ఆమనిలా పాడు, మల్లియల చూడు… లిరిక్స్
చిత్రం : కిలాడి (1985)
నటీనటులు : కమల్ హాసన్, అంభిక, మాధవి
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఎస్. పి. బాలు, ఎస్. జానకి
దర్శకత్వం : రాజశేఖర్
నిర్మాణం : ఏడిద విశ్వమోహన్, ఏడిద శ్రీరాం, ఏడిద రాజా
విడుదల తేది : 1985
ఆమనిలా పాడు, మల్లియల చూడు
ఆమనిలా పాడు మల్లియల చూడు
కళ్ళల్లో కొలువున్నావు ఆ..
గుండెల్లో జత కోరేవు ఆ..
శతకోటి పూల పొంగువో
ఆమనిలా పాడు, మల్లియల చూడు
నన్నే మురిపించే వరము వలపే విరిసె
నీ కన్నుల చిలికే స్వరము అలలై కురిసె
నన్నే మురిపించే వరము వలపే విరిసె
నీ కన్నుల చిలికే స్వరము అలలై కురిసె
సాగరం ఉప్పొంగు రీతి సాగే బంధమే లలల…
ఈ క్షణం స్వరాల ప్రేమ నాకు ప్రాణమే లలల…
సోయగం నా బంధనం నందనం హరిచంధనం
నేనే నీవు హోయ్ హోయ్
ఆమనిలా పాడు, మల్లియల చూడు
కళ్ళల్లో కొలువున్నావు ఆ..
గుండెల్లో జత కోరేవు మ్..
శతకోటి పూల పొంగువో
ఆమనిలా పాడు, మల్లియల చూడు
ఊరించే అల్లరి తలపె ఊరేగేనె
మరిపించే ఊహలు తెలిపె నా యదలోనే
ఊరించే అల్లరి తలపె ఊరేగేనె
మరిపించే ఊహలు తెలిపె నా యదలోనే
తీయని రాగాలతోటి పల్లవించెనే లలల…
తీరని స్వప్నాలు నేడు ఆలకించెనే లలల…
ఏ క్షణం నీవే జగం జీవితం నీకంకితం
నేనే నీవు హో హో
ఆమనిలా పాడు, మల్లియల చూడు
ఆమనిలా పాడు మల్లియల చూడు
కళ్ళల్లో కొలువున్నావు ఆ..
గుండెల్లో జత కోరేవు ఆ..
శతకోటి పూల పొంగువే
ఆమనిలా పాడు, మల్లియల చూడు
video is successfully attached.