Kodama Simham (1990)

చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: చిరంజీవి, సోనమ్, రాధ, మోహన్ బాబు
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: కె.నాగేశ్వరరావు
విడుదల తేది: 09.08.1990

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల
శృంగార మాల
మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య యాయా

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా

కౌగిట్లో ఆకళ్ళు కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ మోజు
పాలల్లో మీగడ్లు పరువాల ఎంగిళ్ళు
మెత్తంగ దోచాడమ్మ లౌజు
వచ్చాక వయసు వద్దంటే ఓ యెస్సు
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ అంటే తంట – ఊపందుకుంటా
నీ ఎండ కన్నేసి నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీ రోజు
యా యా యా

ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా

చూపుల్లో బాణాలు సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు
నీ ప్రేమ గానాలు లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు
గిలిగింత గిచ్చుళ్ళు పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు
సయ్యంటే జంట – చెయ్యందుకుంట
బుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు
య యాయ

చక్కిలి గింతల రాగం
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే
చెక్కిలిగుంటల గీతం
ఓ ప్రియ యా యా యా యా
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా
సాయంత్ర వేళ సంపంగి బాల
శృంగార మాల
మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య యా య

*********  ********  ********

చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, చిత్ర

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో
పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
తెలవారిపోకుండా తొలికోడి కూసింది
కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది
పొంగే వరద చెలరేగే సరదా
ఏదో మగత ఎద దాటే మమత
ఏది ఒంపో ఏది సొంపో ఉన్నటెంపో పెంచకే

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో
మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో
గంట అరగంట సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు
అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు
అయితే మొగుడు అవుతాడే మగడు
అసలే రతివి అవుతావే సఖివి
ఒంటికాయ సొంటి కొమ్ము
అంటుగుంటే ఘాటురా

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా

ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం

********  ********  ********

చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, చిత్ర

పల్లవి:
star star… mega star star
star star… mega star star

star star… mega star star
star star… mega star star

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసరితో తదిగిణతోం ఇహం పరం నిరంతరం

star star… mega star star
star star… mega star star

చరణం: 1
వేయ్ వేయ్ మరో స్టెప్పు వేయ్
ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా
చేయ్ చేయ్ ఇలా బ్రేక్ చేయ్
ఎదే షేక్ చేయ్ సోకుగా నాజూకుగా
ఇస్పేటు రాజు అరె కిస్ పెట్టుకుంటే
ఆయ్ డైమండు రాణి డంగౌతు ఉంటే
లవ్వుబాయి లబ్జులన్ని చూపనా
కౌబాయ్ కౌగిలింత గరం గరం గరం గరం
star star… mega star star
star star… mega star star
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం

చరణం: 2
వేయ్ వేయ్ అలా గాలమేయ్
ఇలా శూలమేయ్ రాజులా నటరాజులా
చేయ్ చేయ్ భలే ట్యాప్ చేయ్
సరే ట్విస్టు చేయ్ మోతగా తొలి మోజుగా
నువ్వేరా కాసు certainly baby
నీతోనే ఊసు sure my love
అందాల గూసే ఆటీను ఆసు
హార్టు బీటుతోటి తాళమేయనా
అరె వాటమైన బతుకు ఎంత సుఖం సుఖం సుఖం సుఖం

star star… mega star star
star star… mega star star

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
అరె నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి
మగసిరిలో సొగసిరితో తదిగిణతో ఇహం పరం నిరంతరం

star star… mega star star
star star… mega star star

********  *********  ********

చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, చిత్ర

పల్లవి:
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో
పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా.. హత్తుకో.. చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో

చరణం: 1
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో
జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో
పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో
వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో
కాచుకో.. కమ్ముకో.. ఖస్సుమన్న కోడెగాడు కాటువేసె కోనలోన

పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో

చరణం: 2
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చె తగవుల్లో బిగువుల్లో
సంపంగి ధూపాలేసె గుండెల్లో విందుల్లో
సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో
పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో
అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో
ఆడుకో.. పాడుకో.. అందమంత కొల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లె

పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ
హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ

********  ********  ********

చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

పల్లవి:
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు

చరణం: 1
గున్నపూత మావిళ్ళో నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ తక్కిల్లో
సందెపూల గొబ్బిళ్ళో నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో
వయ్యారి కొంగుమీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే
కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తె జారిపోయెనే
ముక్కుమీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో
చంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతినే మొగలి పొదల సెగలో
ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగెనులే

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు

చరణం: 2
కోకిలమ్మ వేవిళ్ళో నీ కొమ్మల్లో కోరికమ్మ కావిళ్ళో
కన్నె తీపి పొక్కిళ్లో నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో
జళ్ళోన పూల వీణ నీ జిమ్మదీయ మీటేసి దాటిపోకురా
జాబిల్లి మచ్చ చూసి నీ తస్సాదియ్య బేరాలు మానుకోనులే
ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి ఒణుకు శృతిలో
వెన్నెలంత రాసుకో వెన్ను వేడి చేసుకో చలికి చిలక జతలో
కనుపాపలే నిదురించని నడిరేయి నవ్విందిలే

అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు
మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు
గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా
ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా
చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా
కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Yamagola Malli Modalayindi (2007)
error: Content is protected !!