Krack (2021)

Krack (2021)

కోరమీసం పోలీసోడా… లిరిక్స్

చిత్రం: క్రాక్ (2021)
సంగీతం: త‌మ‌న్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్య బెహరా
నటీనటులు: రవితేజ, శృతిహాసన్‌, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాణం: బి.మధు
విడుదల తేది: 2021

Korameesam Polisoda Song Telugu Lyrics

ఏ జనమలో నీకు… ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది… ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ… నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది… ఏరి కోరి వెతికి
నీ అండ చూసింది… నెత్తెక్కి కూర్చుంది
నన్నెల్లి పొమ్మంది సవతి..!!
రవ్వంత నీ పక్క సోటివ్వనంటుంది… పోట్లాటకొస్తుంది దండెత్తి
ఆ సంగతేందో ఓ కాస్త… నువ్వే తేల్చుకోరా పెనిమిటీ…

కోరమీసం పోలీసోడా… నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా… నన్ను నీతో ఉండనీరా

ఏ జనమలో నీకు… ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది… ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ… నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది… ఏరి కోరి వెతికి

పనిలో పడితే… నీకేది గురుతురాదు
నువ్వలా వెళితే… నాకేమో ఊసుపోదు
పలవరింత పులకరింత… చెరొక సగముగా
సమయమంతా నీవే ఆక్రమించినావురా

ఏ గుళ్లో ఏ గంట వినిపించినా గానీ… నిన్నేగా నే తలచుకుంటా
మెల్లోని సూత్రాన్ని ముప్పొద్దు తడిమేసి… నీ క్షేమమే కోరుకుంటా
నా లోకమంతా సంతోషమంతా… నీతో ఉన్నదంటా

కోరమీసం పోలీసోడా… నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా… నన్ను నీతో ఉండనీరా

ఏ జనమలో నీకు… ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది… ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ… నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది… ఏరి కోరి వెతికి

Krack Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

భలేగా తగిలావే బంగారం… లిరిక్స్

చిత్రం: క్రాక్ (2021)
సంగీతం: థమన్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: అనిరుధ్ రవిచందర్
నటీనటులు: రవితేజ, శృతిహాసన్‌, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాణం: బి.మధు
విడుదల తేది: 2021

Balega Tagilavey Bangaram Song Telugu Lyrics

పగనిధలోక రారా… ఆశిధజన మందార రారా
ఒప్పులకుప్ప వయ్యారి భామ…
ఒకటోసారి పుట్టినాది ప్రేమ… డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని… చుట్టి వద్దామా

ఆకారం చూస్తే అబబో… అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే… అబబో అబబబో
పలుకు మమకారం అబబో… కులుకు సుకుమారం అబబో
సురుకు ఎటకారం కారం… అబబో అబబబో

భల్లేగా తగిలావే బంగారం… భల్లేగా తగిలావే బంగారం
హ్హా హ్హా..! భల్లేగా తగిలావే బంగారం… భల్లేగా తగిలావే బంగారం

పగనిధలోక రారా… ఆశిధజన మందార రారా
ఆకారం చూస్తే అబబో… అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే… అబబో అబబబో బో ఓ ఓఓ

ఒప్పులకుప్ప వయ్యారి భామ…
ఒకటోసారి పుట్టినాది ప్రేమ… డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని… చుట్టి వద్దామా

తిండిమాని… తిండిమాని తిండిమాని
తిండిమాని నీ గురించే నేను ఆలోచిస్తున్నా
నిదురమాని నా కలల్లో… దొంగలా నిను చూస్తున్నా
మైళ్ళకొద్ది వెంట తిరిగి… నిన్ను ఫాలో చేస్తున్న
నిన్ను కలిసిన రోజునుంచి… బొత్తిగా నే నిన్నే మరిచి నీతో ఉంటున్నా

భల్లేగా తగిలావే బంగారం… భల్లేగా తగిలావే బంగారం
హ్హా హ్హా..! భల్లేగా తగిలావే బంగారం… భల్లేగా తగిలావే బంగారం

ఒప్పులకుప్ప వయ్యారి భామ…
ఒకటోసారి పుట్టినాది ప్రేమ… డేటింగ్ గీటింగ్ మొదలెడదామా
ఊర్లో ఉన్న పార్కులన్ని… చుట్టి వద్దామా

