Krishnarjuna Yudham (2018)

చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: పెంచల్ దాస్
గానం: పెంచల్ దాస్
నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ మీర్
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని
ఎడిటర్:
విడుదల తేది: 12.04.2018

దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరే చూడు
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బేరే చూడు

కమలపూడి  కమలపూడి కట్టమిందా మామ
కన్నెపిల్లల జోరె చూడు
కమలపూడి కట్టమిందా మామ
కన్నెపిల్లల జోరె చూడు

బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా
చిలకముక్కు చిన్నవాడా

చక్కని చుక్క చక్కని చుక్క
దక్కే చూడు మామ చిత్ర కన్ను కొంటెవాడ
చిత్ర కన్ను కొంటెవాడ చిత్ర కన్ను కొంటెవాడ

మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
మేడలోని కుర్రాదాన్ని పిలగా
ముగ్గులోకి దింపినావు
నిన్ను కోరి నిన్ను కోరి
వన్నెలాడి లైలా కోట దాటి పేట జేరే

కురస కురస అడివిలోన పిలగా
కురిసెనే గాంధారి వాన
కురస కురస అడివిలోన పిలగా
కురిసెనే గాంధారి వాన

ఎక్కరాని ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోన చిక్కినావు
ఎక్కరాని కొండలెక్కి మామ
ప్రేమలోన చిక్కినావు

పూల ఛత్రి పట్టుకోని పిలగా
ఊరు వాడ తోడు రాగ
పూల ఛత్రి పట్టుకోని పిలగా
ఊరు వాడ తోడు రాగ

జంటగానే జంటగానే
కూడినారు మామ చలువ పందిరి నీడ కింద
జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కింద

కన్నెపిల్లల జోరె చూడు

*******  *******  *******

చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: శ్రీజో
గానం: ఎల్. వి.రేవంత్ , సంజీత్ హెడ్గే

నా కనులే కననీ
ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా…ఈ వరసా
నా ఎదలో నలిగే
ఓ ప్రశ్నే అడిగా
నే వెతికే స్నేహం…నీ మనసా
ఒడ్డు చేరలేని ఈ అలే
దాటుతోంది సాగరాలనే
ఒక్క గుండె ఇంక చాలదే
కమ్ముకుంటె ఈ అల్లరే

i wanna fly wanna fly
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
love feeling it inside
ఈ వెలుగే వరమై
ఏ కథలో విననీ భావమిదా

ఊహల్కే సరిహద్దులు లేవని ఈ క్షనమే తెలిశే
అందుకనే చూపుల వంతెనపై హృదయం పరుగిడెనే
వెన్నెల కన్న చల్లని సెగతో feeling this moment sway
నీ వేకువలో వెచ్చని ఊహై i’ll melt youe heart away
ఒక ప్రాణం అది నీదవనీ
girl your smile నా జగమవనీ

నా కనులే కననీ
ఆ కలనే కలిసా
నీ వలనే బహుశా…ఈ వరసా
i wanna fly wanna fly
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా

baby lemme kiss you caress you
hold you tight my baby bhoo
never let you go away from me
cozi got issues well i miss you
but i still i love the way
you lookin in my eyes and say
those diamonds and the buzz don’t matter
to you bae one love one life one wife and that’s it
true love from the heart trust you

వెతికానునే నన్ను నీ లోకంలో
నడిచా నీడై ప్రతి అడుగు నీతో
నీ తలపు విడిచే నిమిషమిక నాకెదురుపడదే
అరెరే చిలిపి మదికే తెలిశనిక నా కలల బరువే

i wanna fly wanna fly
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
love feeling it inside
ఈ వెలుగే వరమై
ఏ కథలో విననీ భావమిదా
i wanna fly wanna fly
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై పిలిచినదా
love feeling it inside
ఈ వెలుగే వరమై
ఏ కథలో విననీ భావమిదా

*******  *******  *******

చిత్రం: కృష్ణార్జున యుద్ధం (2018)
సంగీతం: హిప్ హాప్ తమిజ్
సాహిత్యం: శ్రీజో
గానం: రఘు దీక్షిత్

ఉరిమే మనసే ఉప్పెనై ఉన్న గుండెనే
నేడు నిప్పులే చిమ్మనీ
నీడలా నువ్వు లేనిదే
నేను నేనుగా లేననీ

ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే
రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే
వెతికా నేనై ఆకాశం
మిగిల శ్వాసై నీ కోసం
ఎపుడు నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం

గ్నాపకాలే గుచ్చుతుంటే చిన్నుగుండెనే
నిన్ను తాకే హాయినిచ్చే కొత్త ఆయువే
యుద్దం కోసం నువ్వే సిద్దం
నీలో నేనే ఆయుదం
నీవే ద్యానం నీవే గమ్యం
నాలో లేదే సంసయం
చల్ చల్ చల్ తుఫాను వేగమై చలో చలో చలో
ఘల్ ఘల్ ఘల్ ఆ గెలు చప్పుడే ఈ దారిలో
పరుగు తీసె ప్రాయమా ఊపిరై నా ప్రేమనే తీరం చేరవే
ప్రపంచమే వినేట్టుగా ఈ ప్రేమ గాద చాటవే

ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే
రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే
వెతికా నేనై ఆకాశం
మిగిల శ్వాసై నీ కోసం
ఎపుడు నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం

ఉన్న చోత ఉందనీయదే ఉరిమే మనసే
రెప్పనైన వెయ్యనియ్యదే తరిమే మనసే
వెతికా నేనై ఆకాశం
మిగిల శ్వాసై నీ కోసం
ఎపుడు నీదై నా లోకం
ఎదురే చూసే ఏకాంతం
ఎదురే చూసే ఏకాంతం

Previous
Juvva (2018)

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Suvarna Sundari (1985)
error: Content is protected !!