చిత్రం: కొంగుముడి (1985)
సంగీతం: యస్.పి.బాలు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి
నటీనటులు: శోభన్ బాబు , సుహాసిని
దర్శకత్వం: విజయబాపినీడు
నిర్మాతలు: ఆనం. గోపాల కృష్ణారెడ్డి, కందేపి సత్యన్నారాయణ
విడుదల తేది: 1985
పల్లవి:
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది పాల పిట్ట కూసింది
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది పాల పిట్ట కూసింది
పట్టెమంచం కిర్రుమన్నదిరో చల్ మోహన రంగా
నీకు నాకు జోడు కుదిరెను పదరా
నీకు నాకు జోడు కుదిరెను పదరా
చరణం: 1
గాలికైనా సందులేని కౌగిలింతల్లో కౌగిలింతల్లో
పూలు కూడా అత్తరయ్యే పులకరింతల్లో పులకరింతల్లో
గాలికైనసందులేని కౌగిలింతల్లో
గాలికైనసందులేని కౌగిలింతల్లో
మీగడైన దొరకనీడు పాలపుంతల్లో
జాజి పూలు జలకమాడె జలధరింతల్లో
గుడ్డి దీపం గుబులు రేపెనురో చల్ మోహన రంగా
నేను ఉంటే దీపమెందుకు పదరా చల్ మోహన రంగా
నేను ఉంటే దీపమెందుకు పదరా
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పక్కనోచ్చి కూకుంటే పట్టుజారి పోయింది
హోయ్ తలుపు గడియ బిగుసు కున్నదే చల్ మోహన రంగి
నీకు నాకు జోడు కుదిరెను పదవే చల్ మోహన రంగి
నీకు నాకు జోడు కుదిరెను పదవే
చరణం: 2
గోడలన్ని గొడవ చూసి నవ్వుకుంటుంటే హెయ్
నవ్వుకుంటుంటే
నీడ కూడా నిజము తెలిసి సిగ్గు పడుతుంటే
సిగ్గు పడుతుంటే
గోడలన్ని గొడవ చూసి నవ్వుకుంటుంటే
నీడ కూడా నిజము తెలిసి సిగ్గు పడుతుంటే
కిటికిటీలు కటకటాల కెలుపు మంటుంటే
సందుచూసి చందమామ తొంగి చూస్తుంటే
కోడి కూస్తే కొంపమునగదటే చల్ మోహన రంగి
కోడి కోసి కూర తిందాం పదవే చల్ మోహన రంగి
కోడి కోసి కూర తిందాం పదవే
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పైట జారిపోయింది పాల పిట్ట కూసింది
మల్లెపువ్వు గిల్లింది తెల్లచీర నవ్వింది
పక్కనోచ్చి కూకుంటే పట్టుజారి పోయింది
పట్టెమంచం కిర్రుమన్నదిరో చల్ మోహన రంగా
నీకు నాకు జోడు కుదిరెనురా పదరా
చల్ మోహన రంగి నీకు నాకు జోడు కుదిరెనురా పదవే