పగనిధలోక రారా… ఆశిధజన మందార రారా
తగిలావే తగి తగి… తగిలావే భల్లేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం…
తగిలావే తగి తగి… తగిలావే భల్లేగా తగిలావే
తగి తగి తగిలావే బంగారం…

Krack Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

భూం బద్దలు భూం బద్దలు… లిరిక్స్

చిత్రం: క్రాక్ (2021)
సంగీతం: థమన్ ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మంగ్లీ, సింహా
నటీనటులు: రవితేజ, శృతిహాసన్‌, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్
దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాణం: బి.మధు
విడుదల తేది: 2021

Bhoom Bhaddhal Song Telugu Lyrics

ఊళ్ళో ఏడ ఫంక్షన్ జరిగిన… మనమే కదా ఫస్టు గెస్టు
దద్దరిల్లే దరువుల లెక్కన… మన ఐటమ్ సాంగ్ మస్టు
అల్ ది బెస్టు…

చీమకుర్తిలో కన్ను తెరిచా… చినగంజాంలో నా ఒళ్ళు విరిసా
అట్టా అట్టా అందాలను పరిసా… ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా
ఏ చోటుకి పోయినా… అదే పాత వరసా
చిన్నా పెద్దా నన్ను చూసి… వచ్చేస్తారు వలస
ఆ కష్టం పల్లేక… ఆళ్ళ గోల సూల్లేక
గాల్లోన ముద్దులని ఎగరేసా…
ఉమ్మ్ ఉమ్మ్……….

భూం బద్దలు భూం బద్దలు… నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్… అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు… నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు… మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిచా… చినగంజాంలో నా ఒళ్ళు విరిసా
అట్టా అట్టా అందాలను పరిసా… ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

నీ ఉంగరాల జుట్టు… చూస్తే ముద్దొస్తాందే
మా టంగుటూరు… లతా లచ్చిమి గుర్తొస్తాందే
నువ్వు నవ్వుతుంటె… గుండెకింద సలుపొస్తాందే
నా సైడ్ క్రాఫ్ తెలుపు కూడా… నలుపొస్తాందే
స్టేజి మీదకెక్కనియ్యి… వంద నోట్ల దండేస్తా
వంద కోట్ల సొట్ట బుగ్గ… కందకుండా పిండేస్తా
కరువుతీరా ఒక్కసారి… కావులించి వదిలేస్తా

నీ ఉంగరాల జుట్టు… చూస్తే ముద్దొస్తాందే
మా టంగుటూరు… లతా లచ్చిమి గుర్తొస్తాందే
డీజే డీజే డీజే… డీజే కాదురొరేయ్…
ఇది ఓజే… ఒంగోలు జాతర… ఓజే ఓజే ఓజే

యమ ఆర్కెస్ట్రా డాన్సు… మీకు దొరికిందే చాన్సు
ఐ లవ్ యు మై ఫ్యాన్సు … అందరికీ థాంక్సు
ఈ రాతిరి మీకు ఫుల్ మీల్సు…
దిమ్మ తిరిగే రిలాక్సు… అడగన్లే టాక్సు
తెల్లార్లు కొట్టండి క్లాప్సు…

నీ జోషు, నీ గ్రేసు… అబ్బో అబ్బో అదుర్సు
నీ ముందర జుజూబీలే… మిస్ ఇండియా ఫిగర్స్
ఎయ్..! వన్ టౌన్ రాజా… నీ ఫన్ టౌన్ కి వచ్చానే
వినిపించెయ్ నా జ్యూక్ బాక్సు…

ఉమ్మ్ ఉమ్మ్……….
భూం బద్దలు భూం బద్దలు… నా ముద్దుల సౌండు
నీక్కూడా ఇస్తానబ్బాయ్… అట్నే లైన్లో ఉండు
భూం బద్దలు భూం బద్దలు… నా ముద్దుల సౌండు
ఈ మధ్యన ఎక్కడ సూడు… మనదే కదా ట్రెండు

చీమకుర్తిల కన్ను తెరిచా… చినగంజాంలో నా ఒళ్ళు విరిసా
అట్టా అట్టా అందాలను పరిసా… ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా

Krack Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Rani Kasula Rangamma (1981)
error: Content is protected !!