Krishnarjunulu (1982)

చిత్రం:  కృష్ణార్జునులు (1982)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాత: జయకృష్ణ
విడుదల తేది: 26.03.1982

పల్లవి:
హే.. హెహె.. హే.. హే
ఆ.. ఆ.. ఆ..ఆ …. అహహా…అరరరరా..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఒహొహో.. అరరరరా..

బంగారు బాల పిచ్చుక…క…
నీ చూపులతో నన్ను గిచ్చక.. క…
వెచ్చగుంది పచ్చిక… చేసుకో మచ్చిక
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే…. దుబుదుబుదుబు
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే….దుబుదుబుదుబు

బంగారు బాల పిచ్చుక…క…
నీ మాటలతో పొద్దు పుచ్చక….క…
మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా… అరే..దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా… అరే..దుబుదుబుదుబు

చరణం: 1
వాలు చూపుల వంతెనేసి.. వంటి దూరం దాటకుంటే
పిచ్చుకెగిరి గూడు మిగిలేనే……ఏ..ఏ..
కంటి పాపల జోలపాడి… జంట ఊయల ఊగకుంటే
చిచ్చు రగిలి గోడు మిగిలేనే……ఏ..ఏ..

అచ్చట్లాడే.. ముచ్చట్లాడే.. అందమిచ్చుకో
ఎప్పట్లాగే.. చప్పట్లేసి.. ఈడు తెచ్చుకో

దుబుదుబుదుబు…

బంగారు బాల పిచ్చుక…క..  నీ చూపులతో నన్ను గిచ్చక
మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా… అరే.. దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా… అరే.. దుబుదుబుదుబు

చరణం: 2
మల్లెజాజుల మంచు తీసి… పిల్లగాలితో చల్లకుంటే
పిచ్చి ముదిరి ప్రేమ రగిలేనే…ఏ..ఏ..
ఆయ్..చందమామ ముద్దుపెట్టే… సందె కబురే పంపకుంటే
ఉచ్చు బిగిసి  ఊపిరాగేనే…ఏ…ఏ..

అచ్చమత్త బుచ్చబ్బాయి లగ్గమెట్టుకో
అచ్చొత్తాయి అందాక నీ బుగ్గలిచ్చుకో..

దుబుదుబుదుబు…
బంగారు బాల పిచ్చుక….క..క..నీ మాటలతో పొద్దు పుచ్చక…క..క..
మాపటేల వెచ్చగ.. మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా… అరే..దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా… అరే..దుబుదుబుదుబు

బంగారు బాల పిచ్చుక…క..క..  నీ చూపులతో నన్ను గిచ్చక.. క.. క..
వెచ్చగుంది పచ్చిక… చేసుకో మచ్చిక
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే..దుబుదుబుదుబు
మురిపాల ముద్దు ముచ్చికా.. అరే..దుబుదుబుదుబు

******  ******  ******

చిత్రం:  కృష్ణార్జునులు (1982)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
సుందర బృందవనిలో ఈ సుందరి సుమసుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి

జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శృతి నీవు అంది…లయ నేనే అంది…
కనుచూపే కల్యాణమంది..కనుచూపే కల్యాణమంది

సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి

చరణం: 1
నా మధు మాసాల ఉదయినిగా.. నా మందహాసాల మధువనిగా
ఆ..హా..హ..ఆ..హా..హ..హా హ హా హ హా
నా మధు మాసాల ఉదయినిగా..నా మందహాసాల మధువనిగా

చిరుకాటుకలద్దితే చీకటిగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
చిరుకాటుకలద్దితే చీకటిగా
సిరిమల్లె తురిమితే పున్నమిగా
స్వరమైతే నీవు.. జతి నేను అంది..
మనసంటే మాంగల్యమంది…..
మనసంటే మాంగల్యమంది…..

సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి

చరణం: 2
ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక
ఆహా..ఆహహా..హహాహ..హహహా..హా..హా..
ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక

ఉలి చూపు తగిలితే శిల్పముగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
ఉలి చూపు తగిలితే శిల్పముగా
చెలి తాను కదిలితే నాట్యముగా
భావాలు నీవి.. రాగాలు నావి
సగమైతే జగమూగునంది.. సగమైతే జగమూగునంది

సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా.
జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శుతి నీవు అంది..లయ నేను అంది
కనుచూపే కల్యాణమంది.. కనుచూపే కల్యాణమంది

సుందర బృందవనిలో ఈ సుందరి సుమసుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బృందవనిలో ఈ సుందరి సుమ సుకుమారి

******  ******  ******

చిత్రం:  కృష్ణార్జునులు (1982)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  వేటూరి
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
పిల్లదాని వాలుకన్నుల
మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
పిల్లదాని వాలుకన్నుల

మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
ఎన్నెలమ్మ ఎండికన్నుల
మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
ఎన్నెలమ్మ ఎండికన్నుల
ఓ ఓ….

