చిత్రం: కొత్త అల్లుడు (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు
కథ: ముళ్ళపూడి వెంకట రమణ
నటీనటులు: కృష్ణ , జయప్రద, చిరంజీవి, మోహన్ బాబు
దర్శకత్వం: పి.సాంబశివరావు
సినిమాటోగ్రఫీ: స్వామి
ఎడిటర్: కోటగిరి గోపాల్ రావు
నిర్మాతలు: యమ్.సత్యనారాయణ, సూర్యనారాయణ
విడుదల తేది: 31.05.1979
పల్లవి:
అదిగదిగదిగది గదిగో ఆ నవ్వే
పక పక పక పక లాడే నీ నవ్వే
ఈ కుర్రోడ్ని వెర్రోడ్ని చేసింది
అచ్చంగా పిచ్చోడ్ని చేసింది
ప్రేమ పిచ్చోడ్ని చేసేసింది
అబ్బబ్బబ్బబ్బబ్బ ఆచూపే అయ్యబాబోయ్
చుర చుర చుర చుర లాడే ఆ చురుకే
ఈ కుర్రదాన్ని వెర్రిదాన్ని చేసింది
అచ్చంగా పిచ్చిదాన్ని చేసింది
ప్రేమ పిచ్చిదాన్ని చేసేసింది
అదిగదిగదిగది గదిగో ఆ నవ్వే
పక పక పక పక లాడే నీ నవ్వే
చరణం: 1
ఒక నవ్వు చిత్తు చిత్తుగా ఓడిస్తుంటే
ఒక నవ్వు మత్తు మత్తుగా కవ్విస్తుంటే
ఒక నవ్వు చిత్తు చిత్తుగా ఓడిస్తుంటే
ఒక నవ్వు మత్తు మత్తుగా కవ్విస్తుంటే
ముందు నవ్వు తరువాత నువ్వు
ముందు నవ్వు తరువాత నువ్వు
పువ్వుకే నవ్వులు నేర్పేస్తుంటే
నీ నవ్వుకే పువ్వులు విరబూస్తుంటే
అదిగదిగదిగది గదిగో ఆ నవ్వే
పక పక పక పక లాడే అహ…
చరణం: 2
ఒక చూపు పొద్దుటెండలా చలిపెడుతుంటే
ఒక చూపు మల్లెచెండులా మనసౌతుంటే
ఒక చూపు పొద్దుటెండలా చలిపెడుతుంటే
ఒక చూపు మల్లెచెండులా మనసౌతుంటే
నవ్వి చూడు చిరునవ్వు తోడు
నవ్విచూడు ఊ
పెదవి పెదవి కలిపేస్తుంటే
ప్రేమ సంతకం పెట్టేస్తుంటే
ఆ వాలు చూపుల్తో చేవ్రాలు చేస్తుంటే
నువ్వంటే నేనంటూ నవ్వాలి నవ్వు
నవ్వాలి నవ్వు నవ్వాలి నవ్వు
అదిగది అదిగది గదిగో ఆ నవ్వే
పక పక పక పక లాడే నీ నవ్వే
అదిగది అదిగది గదిగో ఆ నవ్వే
పక పక పక పక లాడే నీ నవ్వే