గుండెల్లో…
శత్రువుకే ఎదురు నిలిచినా.. , రక్తం మనదీ…
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన , దేశం మనదీ…
ఈశ్వర్-అల్లా-యేసు , ఒకటే… కదరా బాసు
దేవుడికెందుకు జెండా… ఆ.. కావాలా పార్టీ.. అండా.. ఆ…
మాతృభూమిలో మంటలు రేపే.. , మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చుపెట్టినా.. , లుఛ్చాగాళ్ళ పనిపట్టు
భారతీయులం ఒకటే… నంటూ… , పిడికిలెత్తి జై కొట్టు
కుట్రలు చేసే.. శత్రుమూకలా.. , తోలుతీసి ఆరబెట్టూ..
దమ్మే.. ఉందీ… హా హా
ధైర్యం ఉందీ… హా హా
దమ్మే.. ఉంది.. , ధైర్యం ఉంది..
తలవంచని తెగ పొగరే… ఉందీ…
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
అరె , మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
మే… మే… , ఇండియన్స్
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
అహ అల్లరి అల్లరి చూపులతో… లిరిక్స్
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: సుద్దాల అశోక్ తేజ
నేపధ్య గానం: చిత్ర, రఖ్వీబ్
అహ అల్లరి అల్లరి చూపులతో..
ఒక గిల్లరి మొదలాయే..
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
చిరుగిల్లుడు షురువాయే..
అరె చెక్కిలి గిలి గిలి గింతాయే..
ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే..
ఈ రాతిరి దయవలన…
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా…. అరె
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా….
బుగ్గే నిమురుకుంటే నాకు
అరె మొటిమై తగులుతుంటడే..
లేలేత నడుములోని మడత
తన ముద్దుకై వేచి ఉన్నదే..
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ..
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే..
మొత్తం నేలమేది మల్లెలన్నీ..
తన నవ్వుల్లో కుమ్మరిస్తడే…
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా….అరె
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా
ఆ… ఆ.. అఆ.. అఆ..
ననెనా.. ననెనా..
పనినిససస నిసగరినిస
పనినిససస నిసగరినిప
పనినిససస నిసగరినిస
పనినిససస నిసగరినిప
మమప నీప నీప నిసనిప
మమప నీప నీప రిసనిప
మమప నీప నీప నిసనిప
మమప గగ పగగప…
పేరే పలుకుతుంటే చాలు
నా పెదవే తీయగవుతదీ..
కనుచూపే తాకుతుంటే నన్ను
అబ్బ నా మనసు పచ్చిగవుతదీ..
మెరిసే మెరుపల్లె వానోస్తే అబ్బ
నా గుండెలోన పిడుగు పడుతుంటదే..
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే.. ఇక
నా ఊపిరాగిపోతదే…
తాన్న దీన్న తాన్న తన్నినారే..
తళాంగు తక్కదిన్నా…. అరె
తాన్న దీన్న తాన్న తన్నినారే..
తళాంగు తక్కదిన్నా….
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
గోవిందా గోవిందా… లిరిక్స్
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: చ్రావూరు విజయకుమార్
నేపధ్య గానం: శ్రీ
గోవిందా గోవిందా… గోవిందా గోవిందా…
నుదిటిరాతలు మార్చేవాడా.. ఉచితసేవలు చేసేవాడా..
లంచమడగని ఓ మంచివాడా.. లోకమంతా ఏలేవాడా..
స్వార్థమంటూ లేనివాడా.. బాధలన్నీ తీర్చేవాడా..
కోర్కెలే నెరవేర్చేవాడా.. నాకు నువ్వే తోడూ నీడా..
గోవిందా… గోవిందా… గోవిందా… గోవిందా…
అరె బాగు చెయ్ నను గోవిందా… బాగు చెయ్ నను గోవిందా…
జూబ్లిహిల్స్ లో బంగ్లా ఇవ్వు… లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు
హైజాక్ అవ్వని ఫ్లైటొకటివ్వు… వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు
పనికిరాని చవటలకిచ్చి, పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి, కోట్లకధిపతి చెయిరా వచ్చీ…
గోవిందా… గోవిందా…
బాగు చేయ్ నను గోవిందా..
పైకి తే నను గోవిందా..
గోవిందా… గోవిందా…
పెట్రోలడగని కారు ఇవ్వు… బిల్లు అడగని బారు ఇవ్వు
కోరినంత ఫూడ్డు పెట్టి డబ్బులడగని హోటల్ ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకరు పోస్టో.. రాజ్యసభలో ఎం.పీ సీటో..
పట్టుబడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాములా.. సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు… లాసుకాని షేరులివ్వు
సింగిల్ నంబరు లాటరీలివ్వు
టాక్సులడనగి ఆస్తులివ్వు…
పనికిరాని చవటలకిచ్చి, పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
పనికిరాని చవటలకిచ్చి, పరమ బేవార్స్ గాళ్ళకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి, కోట్లకధిపతి చెయిరా వచ్చీ..
