చిత్రం: కోడలుపిల్ల (1972)
సంగీతం: జి. కె. వెంకటేష్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ , అంజలీ దేవి, కె.ఆర్.విజయ, పండరీ భాయి
మాటలు: రాజశ్రీ
దర్శకత్వం: యమ్.మల్లికార్జున రావు
సినిమాటోగ్రఫీ: కులశేఖర్
ఎడిటర్:
నిర్మాత: మరయనన్ చెట్టియర్
విడుదల తేది: 29.06.1972
పల్లవి:
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో
తడిమేను వొణికింది చలితో.. ఒక పెను వేడి రగిలింది మదిలో
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో.. యవ్వనాల నవ్వులో పువ్వులో
చరణం: 1
నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో
నింగి నుండి దేవత దిగెనో.. పన్నీటి జల్లు చిలకరించెనో
చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా
చెలి పక్కన ఉంటే.. నే పరవశమౌతా
ఈ చక్కని చుక్క చెక్కిలినొక్కుట ఏమో.. కల ఏమో
ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో..
యవ్వనాల నవ్వులో పువ్వులో
చరణం: 2
దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో
దేవలోక సుధలు తెచ్చెనో.. తన తేనెలాంటి మనసు కలిపెనో
ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే
ఆ మధువు తాగితే.. నా మనసు ఊగితే
ఈ మధుర.. మధుర.. మధుర భావమేమో.. వలపేమో
ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో… యవ్వనాల నవ్వులో పువ్వులో
తడిమేను వొణికింది చలితో.. ఒక పెనువేడి రగిలింది మదిలో
ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో… యవ్వనాల నవ్వులో పువ్వులో