Kodalu Diddina Kapuram (1970)

చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970)
సంగీతం: టి. వి. రాజు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: యన్. టి.రామారావు, సావిత్రి, వాణిశ్రీ
దర్శకత్వం: డి. యోగానంద్
నిర్మాత: యన్. త్రివిక్రమరావు
విడుదల తేది: 1970

పల్లవి:
నిద్దుర పోరా సామీ
నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ…
చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక..
నిద్దుర పోరా సామీ…

చరణం: 1
మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ
జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ
మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ
జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ

హోయ్ చందుర్రూనీ.. సూపుతగిలి కందిపోతావేమెూ
హోయ్ చందుర్రూనీ.. సూపుతగిలి కందిపోతావేమెూ
ఈ సిన్నదానీ సెంగుమాటున మెూము దాచి ఆదమరచి
నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ
చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక
నిద్దుర పోరా సామీ…

చరణం: 2
గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే
కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే
గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే
కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే

పండువెన్నెలా పాల నురుగుల పానుపేసీ పిలుస్తుంటే
పడుచుదనమే పిల్లగాలికి పడగెత్తీ ఆడుతుంటే
నిద్దుర పోనా పిల్లా  ఆ..
నిద్దుర పోనా పిల్లా నా ముద్దూ మురిపాల పిల్లా
చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక
నిద్దురపోనా పిల్లా…

error: Content is protected !!