చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో , చిత్ర
నటీనటులు: వెంకటేష్ , సుమన్ , నగ్మా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 09.07.1993
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
కోరస్:
గొల్లవాడే గొల్లపిల్లవాడే
పాలవాడే మీకు ఈడు జోడే
పాలుగారే బుగ్గా మొగ్గా పిండేస్తా
మల్లె పూలల్లోని సోకు నీకు దండేస్తా
పాలే పంచి పక్కంగాను తోడేస్తా
నువ్వు పాలిస్తుంటే పండుచెండు విందిస్తా
రాగాల రాస లీలల్లో రగడ
నీకేర రాతిరేలల్లో మగడా
పాలరాతి మందిరం
పంచదార పంజరం
నా గోల వేసెటి ఈలలుతో నీ వెన్న జున్ను వేడెక్కిస్తా
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
మణిక్యాల మెడలోన మారాజ
నీకు అందిస్తున్నా స్త్రీ రోజా
వోణి కొద్ది బోణి కొట్టే పూబోణి
నీకు రాసిస్తాలే మల్లెల్లోని మాగాణి
యుద్దాలు చేసుకుందామా చలిలో
అందాలు పూసుకుంటాలే జతలో
వలపు కోట వాయణం
వయసు కోరు శోభనం
నీతోటి కొలువున్న వేళలలో
ఈ రోజా పూజా రాజా నీకే
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు
chiru