గో… గో… గో…
గోవిందా… గోవిందా…
బాగు చేయ్ నను గోవిందా..
వందనోట్ల తోటలివ్వు… గోల్డు నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యిటన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాసు హీరో చాన్సులివ్వు…. హిట్టు సినిమా స్టోరీలివ్వు
స్లిమ్ముగున్న సొమ్ములున్న హీరోయిన్నే వైఫుగ ఇవ్వు
హాలీవుడ్ లో స్టుడియో ఇవ్వు… స్విస్సు బాంకులో బిలియన్లివ్వు
కోట్లు తెచ్చే కొడుకులనివ్వు… హీరోలయ్యే మనవళ్ళనివ్వు
నన్ను కూడా సీ.ఎం చెయ్యి.. లేకపోతే పీ.ఎం చెయ్యి
తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోనీ లైఫు నియ్యీ…
గోవిందా… గోవిందా… గోవిందా… గోవిందా…
బాగు చెయ్ నను గోవిందా..
బాగు చెయ్ నను గోవిందా..
పైకి తే నను గోవిందా
గోవిందా… గోవిందా…
లక్కుమార్చి నను కరుణిస్తే..
తిరుపతొస్తా త్వరగా చూస్తే..
ఏడుకొండలు ఏ.సీ చేస్తా… ఎయిత్ వండరు నీ గుడి చేస్తా…
గో గో గో.. గోవిందా… గోవిందా…
ఏడుకొండలు ఏ.సీ చేస్తా…
బాగు చెయ్ నను గోవిందా..
ఎయిత్ వండరు నీ గుడి చేస్తా…
గోవిందా… గోవిందా…
ఏడుకొండలు ఏ.సీ చేస్తా…
గోవిందా… గోవిందా…
ఎయిత్ వండరు నీ గుడి చేస్తా…
అయ్ బాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటి..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
నువ్వు నువ్వు నువ్వే నువ్వు… లిరిక్స్
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సుమంగళి
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ ముగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ…
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వూ నువ్వూ
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ… నువ్వూ…
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ నువ్వూ
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ నువ్వూ… నువ్వూ…
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ…
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
ముసుగు వెయ్యద్దు మనసు మీద… లిరిక్స్
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కల్పన
ఊఁ ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
హే ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా
మనకు తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా
హా ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
సూర్యుడైనా చూపగలడ రేయిచాటున్న రేపుని
అఁ చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
హా దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ
ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ల ముందుండగా
అందుకోకుండా ఆగిపోతూ ఉసూరు మంటే ఎలా…?
ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ ఈ వయస్సునిలాగె కరిగిపోనీకు
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఊఁ ముసుగు వెయ్యద్దు, వలలు వెయ్యద్దు
ఎగరనివ్వాలి, తుఫాను వేగాలతో…
కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా
కోటలైనా కొంపలైనా ఏవీ స్ధిరాస్ధి కాదుగా
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా
నిన్న లేవైనా గుర్తుకొస్తే తీపి అనిపించనీ
ఉన్నకొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ
నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలసినడుద్దాం
సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
ఎగరనివ్వాలి కుర్రాళ్లరెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదం కాదనే వారె లేరురా
మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటె ఏంటిరా
ముసుగు వెయ్యద్దు మనసు మీద
వలలు వెయ్యద్దు వయసు మీద
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
ఖడ్గం ఖడ్గం… లిరిక్స్
చిత్రం: ఖడ్గం (2002)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
ఓం… ఓం…
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఓంకారనాదంతో అంకురించిన
వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం
హ్రీంకారనాదంలో సంచరించే
ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం
యుగయుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా తరలి వచ్చిన చరిత ఈ ఖడ్గం
తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్నుపాలైనా
క్షణమైన తన గాథ గతములో విడిచి
ధ్రుతి ఒడి చేరనిదీ ఖడ్గం
ఊటతో పడమరను దాటి పూర్వార్ధిపై నిత్య ప్రభాతమై వెలుగుతున్నదీ భరత ఖడ్గం
కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం
కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహాద్భుతం ఉన్నదీ ఖడ్గం
మూడువన్నెల కేతముగ మింటికి ఎగసి
కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
హరిని ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరునిలో దైవాంశనే దర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షణకై ధరించిన ధీరగుణమీ ఖడ్గం
ధూర్తశిక్షణకై వహించిన కరకుతనమీ ఖడ్గం
హూంకరించి అహంకరించి
అధిక్రమించిన ఆకతాయిల
అంతు చూసిన క్షాత్రసత్వం
అస్తమించని అర్థఖడ్గం
శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన
అన్ని జాతుల పొదువుకున్న ఉదారతత్వం
జగతి మరువని ధర్మఖడ్గం
నిద్దుర మత్తును వదిలించే గెంజాయల జిలుగీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
మట్టిని చీల్చుకు చిగురించే సిరి పచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
గెంజాయల జిలుగీ ఖడ్గం
తెలతెల్లని వెలుగీ ఖడ్గం
సిరిపచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****