Kudirithe Kappu Coffee (2011)

kudirithe kappu coffee 2011

చిత్రం: కుదిరితే కప్పు కాఫీ (2011)
సంగీతం: యోగేశ్వర శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
నటీనటులు: వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య
దర్శకత్వం: రమణ శల్వ
నిర్మాతలు: మహి వి.రాఘవ, శివ మేక
విడుదల తేది: 25.02.2011

అందరిలాగా నేను అంతే అనుకోవాలా
తొందర పెట్టె తోవల వెంటే వెళిపోవాలా
అనుకోనిదైనా ఆలోచనా.. బాగుంది అననా ఈ భావనా
నిన్నడగాలనుకుంటున్నా… నిందించాలా.. ఆనందించాలా…

నో నో అటుపోవద్దు మనసా ఏంటా మత్తు అన్నా ముందే ఎన్నో చెప్పి
ఏదో సరదాలెద్దు వేరే ఏమీ లేదు తప్పా అందీ కట్టు తప్పి
వీలైతే కాసిని కబుర్లు కుదిరితే కప్పు కాఫీ
అంటూనే చేజారింది ఇట్టే కన్ను కప్పి
మాటామాట కలిపి అటుపైన మాయగొలిపి
ఎంత హాయి అందే ఈ తీయనైన నొప్పి
నిన్నడగాలనుకుంటున్నా… నిందించాలా.. ఆనందించాలా…
అందరిలాగా నేను అంతే అనుకోవాలా
తొందర పెట్టె తోవల వెంటే వెళిపోవాలా

తానే నమ్మేటట్టు తనపై తానె ఒట్టు వేస్తూ అందించింది హామీ
పోన్లే పాపం అంటూ త్వరగా వచ్చెయ్ అంటూ చూస్తూ పంపించాను మదిని
గూడంతా ఖాళీ చేస్తూ వెళిపోయిన గువ్వల్లా
నాకన్నుల్లో కలలన్నీ నీ వల్లో చిక్కాలా
ఎవరి నేరమంటూ నిష్టూరమెందుకంటే
కలిసి ఒప్పుకుంటే అది కూడా మంచి మాటే
నిన్నడగాలనుకుంటున్నా… నిందించాలా.. ఆనందించాలా…
అందరిలాగా నేను అంతే అనుకోవాలా
తొందర పెట్టె తోవల వెంటే వెళిపోవాలా

*******   *******  ******

చిత్రం: కుదిరితే కప్పు కాఫీ (2011)
సంగీతం: యోగేశ్వర శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యమ్.యమ్.కీరవాణి

అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా
అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా
వుందంటే వున్నట్టు లేదంటే లేనట్టు
ఆకాశం లాంటిదే ప్రేమా కదా దీనికి ఆది అంతూ వుంటే కదా
అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా
ఓ ఓ ఓ ఓహో… ఓ ఓ ఓ ఓ ….. ఓహో……

వడగాలై కొడుతుంది వడగళ్ళై పడుతుంది చలిముళ్ళై కుడుతుంది వలపొచ్చి ఆరు రుతువుల్ని ఓసారే రప్పించి
వడగాలై కొడుతుంది వడగళ్ళై పడుతుంది చలిముళ్ళై కుడుతుంది వలపొచ్చి ఆరు రుతువుల్ని ఓసారే రప్పించి
ఎన్నెన్నో వర్ణాలు వైనాలు తనలోనే వున్నట్టు కన్నుల్ని ఆకట్టి
రమ్మంది పైనుంచి కూతెట్టి తాను కూచుంది గుండెల్లో గూడెట్టి
రమ్మంది పైనుంచి కూతెట్టి తాను కూచుంది గుండెల్లో గూడెట్టి

అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా

దిమిసా దిమిసా దిమిసా దిల్లోరే దిల్లోరే దిమిసా దిమిసా దిమిసా దిల్దిల్లోరే
దిమిసా దిమిసా దిమిసా దిల్లోరే దిల్లోరే దిమిసా దిమిసా దిమిసా దిల్దిల్లోరే

మజునూలెంతో మదికి గజనీలెంతో మందికి ఈ కతనే చెప్పింది జోకొట్టి వొళ్ళో పడుకోబెట్టుకున్న ఈ మట్టి
మజునూలెంతో మదికి గజనీలెంతో మందికి ఈ కతనే చెప్పింది జోకొట్టి వొళ్ళో పడుకోబెట్టుకున్న ఈ మట్టి
కునుకొచ్చిందే కాని వూకొట్టి వూకొట్టి కదకేమిందో తెలియదు కాబట్టి.. కాబట్టి…
మళ్ళీ వినిపిస్తుంది మొదలెట్టి ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తి
మళ్ళీ వినిపిస్తుంది మొదలెట్టి ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తి

అనగా అనగా అనగా అనగనగనగనగనగా అంతే ఇంకేముంది చాలు కదా
వుందంటే వున్నట్టు లేదంటే లేనట్టు
ఆకాశం లాంటిదే ప్రేమా కదా దీనికి ఆది అంతూ వుంటే కదా
ఆకాశం లాంటిదే ప్రేమా కదా దీనికి ఆది అంతూ వుంటే కదా

