King (2008)

చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: నవీన్, ప్రియా హిమేష్
నటీనటులు: నాగార్జున, త్రిష , మమతా మోహన్ దాస్
దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 25.12.2008

పల్లవి:
ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే
హాలీవుడ్ బాలీవుడ్  సోదా చేశానే
ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే
తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా
బ్రాకెట్ లాంటి బాయ్ ఫ్రెండ్ కొసం ట్రై చేస్తున్నానే
జట్లి లాంటి మాన్లీ బిల్డప్ కావాలన్నానే
ఆ ఫిగరు పవరు ఎక్సట్రా నీలో చుపిస్తే
తు హి మేరా బాదుషా తు హి మేరా బాదుషా
సున్ మేర మెరి మెహరుబా తుజ్పే హొగయా హు మే ఫిదా
తు మేర హీరో అని నా మనస్సు నమ్మాలిగా

ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే
హాలీవుడ్ బాలీవుడ్  సోదా చేశానే
ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే
తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా

చరణం: 1
నువ్వు నేను 100% సూపర్ జోడిలే
అమితాబచ్చన్ జయలాగ మేడ్ ఫర్ ఈచ్ అధర్
రాజేష్ ఖన్న డింపుల్ లాగ సెట్టైపోయమే
నువ్వ ఎస్ అన్నవొ ఐష్ అభి సెటిలైపోదామే
జయ బచ్చన్ నచ్చినవాడు నంబర్ ఒన్ లే
దింపుల్ హర్టును గెలిచినవాడు రొమాంటిక్ ఫిగరే
చోటా బచ్చన్ ఆర్ ఏ సి లవ్వు ఐషుకు నచ్చిందే
నువ్వు సమ్ వన్ స్పెషల్  అనిపించేల ఏదొ చెయ్యలే
వాట్ టు డూ మై లవ్ త్రిషా మే హు నీ అందాల బానిసా
వారెవ్వ లవ్లీ నజర్  దీవాన హోతా ఐసా

ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే
హాలీవుడ్ బాలీవుడ్  సోదా చేశానే
ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే
తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా

చరణం: 2
హే అంబానీలా నీకోసం నే పాలెస్ కడతానే
షజహాన్ లా రోజ్ మహలే బొనస్ ఇస్తానే
ఏ ఎన్ ఆర్ లా స్టుడియో కట్టి నీ పేరెడతానే
నువ్ లవ్ యు అంటే లల్లునడిగి సి ఎం చేస్తాలే
గుండీ లేని షర్టే వేసి మాసనిపించావే
గుండెలోని మేటర్ చుస్తే క్లాసనిపించావే
మళ్ళి పుట్టిన మజ్ను లాగ మ్యజిక్ చేశావే
నా మనస్సే నీతో లింకయ్యేల లాకప్ వేశావే
దిల్ రుబా దిల్ కి సుభహ్ ఎంత మాటన్నావే తీయ్యగా
జనేమన్ జానే జిగర్ నువ్ నాకు నచ్చావుగా

********   ********   ********

చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాగర్ , దివ్య

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
మాట చాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
కలుపుకోవ నన్ను నీలో యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

చరణం: 1
చేరిపోని నీ ఎదపైన వాలిపోనిది వయసేన
తేనే తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన
కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అధ్బుతాన్నిలా దరికి పిలిచుకోన ఓ
లాలించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

చరణం: 2
ఆడ మన్స్సులో అభిలషా అచ్చ తెలుగులో చదివేశా
అదుపు దాటి వరదైంది ఈ చిలిపి చినికు వరస
నన్ను నేను నీకొదిలేశా ఆదమరుపులో అడుగేశా
అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలపు తెరిచా
అనుకున్న కొన్ని అనలేని వన్ని ఆరాలు తీయనా
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ

చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడా
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

********   *******   *******

చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: లెస్లీ లెవీస్ , మమతా మోహన్ దాస్

పల్లవి:
నడిచే స్తైలేమో rocking
అడుగుల సౌండెమో shaking
నడిచే స్తైలేమో rocking
అడుగుల సౌండెమో shaking
వీడి స్పీడే ప్రత్యేకింగ్
వీడు చేయేస్తే Knocking
విలన్సు గుండెల్లో stroking
వంట్లొ పటాసులే cracking
వెపన్స్ కూడ వెనకడుగేసే ఆ గట్సే సో shocking
తుఫానులా దుసుకువస్తె రికార్డులన్ని breaking

K I N G Common Common Everybody
K I N G వస్తున్నాడు కింగ్
మజుల్సు ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని కింగ్
సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King

చరణం: 1
బరిలో దుకాడంటే మొదలే ఓవర్ టేకింగ్
పిడికిలి కొంచం బిగిసిందంటే
thats all Striking Striking
కదిలే సైన్యం వీడే ఏ దారైన cake Walking
మౄగల వేటకు ముందడుగేస్తే
no no no back tracking
కరెంటు కైన షాకిచ్చే ఆ పవరంటే mind blocking
అడ్వెంచర్కే అర్థంలా he want to history making

