చిత్రం: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని (2015)
సంగీతం: హరి
సాహిత్యం:
గానం: హరిచరన్
నటీనటులు: సుదీర్ బాబు, నందిత
దర్శకత్వం: ఆర్. చంద్రు
నిర్మాత: శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 19.06.2015
విడిచే సమయమెదురై అది పిలిచెనే వ్యధయై
గడచిన కాలమే ఇలా నిధురై కలగమారే
మరిచే వీలులేదే మరలా తిరిగి రాదే
రాదే రాదే రాదే రాదే
గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనిల్లా
గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనే..
రాదే రాదే రాదే రాదే రాదే రాదే రాదే
పరిచయమైన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు
పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే..
అపురూపమైన ఈ విలువని నేటితో ఇక సెలవని
వదిలేదంటు మరి లేదని చేయి చేయి కలిపే
పేరు నీ కీర్తిని సాధించిన లక్ష్యాలు ఎన్నో చేధించిన
మరల తిరిగి ఆ రోజులు నీ ముంగిటే నిలుచునా
రాదే రాదే రాదే రాదే
జాబిలి లేని ఆ నింగినై తీరంలేని ఓ సాగరమై
నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే
దూరం స్నేహమై నిలవనీ స్నేహం బంధమై ఎదగనీ
నాలో ఉన్న ఈ ప్రేమనీ నిన్నే చేరుకోనీ
సంద్రపు లోతులే తెలిసినా ముత్యపు సంపదే దొరకునా మరల తిరిగి ఆ రోజులే నీ ముంగిటే నిలుచునా