Kirayi Rowdylu (1981)

చిత్రం : కిరాయి రౌడీలు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చిరంజీవి, మోహన్ బాబు, రాధిక
కథ: పరుచూరి బ్రదర్స్
మాటలు: సత్యానంద్
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: క్రాంతి కుమార్
విడుదల తేది: 1981

పల్లవి :
ఓ కొంటె కోణంగి… సరసాల సంపంగి
ఓ కొంటె కోణంగి… సరసాల సంపంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో

ఓ కొంటె కోణంగి… సరదాల సారంగి
ఓ కొంటె కోణంగి… సరదాల సారంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..ఓ.. ఓ..

ఓ కొంటె కోణంగి… సరదాల సారంగి

చరణం: 1
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా…
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ…

కొండలెన్నో ఎక్కావా… కోనలెన్నో దాటావా
కోరుకొండా ఎక్కాను… గోలుకొండా కొట్టాను
ఎక్కలేకా పడ్డావా… దాటలేక జారావా
ఎన్ని తిప్పలు పడ్డానో… ఏమి చెప్పను బుల్లమ్మో

ఓ కోడె వయసా… ఓ కొంటె మనసా
ఓ కోడె వయసా… ఓ కొంటె మనసా
ఆడదంటే అలుసా… కాదే కులాసా

ఓ కొంటె కోణంగి… సరసాల సంపంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..
ఓ కొంటె కోణంగి… సరసాల సంపంగి

డడడడడడ డడ్డడడా…
డడడడడడ డడ్డడడా…

చరణం: 2
రెప్ప కొట్టే చూపుందా.. రెచ్చగొట్టే రూపుందా
హా.. కోరికంటి మనసుంది… కోరుకున్న కైపుంది

తోడు లేని ఈడుందా.. తోడుబెట్టామంటుందా
పాలు పొంగే ఈడుంది… పాలు పంచే పదునుంది

ఓ లేత వయసా… నేనటే మనసా
ఓ..హో..హో.. లేత వయసా… అ..అ..ఆ.. నేనంటే మనసా
అరెరెరే.. వరించాను తెలుసా… అదే నా బరోసా

ఓ కొంటె కోణంగి… సరదాల సారంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో
ఓ కొంటె కోణంగి… సరదాల సారంగి… ఈ..ఈ…

More Stories
Chattaniki Kallu Levu (1981)
error: Content is protected !!