Kondaveeti Simhasanam (2002)

Kondaveeti Simhasanam Lyrics

ఆషాడానికి హారతివ… లిరిక్స్

చిత్రం: కొండవీటి సింహాసనం (2002)
సంగీతం: కోటి
సాహిత్యం:
గానం:  కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర
నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాణం: దాసరి నారాయణ రావు
విడుదల తేది: 08.02.2002

మ్…మ్..మ్ మ్…మ్..మ్ మ్…మ్..మ్

ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవ, నా తొలకరి బాలికవా…

ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవ, నా తొలకరి బాలికవా…

చిరుగాలి వాన ఒకటవ్వగా..
అది వరదై పొంగే ఒక పండగా..

ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవా.. నా తొలకరి బాలికవా..

తనువుకి తపస్సుకి తలుపులు తెరచిన వేళ.. హహా..
తీపికి అనుభూతికి హద్దులు చెరిపిన వేళ.. హహా..
పరదాల చీకటులూ.. తొలగేటి తరుణమిదీ.. హుహుహు
అధరాల కోరికలూ.. తీరేటి రోజు ఇదీ.. హుహు
అబ్బ! ఇన్నినాళ్ళు దాచుకున్న అందాలన్నీ..
నీకు నాకు దక్కే రోజు ఇదే ఇదే…

గ్రీష్మం కోరిన మధనుడివా..
రథ స్వప్నం విడిచిన భీష్ముడివా..
ఆకాశానికి కుంకుమవా.. నా తొలకరి బాలికవా..

మ్…మ్..మ్ మ్…మ్..మ్ మ్…మ్..మ్

సాగరం నదులతో సంగమించు మాఘ శుద్ధ వేళ
మధనుడు మధనితో యవ్వనాల అంచులు చూసి
పరువాల తరుగులకూ.. సరదాల గమ్యమిదీ..
బిడియాల సొగసులకూ.. తీయాలి గది గడియా..
అబ్బ! గుండెల్లోన దాచుకున్న సోకులన్నీ..
నీకే ఇచ్చి అంకితమైపోనా…

ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా..
ఆకాశానికి కుంకుమవా.. నా తొలకరి బాలికవా..

గ్రీష్మం కోరిన మధనుడివా..
రథ స్వప్నం విడిచిన భీష్ముడివా..
ఊహలలోని పురుషుడివా..
నా వలపుల పల్లకివా

చిరుగాలి వాన ఒకటవ్వగా..
అది వరదై పొంగే ఒక పండగా..

మ్…మ్..మ్ మ్…మ్..మ్ మ్…మ్..మ్

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top