*******   *******  ******

చిత్రం: కుదిరితే కప్పు కాఫీ (2011)
సంగీతం: యోగేశ్వర శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హంసిక అయ్యర్

అతడిలో ఏదో మతలబు వుందే ఏంటంటే చెప్పాడుగా
అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా
ప్రాణహాని మానహాని వెంటపడి వస్తున్నట్టే
పొగరనాలో బెదురనాలో వాలకం చూస్తుంటే

విరక్తి చెందే వయస్సు కాదే పైలా పచ్చీసే
తపస్సు చేసే తలంపు లేదే హుషారయిన ఫేసే
ఏతా వాతా తేలేదేమిటి ఎలాంటి తేడా లేదే
ప్రేమా భామా అనేది మాత్రం చెవిలో పడరాదంతే
ఎన్నాళ్ళిలా ఏకాకిలా ఉంటాడో ఏమో తెలీదే

తనేమి అనడు అనేది వినడు ఏం మనిషో గాని
అదో విధంగా అమాయకంగా చూస్తా డెందుకని
అమ్మాయిగా జన్మించడమేనా నే చేసిన అపచారం
మగపుట్టుక చెడిపోతుందో నాతో చేస్తే స్నేహం
నేనవ్వితే చిరుచేదు గా ఉందేమో పాపం తనకి

*******   *******  ******

చిత్రం: కుదిరితే కప్పు కాఫీ (2011)
సంగీతం: యోగేశ్వర శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, నిహల్

తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన

శ్రీకారం చుడుతున్నట్టు కమ్మనికలనాహ్వాదిస్తూ
నీ కనులేటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టూ దాక్కుందే బంగరు బొమ్మ

తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన

జల జల జల జాజుల వాన కిలకిలకిల కిన్నెర వీణ
మిలమిలమిన్నంచుల పైన మేలి తిరిగిన చంచలయాన
మదిరోహల లాహిరిలోనా మదినూపే మధిరవి జాణ

నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా నీవెనకాలేమవుతున్నా
నీ వీపుని ముళ్ళై గుచ్చే కులుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన వూరు లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలై పోతారు
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణవుతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టాగమ్మా .

తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన

నక్షత్రాలెన్నంటూ లెక్కేడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురోస్తున్నట్టు
చిక్కటి చీకటి నే చూస్తూ నిద్దురనే వెలి వేయద్దు
వేకువనే లాక్కొచ్చెట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టూ
అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుగ్గాని
నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మా

తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన
తోంతనననన తోంతనననన తోంతనననన తోంతనననన

*******   *******  ******

చిత్రం: కుదిరితే కప్పు కాఫీ (2011)
సంగీతం: యోగేశ్వర శర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బాలాజీ, రంజిత్

ఏదో.. ఏదో… ఏదో.. ఏదో…
ఏదో.. ఏదో… ఏదో.. ఏదో…
ఈ లోకం ఏం చూస్తోందో
చూస్తున్నా ఏం చేస్తోందో
ప్రశ్నిస్తే బదులేదైనా వుందో లేదో
ప్రాణాలే పందెం వేస్తూ
గాయాన్నే ఆటాడించే
ప్రేమంటే అర్థం తెలిసిందో… లేదో…
ఏదో.. ఏదో… ఏదో.. ఏదో.
ఏదో.. ఏదో… ఏదో.. ఏదో.

గాలి వాటమే గమనమని పరిగెడితే
కాలకూటమే అమృతమని పొరబడితే
సంద్రం లో చేరే మోహం కాగా గంగా ప్రవాహం
కన్నీరే కోరే దాహం కాదా నిండు జీవితం
వూరెక్కి వుయ్యాలూగే ఉన్మాదం పేరు ప్రేమా
నిప్పుల్లో నిత్యం వేగే నిట్టూర్పేరే ప్రేమా అంటుందో అనుకుంటుందో…
.ఈ లోకం ఏం చూస్తోందో
చూస్తున్నా ఏం చేస్తోందో
ప్రశ్నిస్తే బదులేదైనా వుందో లేదో

త్రోవ తోచదే భ్రమ పడే తలపులకు
దారి చూపదే బ్రతుకు కే చితి వెలుగు
వందేళ్ళ బంధాలన్నీ తెంచే భావం ఏమిటో
గుండెల్లో శ్వాసే కొండంతయ్యే భారం ఏమిటో
ఏం పొందాలనుకుంటుందో అది ఏ శూన్యం లో వుందో
బలి కోరే ఆరాటం తో మది అన్వేషిస్తూ ఏమై పోతుందో ఎటు పోతుందో
ఈ లోకం ఏం చూస్తోందో
చూస్తున్నా ఏం చేస్తోందో
ప్రశ్నిస్తే బదులేదైనా వుందో లేదో
ప్రాణాలే పందెం వేస్తూ
గాయాన్నే ఆటాడించే
ప్రేమంటే అర్థం తెలిసిందో… లేదో…
ఏదో.. ఏదో… ఏదో.. ఏదో.
ఏదో.. ఏదో… ఏదో.. ఏదో.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top