చిత్రం: కృష్ణబాబు (1999)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాసు
నటీనటులు: బాలక్రిష్ణ , మీన , రాశి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాతలు: చంటి అడ్డాల, వి.శ్రీనివాస రెడ్డి
విడుదల తేది: 16.09.1999
ఓ… ఓ…ఓ…ఓ…
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు
గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు
కలిసిన రూపం నీ వనుకో
ఓ… ఓ…ఓ…ఓ…
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
పినతల్లి జూదాన ఒక పావుగా
నీ వల్ల నీ తండ్రి మరణించినా
కారడవిలో దారి కనిపించక
చేజేతులా తెలిసి చితిపేర్చిన
ఏమి విధి రాతనక రామకథ అనుకో
ఏ జన్మ రక్షణకో జన్మ పొందావనుకో
నీ వేదనే వేదమై చదువుకో
ఓ… ఓ…ఓ…ఓ…
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
ఎందరికి ఆశ్రయము కలిపించినా
నీ గుండెల్లో చోటింక మిగిలున్నదే
అందుకనే కష్టాలు ఎన్నోచ్చినా
అవి నీ అందకోరాయి అని నవ్వుకో
కొండంత భారాలే సూదంత లనుకుంటూ
బంధించు సంకెళ్ళే బంధు జనాలనుకుంటూ
ఈ భాదలే బలముగా మార్చుకో
ఓ… ఓ…ఓ…ఓ…
ఓ మనసా ఎదురీతే నేర్చుకో
ఓ మనిషి ఎద కోతే ఓర్చుకో
గొంతులో గరళాన్ని బంధించు ఈశ్వరుడు
గుండెలో బడబాగ్ని దాచుకొను సాగరుడు
కలిసిన రూపం నీ వనుకో
ఓ… ఓ…ఓ…ఓ…