K I N G
K I N G వస్తున్నాడు కింగ్
మజుల్సు ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని కింగ్
సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King
Common
K I N G వస్తున్నాడు కింగ్
సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King

చరణం: 2
చీతా చూపులు వాడు always Shaking Shaking
అన్యాయం తలెత్తి చూస్తే Honest గా attacking
వెలుగై నడిపిస్తాడు వీడే మన go backing
అందరి కొసం ఒక్కడు తానై
all the time so care taking
ఎలాంటి ప్రాబ్లెం ఎదురవుతున్నా క్షణాలలో unlocking
ఇలాంటి హీరో తోడై ఉంటే జనానికెంతో liking

K I N G Common Common Everybody
K I N G వస్తున్నాడు కింగ్
మజుల్సు ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని కింగ్
Common
K I N G వస్తున్నాడు కింగ్
సైలన్సు కూడ విజిల్సు కొట్టే one and only King

********   *******   *******

చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ

తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం

నువ్వు రెడీ నేను రెడీ గానా భజాన బ్యాండు రెడీ
డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్లాడు కుందాం ఇస్టపడి
నువ్వు రెడీ నేను రెడీ గానా భజాన బ్యాండు రెడీ
డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్లాడు కుందాం ఇస్టపడి
కల్లలో క్రేజీ కలలు రెడీ మనసులో అరాటాలు రెడీ
రాజ హంసా ఏడు వారాల పూలు రెడీ

చేతిలో గోరింటాకు రెడీ చంపలో చమ్కీ తలుగు రెడీ
చందమామ వాలిపోవ గుండెలో నీకు చోటు రెడీ

తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం

చరణం: 1
ఆందినట్టు ఉంటావే  ఒహ్ అందకుండ పోతావే
ఓహ్ చిట్టి చిలకా పట్టుపడవే  పారిపోకే ఊరించమాకే
ఆ వెంట వెంట వస్తావె ఇంకెంత కాలమంటావె
ముందు వెనకా చూసుకోవె ఈ దూరమంతా కొన్నాల్ల వరకే
నిన్నలో ఇట్టాలేవు నువ్వె ఇంతలో ఏదో అయిపొకెయ్
పెళ్ళి కానీ ఒరిగి పోతాను ఒళ్ళోనే
అల్లుడా ఇంతా తొందరలే అంతగ విరహాలెందుకులె
ఇంటి నిండా ఇందరుంటే చిలిపి సరసాలు సాగవులే

నువ్వు రెడీ నేను రెడీ గానా భజాన బ్యాండు రెడీ
డేట్ రెడీ ప్లేస్ రెడీ పెళ్లాడు కుందాం ఇస్టపడి

తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం

చరణం: 2
నువు  చీర కట్టి  కంట పడితె నీ కొంటె కళ్ళ దిస్టి పెడత
అడ్డు పడత ఆశ పడత నీ చిట్టి నడుమె చుట్టు మడత
ఈ మూడు ముళ్ళు పడిపోతె నా బెట్టు తీసి గట్టునెడతా
ఆ కట్టుపెడత జట్టు కడత నీ బేబీ కలత తీర్చుకుంటా
నువ్వలా సరదా చూపెడితే పూటకో దసర కనిపెడతా
ఎదురు చూస్తా నన్ను నీలో కలిపేస్తా
చం చమా హంగమ చెస్తా కొంగు ముడి త్వరలో వేయిస్తా
రంగరంగ వైభవంగా మస్తుగ భుంగి బజాయిస్తా

తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం
తర రం పం పం, తర రం పం పం, తర రం పం పం పం

********   ********   ********

చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఉజ్జయిని

ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర..
ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిరణ..
ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర..
ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధింతన..

ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..ధిరణ ధిరణ ధిర..
ధిరణ ధిరణ దిరణ ధిరణ ధిరణ ధిరణ ధిర ధిరణా..

ఘణణ ఘణ ఘల్ ఘల్..
మువ్వలై.. మొగింది నాలొ నీ రాగం..
ఝణణ ఝణ ఝల్ ఝల్..
రువ్వలై.. పొంగింది నాలొ సంగీతం..
కదిలె పెదాల సడిలో స్వయాన
తనుగా చిందించె ప్రణవం
ఎగిసె స్వరల జతలో విలీన
మొదగ జ్వలించె సమయం..
మహతి సునాద సుధగ తరించు
ప్రాణమై సుమించె హృదయం..
వ్రతమె ఫలించి..వరమై లభించి..
పదాన చలించు పదాల గమ్యం..

ఘణణ ఘణ ఘల్ ఘల్..
మువ్వలై.. మొగింది నాలొ నీ రాగం..
ఝణణ ఝణ ఝల్ ఝల్..
రువ్వలై.. పొంగింది నాలొ సంగీతం..

ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర..
ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిరణ..
ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధిర..
ధిరణ ధిరణ ధిర.. ధిరణ ధిరణ ధింతన.. (2)

నినిస స స స నిని సగ గ గ గ
నిని సగమ మ మ గమపనీ పా..
నినిస స స స నిని సగ గ గ గ
నిని సగమ మా గమపనీ సా…
దిన్ దిన్ తాన న న న నాన దె
ఈ ఈ ఈ ఈ త న…
నిని సా గగ సా నినిస నినిస
ని ని ని ద ద ద ప ప ప మ మ
గమప గమని గమసా
ని ప మ గ రి గ మ ప ని ప

ఘనన ఘన ఘల్ ఘల్..
ప ని స రి స ని ని ప మ ప ని
పమగరిస నిసగమప సరిగమప సరిగమప
ఘణణ ఘణ ఘల్ ఘల్

ఘణణ ఘణ ఘల్..ఘన్ ఘణణ ఘల్..
ఘన్ ఘణణ ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్….

********   ********   ********

చిత్రం: కింగ్ (2008)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అందేరా జారేమియా, రాహుల్ నంబియర్

మై లవ్ ఇస్ గోన టేక్ యు లిటిల్ హైయర్
మై లవ్ ఇస్ గోన సెట్ యువర్ హర్ట్ ఆన్ ఫాయర్
మై లవ్ ఇస్ గోన బర్న్ యు విత్ డిసాయర్
డు యు రియల్లి వాన బీ మై లవర్
డు యు రియల్లి వాన బీ మై లవర్

నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి
ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని
నేను నీ రాజ రాజ, నువ్వు నా రాణి రాణి
ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని

వేయి కల్లు గా వేచి వేచి నీకెదురైంది ఈ రంగీల
చేతి లోన చెయ్యేసి పాడుకో తాన తందాలాల
గాలి వాలుగ ఊయలూగి చెలరేగుతుంది మనసీవేల
ఇంతలాగ నన్నెవ్వరైన కదిలించలేదు నీల

పిల్ల పిల్ల హొ పిల్ల నా అందాల సిండ్రిల్ల
నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల
హొయిల హొయిల గుండెల్లొ రేగింది హల్ల గుల్ల,
నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల
నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి
ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని

మబ్బులే పైనున్న వాటికి పైనున్న
ప్రేమ లోతె తడిమి చూసే ఎత్తులే చూస్తున్న
మై లవ్ ఇస్ గోన టేక్ యు లిత్త్లె హిఘ్హ్హెర్
చుక్కల నువ్వున్న పక్కనె నెనున్న
దూరమంత జరుపుతూనే దగ్గరైపొతున్న
మై లవ్ ఇస్ గోన టేక్ యువర్ హేర్త్ ఒన్ ఫిరె

తేలికైపొతున్న తేలిపోతూ ఉన్న
గుండెల్లొ బరువే నీతొ పంచుకునే ఈ సమయానా
కోరుకున్న నిన్ను చేరుకున్న సంతోషముంది నాలొలోన
నమ్మ లేని ఈ సంబరాన్ని వెయ్యెల్లు దాచుకోనా

పిల్ల పిల్ల హొ పిల్ల నా అందాల సిండ్రిల్ల
నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల
హొయిల హొయిల గుండెల్లొ రేగింది హల్ల గుల్ల,
నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల
నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి
ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని

మనసులొ నీపైనా ఇస్టమే దాగున్న,
ఇన్ని నాల్లు చెప్పుకోని పెదవినే తిడుతున్న
మై లవ్ ఇస్ గోన టేక్ యు లిత్త్లె హిఘ్హ్హెర్
చెరువై నువ్వున్న చేరుకో రమ్మన్న
నిన్ను కలిసే వీలయిందీ ఇప్పుడే నాకైనా
మై లవ్ ఇస్ గోన టేక్ యువర్ హేర్త్ ఒన్ ఫిరె

ఊహలో నేనున్నా ఊపిరై నేనున్న
జంటగ లేకున్న నీ ఒంటరి తనమే నే కానా
నిదర తక్కువై కలలు ఎక్కువై నన్ను నేను మరిచేస్తున్న
మోయలేని ఈ హాయి నేడు నీ కానుకిచ్చుకోనా

పిల్ల పిల్ల హొ పిల్ల నా అందాల సిండ్రిల్ల
నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల
హొయిల హొయిల గుండెల్లొ రేగింది హల్ల గుల్ల,
నీ వల్ల హాయల్ల ఈ మస్తు మస్తు గోల
నేను నీ రాజ రాజ నువ్వు నా రాణి రాణి
ఏకమై నువ్వు నేను ఏలెద్దమా ఆంధ్రాని

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Bhai (2013)
error: Content is protected !!