Kirathakudu (1986)

చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, రాజశ్రీ
గానం: యస్.పి.బాలు
నటీనటులు: చిరంజీవి , సుహాసిని, సిల్క్ స్మిత
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: లింగరాజు
విడుదల తేది: 10.01.1986

నన్నీ లోకం రమ్మనలేదు
నేనీ జన్మను ఇమ్మనలేదు
సరదాగా నే వచ్చేసాను
జత కోసం గాలించేసాను
అయ్యాను ఖయ్యాం నేను

మనిషి మనుగడే పరమ బోర్
మనసుతో ఒకే తగవులు
ఎవడు కోరును పరుల మేలు
ఎదటి వాడికే నీతులు
ఎవడికానందముంది ఎక్కడుంది
ఎవడికనుబంధముంది ఎంత ఉంది
బ్రతుకులోనే పగులు ఉంది
పగులుకేదో అతుకు ఉంది
విశ్రాంతి ఉందే ఉంది

కళలు లేనిదే కనులు లేవు
కరిగి చెదిరినా మరువవు
మరువలేనిదే బ్రతుకలేవు
గురుతులెన్నడూ మిగలవు
మమతలన్నారు ఏవి మచ్చుకేవి
మనిషి ఏకాకి జీవి మధుర జీవి
సుఖము నిన్నే వెతికి రాదు
వెతుకులాట ముగిసిపోదు
విశ్రాంతి లేనే లేదు

********  ********  ********

చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నీ మూగ వీణై మోగేనా
నీ రాగ మాలై పాడేనా
అనురాగం రాగంగా
అభిమానం గీతంగా
నే పాడేనా

శిలవంటి నీ హృదయంలో
శృతి నేను కానా
ఓదార్చి నిను లాలించే
ఒడి నేను కానా
తనకంటూ ఒక మనిషంటూ
ఉంటేనే బ్రతుకు
నిదురించే నీ హృదయంలో
కదలాడే కలనై
నీ కంటిలో కన్నీటినై
ఉంటాను ఓదార్పునై

అలిగావు నీవలిసావు
అనురాగం కరువై
రగిలావు సెగలెగిసావు
బ్రతుకంతా బరువై
మేఘాన్నై అనురాగాన్నై
చినికాను చినుకై
పులకించి నువ్వు చిగురించి
పెరగాలి మనసై
నీ నవ్వులో నే పువ్వునై
పూస్తాను నీ కోసమై

********  ********  ********

చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

నీ పేరే ప్రణయమా ప్రణయమా
నీ రూపే హృదయమా హృదయమా
నీ ప్రేమ గీతిలో సుమించే సుధా కుసుమమై
నీ చెంత చేరనా వరించే తోలి ప్రణయమై
సాగే రాసలీల సంధ్యా రాగ హేల

మనసున కురిసెను సొగసుల మధువులు ప్రియా ప్రియా
పెదవులు కలిపెను పరువపు ఋతులు ప్రియా ప్రియా
కౌగిలింత కావే ప్రేమ దేవత
కంటి చూపుతోనే హారతివ్వనా
నడుమును మరచిన పుడమిని వెలిసిన పడతివి నీవేలే

వలపుల వలలకు వయసులు తగిలెను ప్రియా ప్రియా
మదనుని శరముల సరిగమ తెలిసెను ప్రియా ప్రియా
చైత్ర వీణ నాలో పూలు పూయగా
కోకిలమ్మ నాలో వేణువూదగా
కలతల మరుగున మమతలు పొదిగిన ప్రియుడవు నీవేలే

********  ********  ********

చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ఒక ముద్దు చాలు ఒక పొద్దు చాలు నాకు
ఆ ముద్దు లేక పొద్దెక్కదమ్మ నీకు
చూపే దాహం మాటే మైకం
నీలో తాపం నాకే సొంతం
తీయని నీ నోటి పలుకు
ఓ స్వాతి చినుకు కానీ
నీ వేడి పిలుపు నా మేలుకొలుపు కానీ
చూపే దాహం మాటే మైకం
నీలో తాపం నాకే సొంతం
తీయని ఒక ముద్దు చాలు……

ఈడే ఈనాడు కోడై కూసె
నేనే నీ తీపి తోడే కోరే
తడి చూపు ఇచ్చింది తాంబూలము
నా పెదవింటి గడపల్లో పేరంటము
ముత్యాల వానల్లే వచ్చావులే
ఒక పగడాల హరివిల్లు తెచ్చావులే
వాగల్లె నీ జోరు రేగాలి ఈ చోట
తీరాలి నీతోనే నా ముచ్చట నేడే…..

పువ్వై పూసింది నువ్వే నాలో
రవ్వై ఎగిసింది నవ్వే నీలో
పరువాలు నా పేర రాయించుకో
తొలి పన్నీటి స్నానాలు చేయించుకో
మురిపాలు సగపాలు పంచేసుకో
నీ పొదరింట సరదాలు పండించుకో
సందేళలో వచ్చి అందాలు నాకిచ్చి
ఎద తట్టి నను నీవు ఆకట్టుకో నేడే…

********  ********  ********

చిత్రం: కిరాతకుడు (1986)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి, రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

సంపెంగ ముద్దు నా చెంపకద్దు హా…
ఏ ముద్దులో ఏమున్నదో ఏ పొద్దులో ఏమవుతదో
ఏమో ఏమో…
అందాల బుగ్గ మందార మొగ్గ హా…
ఏ ముద్దుకి ఏమిస్తవో ఏ పొద్దులో ఏం చేస్తవో
ఏమో ఏమో…

పెదవుల్లో నీ ప్రేమ తాకితే ఝుమ్మంది వయ్యారం
ఎద మీద ఎద పెట్టి వాలితే పొంగింది నీ అందం
పైర గాలి సోకితే పైట కాస్త జారగా
నవ్వగానే తుమ్మెద మోవి మీద వాలగా
ముద్దుల్లో ముప్పూట తేలించి లాలించి
వద్దన్నా వలపుల్ల వాకిళ్ళు తెరిపించే
శృంగారాల సంధ్యారాగాలెన్నో పలికే

రైకల్లో జాబిల్లి దాగితే నవ్వింది కార్తీకం
కౌగిట్లో దోపిళ్ళు సాగితే కవ్వించే సాయంత్రం
చూడలేని అందము చూపు దొంగిలించగా
తేలి రాని వెన్నెల తెల్లవారి కాయగా
పొదరిళ్ళ వాకిళ్ళ సొగసంతా ముగ్గేసి
ముంగిళ్ళు ముద్దుల్తో ఎంగిళ్ళు చేసేసి
సౌందర్యాల దీపాలెన్నో నాలో నింపే

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Pavitra Bandham (1971)
error: Content is protected !!