చిత్రం: ఖతర్నాక్ (2006)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం:
గానం: గీతామాధురి , నాని, నోయల్
నటీనటులు: రవితేజా , ఇలియానా
కథ, మాటలు: అమ్మా రాజశేఖర్ , మరుదూరి రాజా
దర్శకత్వం: అమ్మా రాజశేఖర్
నిర్మాతలు: బి.వి.యస్. యన్. ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శ్రీనివాస్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేది: 14.12.2006
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా
స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం
గగనం భూమికి బహుదూరం
పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం
అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం
చరణం: 1
చలివేణువు నేను చెలివయ్యావు నువ్వు
రవలించే పదమై రాలేవా ఓహో
కరిమబ్బువు నువ్వు గిరికొనను నేను
నన్ను ముంచే వారదై రాలేవా ఓహో
బ్రతుకంటే కవితే కాదు
పతివుంటే కవితే రాదు
ఆ మాటే వలదు వలదు వలదు వలచితివా
కుదరదురా కలలకురా కలపకురా
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఈ బృందావనం లోన నీకై వేచి నయనం నేనౌతా
చరణం: 2
ఔనంటే కాదు కాదంటే అవును
నీ మాటల సరసం రమ్మంటే విరసం
ఏనాడో తేలదు నీ విషయం ఓహో
నువేగా ఊహిస్తున్న మౌనంగా చూస్తూ ఉన్నా
మౌనాలే అంగీకారం తెలిపెనురా
చెదరనురా వదలదురా తెలిపెనురా
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
ఆ గగనంలోన తరాజ్యోతై కిరణం నువ్వైతే
స్వప్నంలో ఉంటూ పాపం మరిచావ సత్యం
గగనం భూమికి బహుదూరం
పెరిగేకొలది దూరం పెరుగును అనురాగం
అని ఎవరన్నారో గాని అది మరి నాకోసం