చిత్రం: కో అంటే కోటి (2012)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సాహిత్యం: సాహితి
గానం: శక్తి కాంత్, కార్తీక్
నటీనటులు: శర్వానంద్, ప్రియ ఆనంద్
దర్శకత్వం: అనీష్ కురువిల్ల
నిర్మాత: శర్వానంద్
విడుదల తేది: 20.12.2012
దేహం దాహం పోయేవరకే
మెరిసే మెరుపు చీకటివరకే
వినరా సత్యం జీవిత మర్మం
మనసుకి మలుపే జీవిత పాఠం
ఒక చెయ్యేగా నువ్వేదేదో నా మనసంతా మలిచెనే
ఒక అశేగా నా మనసంతా నిలువెల్లా నిను తలచెనే
దేహం దాహం పోయేవరకే
మెరిసే మెరుపు చీకటివరకే
వినరా సత్యం జీవిత మర్మం
మనసుకి మలుపే జీవిత పాఠం
కాలమిక ఆగదు వేదనిక నేర్పదు
ఏదో నేరం చేసిన దూరం గుండెల్లో గుచ్చేసి
పగ ఇంకా రప్పించి నింగి నేల నీరు నావే
వీరం సూరం సిద్ధం యుద్ధం ప్రళయం రేపేయ్ రా
ఒక చెయ్యేగా నువ్వేదేదో
ఒక చెయ్యేగా నువ్వేదేదో నా మనసంతా మలిచెనే
ఒక అశేగా నా మనసంతా నిలువెల్లా నిను తలచెనే
దేహం దాహం పోయేవరకే
మెరిసే మెరుపు చీకటివరకే
వినరా సత్యం జీవిత మంత్రం
మనసుకి మలుపే జీవిత పాఠం
********* ********* *********
చిత్రం: కో అంటే కోటి (2012)
సంగీతం: శక్తి కాంత్
సాహిత్యం: వశిష్ట శర్మ
గానం: హరిచరన్, ప్రియ హమేష్
వరాల వానలోనే తడిశా నీ జతగా కలిశా
ఈ హాయిలోనె నిన్ను తలచా నిన్ను పిలిచా తెలుసా
హో మనసుని పరిచా – మాటలు మరిచా
పరువపు తడబాటుని ఎదచాటుని ఇపుడే చూశా ఓ ఓ
నాలోని ఆశని నూరేళ్ళ శ్వాసని
నీ గుండె గూటిలోన ఉండిపోనీ
నీ కొంటె గోలని ఓ చంటి పాపల
నా కంటి పాపలోని నిండిపోనీ
జగాలు సాక్షిగా మనమే చెరిసగమై పోనీ
సుఖాలు శుభము పలికి మనతో కడవరకు రాని ఓ ఓ
ఇలాగే కాలమంత చలి కౌగిలిలో నిలవని సెలవని
ఏ జంట చేరలేని నిధి సన్నిధిలో కలవని కదలని
ఏదేదో అవుతున్నా హో బాగుందే
నీలోను నాలోను జరిగిందే…
అశే నీవు ధ్యాసే నీవు నాలో లేని నేనే నీవు
అశే నీవు ధ్యాసే నీవు నాలో లేని నేనే నీవు
జగాలు సాక్షిగా మనమే చెరిసగమై పోనీ
సుఖాలు శుభము పలికి మనతో కడవరకు రాని ఓ ఓ