Khaidi (1983)

చిత్రం: ఖైదీ (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, మాధవి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.దనుంజయ రెడ్డి
విడుదల తేది: 28.10.1983

పల్లవి:
మెర మెర మెరుపుల మేనకనీ
ప్రణయ సంకలపు సారికనీ
మనసిత మలయిజ వీచికనీ
మాం పా సిస్తే నీసేవికనే

నా గాధ వినరా గాధేయా
నా గాధ వినరా గాధేయా
నీ తపము మాని నా తపన తీర్చరా
వ్యతము లేలరా రస జగము లేలరా
సురలు నరులు చూడలేని సుఖము నీదిరా

ఎగిరింది ఎగిరింది తన ఉదక మండలం
సడలింది సడలింది ముని తపో నిశ్చయం
నిష్టుర నీరస నిశ్చల తాపసి హృదయం
గెలిచింది ఆ క్షణమే మేనక ప్రణయం

వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే
అందాలో జన్మ గంధాలో రాగ బంధాలో
శకుంతమై వసంత గీత మాలపించగా

చరణం: 1
ఋషి కత మారే రసికత మీరే
చెలి నీ కౌగిళ్ళకే స్వర్గాలెన్నో చేరే
సరసకు చేరే సరసుని కోరే
వలపు వాకిళ్లల్లో సాక్షాలెన్నో చూచే
యజ్ఞము యాగము సోమము నియమము నీరాయే నీ చూపుకే మోహినీ
అందము చందము నవ్విన యవ్వన రాగాలు నీకోసమే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే

చరణం: 2
మల్లెల బాణం తగిలెను ప్రాణం
రగిలే దాహాలలో మోహాలెన్నో రేగే
మదవతి రూపం మదనా లాపం
పిలిచే రాగాలలో లోకాలన్నీ ఊగే
ఇంద్రుడు చంద్రుడు జీవుడు దేవుడు నీ రూపమైపోయే ఓ కౌశికా
మంత్రము శాస్త్రము యోగము భోగము నే ధారపోశానులే
వేదం నాదం మోదం మోక్షం అన్నీ నీలో చూశానే
శిల్పం నాట్యం గీతం లాస్యం చూసే నేను వచ్చాలే

*****   *****   *****

చిత్రం: ఖైదీ (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
రగులుతోంది మొగలి పొద
గుబులుగుంది కన్నె ఎద
రగులుతోంది మొగలి పొద
గుబులుగుంది కన్నె ఎద..
నాగినిలా వస్తున్నా
కౌగిలినే ఇస్తున్నా…
కాటేస్తావో..ఓ..ఓ… మాటేస్తావో..ఓ..ఓ..

రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
నాగశ్వరమూదేస్తా.. నాలో నిను కలిపేస్తా..
కాటేస్తాలే..ఏ..ఏ… వాటేస్తాలే..ఏ…

రగులుతోంది మొగలి పొద..వగలమారి కన్నె ఎద..

చరణం: 1
మసక మసక చీకట్లో… మల్లె పువ్వు దీపమెట్టి..
ఇరుకు ఇరుకు పొదరింట్లో… చెరుకుగడల మంచమేసి..
విరహంతో..ఓ..ఓ.. దాహంతో..ఓ..ఓ..
మోహంతో ఉన్నా … నాట్యం చేస్తున్నా…

నా పడగ నీడలో… నీ పడక వేసుకో…
నా పెదవి కాటులో మధువెంతో చూసుకో…
కరిగిస్తాలే…ఏ..ఏ.. కవ్విస్తాలే..ఏ..ఏ..
తాపంతో ఉన్నా.. తరుముకు వస్తున్నా…

రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
రగులుతోంది మొగలి పొద.. గుబులుగుంది కన్నె

చరణం: 2
పున్నమంటి ఎన్నెల్లో… పులకరింత నీకై మోసి..
మిసిమి మిసిమి వన్నెల్లో.. మీగడంత నేనే దోచి..
పరువంతో..ఓ..ఓ.. ప్రణయంలా…ఆ..ఆ.ఆ
తాళం వేస్తున్నా.. తన్మయమౌతున్నా…

ఈ పొదల నీడలో.. నా పదును చూసుకో..
నా బుసల వేడితో… నీ కసినే తీర్చుకో..
ప్రేమిస్తావో..ఓ..ఓ.. పెనవేస్తావో..ఓ..ఓ..
పరవశమౌతున్నా… ప్రాణం ఇస్తున్నా…

రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
నాగినిలా వస్తున్నా కౌగిలినే ఇస్తున్నా
కాటేస్తాలే..ఏ..ఏ… వాటేస్తాలే…ఏ..ఏ..
రగులుతోంది మొగలి పొద..ఆ.. వగలమారి కన్నె ఎద

*****   *****   *****

చిత్రం: ఖైదీ (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
గోరింట పూసింది గోరింక కూసింది
గొడవేమిటే రామ చిలకా గొడవేమిటే రామ చిలకా
నే తీర్చనా తీపి అలకా ఆ
నే తీర్చనా తీపి అలకా

గోరింక వలచింది గోరింట పండింది
కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక
నీ ముద్దు నా ముక్కు పుడక ఆ
నీ ముద్దు నా ముక్కు పుడక
ఏలో ఏలో ఏలేలో ఏలో
ఏలో ఏలో ఏలేలో ఏలో

చరణం: 1
పొగడాకు తేనేంతో పొదరిల్లు కడిగేసి
రతనాల రంగులతో రంగ వల్లులు తీర్చి
ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే ఆ ఆ ఆ ఆ
సొదలేమిటే రామచిలక సొదలేమిటే రామచిలక
సొగసిచ్చుకో సిగ్గు పడక ఆ ఆ సొగసిచ్చుకో సిగ్గు పడక

గోరింక వలచింది గోరింట పండింది
ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా

చరణం: 2
విరజాజి రేకులతో విరిసేయ సవరించి
పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే నిశిరాతిరి తోడుంటే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొదవేమిటే గోరువంక కొదవేమిటే గోరువంక
కడకొంగుతో కట్టుపడక ఆ ఆ కడకొంగుతో కట్టుపడక

గోరింట పూసింది గోరింక కూసింది
కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక
నే తీర్చనా తీపి అలకా ఆ నే తీర్చనా తీపి అలకా

*****   ******   *****

చిత్రం: ఖైదీ (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా
సొగసుకు వయసే సోకబ్బా
వయసుకు మనసే వడదెబ్బా
చూపులోని తీపి దెబ్బా చెప్పలేని ఘాటు దెబ్బా అబ్బా

హా హా హా హా .. ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా
తడి తడి ఊహల పొడి దెబ్బా
తొలకరి వలపుకు గురుతబ్బా
రాలుగాయి ప్రేమదెబ్బ రాసుకుంటె ఆడ దెబ్బా అబ్బా..

హా హా హా హా .. ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా

చరణం: 1
సాగే గాలికి రేగే పైట నవ్వింది
ఆ నవ్వుల పువ్వులు నీవంది
నీలో వయసే వెన్నెల ఏరై పారింది
ఆ ఏటికి రేవే నీవంది

చెక్కిళ్ళ నీడలోనా..పందిళ్ళు వేయమంది
పరువాల జల్లు లోనా..నీ తోడు కోరుకుంది

నీ కొన చూపులో.. నీ చిరునవ్వులో..
నా తొలి ప్రేమ ఊరేగుతుంది.. నా తొలి ప్రేమ ఊరేగుతుందీ…

ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా

చరణం: 2
కళ్ళు కళ్ళు కలబడుతుంటే చూడాలి
అది ఆగని అల్లరి కావాలి
వయసు మనసు తడబడుతుంటే చూడాలి
అది వలపుల బాటలు వెయ్యాలి

సరికొత్త ఊహలెన్నో..సడిచేర్చి రేగుతుంటే
ఆ మత్తులోన నేనే..మైమరిచి తేలుతుంటే
ఆ మురిపాలకూ.. ఆ ముచ్చట్లకూ..
ఇహ లోకాన అంతెక్కడుంది.. ఇహ లోకాన అంతెక్కడుందీ…

అరే ఇదేమిటబ్బా..ఇది అదేను అబ్బా
మరి అదేమిటబ్బా.. అది ఇదేను అబ్బా
సొగసుకు వయసే సోకబ్బా
వయసుకు మనసే వడదెబ్బా
చూపులోని తీపి దెబ్బా చెప్పలేని ఘాటు దెబ్బా అబ్బా..

అరెరెరెరే ఇదేమీటబ్బా..ఇది అదేను అబ్బా
అదేమిటబ్బా..అది ఇదేను అబ్బా
తడి తడి ఊహల పొడి దెబ్బా
తొలకరి వలపుకు గురుతబ్బా
రాలుగాయి ప్రేమదెబ్బ రాసుకుంటె ఆడ దెబ్బా అబ్బబ్బబ్బబ్బా….

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Chirujallu (2001)
error: Content is protected !!