KUMKUMA TILAKAM (1982)

ఆలనగా.. పాలనగా అలసిన వేళల అమ్మవుగా… లిరిక్స్

చిత్రం: కుంకుమ తిలకం (1982)
సంగీతం: సత్యం
సాహిత్యం: ఎం.గోపి
గానం: కె. జె. యేసుదాసు
నటీనటులు: మురళీ మోహన్, జయసుధ, సురేష్, తులసి
దర్శకత్వం: బి.భాస్కర్ రావు
నిర్మాణం : యడవల్లి రాజేంద్ర రెడ్డి
విడుదల తేది: 31.12.1982

Aalanaga Palanaga Song Lyrics

పల్లవి:

ఆలనగా.. పాలనగా.. అలసిన వేళల అమ్మవుగా..
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా..

ఆలనగా.. పాలనగా.. అలసిన వేళల అమ్మవుగా..
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా..

చరణం 1:

నీ చిరునవ్వే.. తోడై ఉంటే.. నే గెలిచేను లోకాలన్నీ..
ఆ.. ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ..
నీ చిరునవ్వే.. తోడై ఉంటే.. నే గెలిచేను లోకాలన్నీ..

అరఘడియైనా.. నీ ఎడబాటు.. వెన్నెల కూడా చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా..

చరణం 2:

మోమున మెరిసే.. కుంకుమ తిలకం.. నింగిని వెలిగే.. జాబిలి కిరణం
ఆ.. ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ..
మోమున మెరిసే.. కుంకుమ తిలకం.. నింగిని వెలిగే.. జాబిలి కిరణం

నేనంటే.. నీ మంగళ సూత్రం.. నువ్వంటే.. నా ఆరో ప్రాణం
లాలించు ఇల్లాలిగా.. దేవీ.. పాలించు నా రాణిగా..

ఆలనగా.. పాలనగా.. అలసిన వేళల అమ్మవుగా..
ఆహాహహా.. హాహహా హాహా ఊఊఊ ఊ ఊ

Kumkuma Tilakam Movie Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****