చిత్రం: కొండవీటి సింహం (1981)
సంగీతం: కె.చక్రవర్తి
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల
నటీనటులు: యన్.టి.రామారావు, శ్రీదేవి, జయంతి
దర్శకత్వం: కె రాఘవేంద్రరావు
నిర్మాతలు: యమ్.అర్జున్ రాజు, కె.శివరామరాజు, నిర్వహణ కుమార్జి
విడుదల తేది: 07.10.1981
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం
ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలో ఉదయరాగ సింధూరం
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా
సమశృతిలో జత కలిసి
ప్రియలయలో అదమరచి
అనురాగాలు పలికించువేళ
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
తెలవారిన సంధ్యలలో తేనె నీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
మమతలనే మధువొలికే
శుభయోగాలు తిలకించువేళ
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగ
********* ******** ********
చిత్రం: కొండవీటి సింహం (1981)
సంగీతం: చక్రవర్తి
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
నీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
గోరంత పసుపు నీవడిగినావు
నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు
క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం
త్యాగాలమయమై సంసారబంధం
నీ చేయి తాకి చివురించె చైత్రం
ఈ హస్తవాసే నాకున్న నేస్తం
అనురాగ సూత్రం
మా ఇంటిలొన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
మీ కంట తడిని నే చూడలేను
మా అమ్మ నీవై కనిపించినావు
ఈ బొమ్మనెపుడో కదిలించినావు
నిను చూడగానే పొంగింది రక్తం
కనుచూపులోనే మెరిసింది పాశం
నీ కంటి చూపే కార్తీకదీపం
దైవాలకన్న దయ ఉన్న రూపం
ఈ ఇంటి దీపం
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే
సిరులెన్నో ఉన్న చిరునవ్వు నీవే
మీ కంట తడిని నే చూడలేను
మా ఇంటిలోన మహలక్ష్మి నీవే
మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే