Kirai Dada (1987)

Advertisements

చిత్రం: కిరాయి దాదా (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: నాగార్జున, అమల , కుష్బూ , కృష్ణంరాజు, జయసుధ
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: వి.ద్వరాస్వామిరాజు
విడుదల తేది: 09.11.1987

కురిసే మేఘాలు తడిచే అందాలు
మెరిసే అందాలు నీలో చూస్తుంటె
షిఫాను సోకులో తుఫాను రేగితే
బలే మజాగా ఉందిలే

ముసిరే మేఘాలు విసిరే బానాలు
కసిగా కోనాలు తాకే పోతుంటె
తపించు గుండెలో తుఫాను రేగితే
బలే మజాగా ఉందిలే

ఒదిగే నీ కన్నె రూపం
ఒడిలో రేఇంద్ర చాపం
వానకే సరికొత్త అందం తెచ్చిందిలే
వల్లంత ఓ పువ్వు కాద
నా తేనె విరహాన కాగా
వాలింది నీ తేనె టీగ
లాలించి నా ముద్దు లాగా
లాలించి నా ముద్దు లాగా

కురిసే మేఘాలు తడిచే అందాలు
మెరిసే అందాలు నీలో చూస్తుంటె
తపించు గుండెలో తుఫాను రేగితే
బలే మజాగా ఉందిలే

చినుకే కొట్టింది కన్నూ
వొనుకే పుట్టింది వెన్నూ
వలపే నా పేర నిన్నూ రమ్మందిలే
రానే వచ్చింది వాన
రావే అందాల జానా
పడతా పరువాల సానా
బిగిసే కౌగిల్లలోనా
బిగిసే కౌగిల్లలోనా

ముసిరే మేఘాలు విసిరే బానాలు
కసిగా కోనాలు తాకే పోతుంటె
తపించు గుండెలో తుఫాను రేగితే
బలే మజాగా ఉందిలే

కురిసే మేఘాలు తడిచే అందాలు
మెరిసే అందాలు నీలో చూస్తుంటె
షిఫాను సోకులో తుఫాను రేగితే
బలే మజాగా ఉందిలే

ముసిరే మేఘాలు విసిరే బానాలు
కసిగా కోనాలు తాకే పోతుంటె

*******  ********  ******

చిత్రం: కిరాయి దాదా (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

నా లాంటి మజునూలు నేడెందరున్న
ఆ నాటి లైలాలూ ఈనాడు లేరు
విది రాత కారాదు ఈ ప్రేమ కావ్యం
ఇది నీకు నా ప్రేమ సందేశము
అది నీకు కావాలి ఆదర్శము
ఇది నీకు నా ప్రేమ సందేశము
అది నీకు కావాలి ఆదర్శము

మోహాలు దహాలు తొలి నాటివి
స్నేహానురాగాలు వెయ్యేల్లవీ
యెడ బాటు చేసేటి ఏ ఆడదీ
ఏనాడు కాలేదు నీ ప్రేయసీ
మమ్మించి నట్టేట ముంచేటి రీతి
నివ్వించి కన్నీట ముంచేసె రీతి
తెలిసీ తెలిసీ మనసివ్వరాదు
బ్రతుకే చితిగా ఇక మార్చ రాదు
ఇది నీకు నా ప్రేమ సందేశము
అది నీకు కావాలి ఆదర్శము

Advertisements

ఈ ప్రేమ ఈ శ్రుష్టికే దిక్కులే
ఆ ప్రేమ నీ జన్మకె హక్కులే
మనసిచ్చినా నువ్వు మాటివ్వకూ
ఆ మాటలే నమ్మి మరనించకూ
ఏ తాగుడు బాద చల్లర్చలేదు
ఏ దేవుడు నిన్ను ఓదార్చలేడు
హ్రుదం నిండా విషమున్న వేలా
అదరం మదురం వెదజల్లుతుందా

నా లాంటి మజునూలు నేడెందరున్న
ఆ నాటి లైలాలూ ఈనాడు లేరు
విది రాత కారాదు ఈ ప్రేమ కావ్యం
ఇది నీకు నా ప్రేమ సందేశము
అది నీకు కావాలి ఆదర్శము
ఇది నీకు నా ప్రేమ సందేశము
అది నీకు కావాలి ఆదర్శము

*******  ********  ******

చిత్రం: కిరాయి దాదా (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ పక్క దిండు నే పంచుకుంటా
నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ పక్క దిండు నే పంచుకుంటా
వలపులో లయలే చిలిపి అల్లరులై
రేగెనే చిన దానా

నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా
నా కన్నె ఈడు నీకిచ్చుకుంటా
కనులలో కలలే రేగితే అలలై
కౌగిలే కదదాక

ముద్దకు తీరదు ఆకలీ
ముద్దుకు తీరదు నా చలీ
ప్రేమకు లేనిది ఎంగిలీ
పెదవులకున్నది తాకిడీ
తియ్యక తప్పదు నా చెలి
తియ్యని వలపుల వాకిలీ
బుగ్గ తొందర సిగ్గు తొందర
ఈ సంత ఎన్నాల్లు రా
అసలు కానుకలు కొసరేటి వేల
సిసలు దాచగలవా

నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా
నా కన్నె ఈడు నీకిచ్చుకుంటా
వలపులో లయలే చిలిపి అల్లరులై
రేగెనే చిన దానా

గుప్పెడు గుండెకు ఉప్పెనా
గుట్టుగ సంగతి చెప్పనా
ఎంతటి వారికి తప్పునా
కుంపటి వయసుల వెచ్చనా
అందరి చూపులు ఆపనీ
అప్పుడు అందం ఆపనీ
జోల పాడితే గోల ఆగునా
నీ జోలి కొచ్చేయనా
చిగురు ఊహలిక ముదిరేటి వేల
యదను దాచగలమా

నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ పక్క దిండు నే పంచుకుంటా
వలపులో లయలే చిలిపి అల్లరులై
రేగెనే చిన దానా

నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా
నా కన్నె ఈడు నీకిచ్చుకుంటా
కనులలో కలలే రేగితే అలలై
కౌగిలే కదదాక

నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Ganga Manga (1973)
error: Content is protected !!