చరణం: 1
వెలుతురు తొటలో మిణుగురు పాటలా
వెలుతురు వేణువూదెనే ఎన్నెలా
తిమ్మెర వీణ మీటెనే
వెలుతురు తొటలొ మిణుగురు పాటలా
వెలుతురు వేణువూదెనే ఎన్నెలా
తిమ్మెర వీణ మీటెనే

ఆ నిదరమ్మ ముదరేసె కలల అలల వెల్లువలొ

చరణం: 2
వణికిన పెదవులా తొణికిన మధువులా
పొగడలు కొండలాయనే ఎన్నెల
మనుగడ మీగడయెనే
వణికిన పెదవులా తొణికిన మధువులా
పొగడలు కొండలాయనే ఎన్నెల
మనుగడ మీగడయెనే

ఇద్దరయిన ముద్దులమ్మ వలపు అలల అల్లికలొ

మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
ఎన్నెలమ్మ ఎండికన్నుల

మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
పిల్లదాని వాలుకన్నుల

*******  *******  *******

చిత్రం: శ్రీకృష్ణార్జునులు (1982)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:
గానం: యస్. పి.బాలు పి.సుశీల

మరదలా  మరదలా మణిక్యమా
మరదలా  వయ్యారి మరదలా
వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా
నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా

వదినా వదినా వైడూర్యమా
వదినా వదినా వైడూర్యమా
వదినా వగలమారి వదినా
మరదలంటే నీకు విడ్డురమా
ఈ మరదలంటే నీకు విడ్డురమా

చిట్టిముక్కు చిలక ముక్కు ఆయనేమిటే
చీమకళ్లు చారెడంత ఆయనెందుకే
చిట్టిముక్కు చిలక ముక్కు ఆయనేమిటే
చీమకళ్లు చారెడంత ఆయనెందుకే
పెద్దింటి వాళ్లకు పెద్ద పెద్ద కళ్ళకు
నిమ్మపండైన దానిమ్మపండే
అదా సంగతి – ఆ అంతే సంగతి
అదా సంగతి  – ఆ అంతే సంగతి

మరదలా  మరదలా మణిక్యమా
మరదలా  వయ్యారి మరదలా
వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా
నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా

మగువరో  పెళ్లంటే మాటిపోయిందా
ఆ పైన ఈ వదిన గుర్తుంటుందా
మగువరో  పెళ్లంటే మాటిపోయిందా
ఆ పైన ఈ వదిన గుర్తుంటుందా
మా వదిన విసురులు మొగలిపూల గుబురులు
మా వదిన విసురులు మొగలిపూల గుబురులు
గుమ్మంటు గుచ్చుకునే వరసలు

అదా సంగతి – ఆ అంతే సంగతి
అదా సంగతి  – ఆ అంతే సంగతి

గాలి తాకితే కందే పాలబుగ్గల చెల్లి
తెలుపేదో నలుపేదో తెలియనిదీ పసితల్లి
గాలి తాకితే కందే పాలబుగ్గల చెల్లి
తెలుపేదో నలుపేదో తెలియనిదీ పసితల్లి
తెలుసుకొని మా చెల్లి మనసుతీరు
ఎలా ఏలుకుంటారో బావగారు
ఎలా ఏలుకుంటారో బావగారు

అంతగ చెప్పాలా ఆ అప్పగింతలు చెప్పాలా
అంతగ చెప్పాలా అప్పగింతలు చెప్పాలా
మూడు నెలల పిదప వచ్చి చూడు బావా
నీ ముద్దుల చెల్లాయి నడిగి చూడు బావా

అదా సంగతి – ఆ అంతే సంగతి
అదా సంగతి  – ఆ హ అంతే సంగతి

మరదలా  మరదలా మణిక్యమా
మరదలా  వయ్యారి మరదలా
వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా
నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా

మరదలా  మరదలా మణిక్యమా
మరదలా  వయ్యారి మరదలా
వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా
నీకు వరదలా సిగ్గోస్తే ఆపసెక్యమా

error: Content is protected !!