Ladies Tailor (1986)

చిత్రం: లేడీస్ టైలర్ (1986)
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
నటీనటులు: రాజేంద్రప్రసాద్, అర్చన
దర్శకత్వం: వంశీ
నిర్మాత: కె.శారదాదేవి
విడుదల తేది: 26.11.1986

ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా – కనులకు కనరావా
ఉన్నాను రావా – నలు చెరుగుల తిరుగుదు మరి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా

ఆకారం చూస్తే సరిపోదంటా
ఒకటే గురుతూ తెలిసేదెట్టా
ఆకారం చూస్తే సరిపోదంటా
ఒకటే గురుతూ తెలిసేదెట్టా
ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ
ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ
గుట్టు మట్టు చేసీ – పుట్టు మచ్చను చూసీ
టక్కున పట్టేయ్యాలి – నక్కను తొక్కేయ్యాలి
పొరబడి పరులకు దొరకక

ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా – కనులకు కనరావా
ఉన్నాను రావా – నలు చెరుగుల తిరుగుదు మరి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా

శ్రీదేవి వాణి పశుపతి రాణి
ఎదురై నిలిచే సమయము లేనా
శ్రీదేవి వాణి పశుపతి రాణి
ఎదురై నిలిచే సమయము లేనా
ఎల్లాగనీ గుర్తించనూ శ్రీదేవినీ ఆ దేవిని
ఎల్లాగనీ గుర్తించనూ నా దేవి ఏదో
గుర్తులు గుట్టుగ దాచి – అల్లరి పెట్టే వేళ
ఎవ్వరి నవ్వులు నమ్మను – గుండెను ఎవ్వరికివ్వను
హరి హరి ఇకమరి పని సరి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక
చిక్కవే తప్పున చక్కగ
టక్కున టక్కరి పిట్టా
నిన్ను పట్టే దెట్టా
మచ్చున భామా – కనులకు కనరావా
ఉన్నాను రావా – నలు చెరుగుల తిరుగుదు మరి

********   *******   *********

చిత్రం: లేడీస్ టైలర్ (1986)
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

హాయమ్మా హాయమ్మా హాయమ్మా  “4”
అందాల బంధంలో వుందామా ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందమా కౌగిళ్ళు పంచుకుందామా
ఓయమ్మా ఓయమ్మా  ఓయమ్మా  “4”
సింగారి గంగల్లే పొంగెను కంగారై గుండె కుంగెను
శృంగార రంగాన చిక్కెను రంగేళి నీకే దక్కెను

చరణం: 1
దరహాసమై నీ అధరాలపైనే
ఉండమ్మా ఉండమ్మా ఉండమ్మా
చిరవాసముండే సరళాక్షి నేనే
ఔనమ్మా ఔనమ్మా  ఔనమ్మా
నను చూడు
సయ్యమ్మ సయ్యమ్మ
మనువాడు
సయ్యమ్మ సయ్యమ్మ
అలివేణి
నాదమ్మ నాదమ్మ
కలవాణి
నీవమ్మ నీవమ్మ
నీనుగానే ఎదనదిలో అలజడి ఏదో సుడితిరిగే
నీవే జతవైతే కల తీరేను ఈవేళ “హాయమ్మా”

చరణం: 2
మదిలోని బాల ఎదురైన వేళ
హాయమ్మా హాయమ్మా హాయమ్మా
పదహారువేళ మదిరాచులేలా
హాయమ్మా హాయమ్మా హాయమ్మా
మురిపాలు
హాయమ్మా హాయమ్మా
సరదాలు
హాయమ్మా హాయమ్మా
సరసాలు
హాయమ్మా హాయమ్మా
సగపాలు
హాయమ్మా హాయమ్మా
తరుణం నిన్నే పిలిచేనురా తరుణం నేడే కుదిరేనురా
ఏడు జన్మాల నీ జోడు నేనేరా  “హాయమ్మా”

********   *******   *********

చిత్రం: లేడీస్ టైలర్ (1986)
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

గోపీలోల నీ పాల పడ్డమురా
లీలాలొల అల్లాడుతున్నామురా
చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా
అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు

గోపీలోల నీ పాల పడ్డమురా
లీలాలొల అల్లాడుతున్నామురా
చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా
అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు

చరణం: 1
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా
మచ్చ మచ్చ  మచ్చ  మచ్చ
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా
జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా
మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా
తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే
తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే
మోక్షం కన్న మానం మిన్న

గోపీలోల నీ పాల పడ్డమురా
లీలాలొల అల్లాడుతున్నామురా

చరణం: 2
వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ
నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా  భామా
తగదురా ఇది మరి చోద్యంకాదా
సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా
చూసే కలలు ఎన్నో ఉన్నా
చూపే హృదయం ఒకటే ఉందమ్మా

గోపీలోల నీ పాల పడ్డమురా
లీలాలొల అల్లాడుతున్నామురా
చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువేకోరి చెయ్యేత్తి మొక్కలమ్మా
అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు

********   *******   *********

చిత్రం: లేడీస్ టైలర్ (1986)
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, శ్రీరామచంద్ర

పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా
పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా
ఏదో పాపం పసివాణ్ణి జాలిచూపి వదలండి మన్నించండి
అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా
అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా

వలను కొరికే చేప నేను…
ఎరను చూసి మోసపోను
వెకిలివేషాలు ముదిరిపోతేను అసలు పాఠాలు నేర్పగా
యముడిలా వాడు వెనక వున్నాడు తెలుసునా తెలియజెప్పనా
వద్దు వద్దు బాబోయ్ తప్పుకాయ్ తల్లోయ్
చెంపలేసుకుంటా గోడకుర్చీ వేస్తా
మొన్ననే నేను కళ్ళుతెరిచాను
ఇంతలో నన్ను బూచాడికి ఇచ్చెయకు

అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా
అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా
పోని పాపం అనుకుంటే తనువే ముదిరిందే మరియాదేనా పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా

విలువ తెలిసే వెతికి చేరా
బ్రతుకు నీతో ముడినివేసా
దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా
మనసులో మాట తెలుసుకోవమ్మా చెలిమితో కలిమి కురియవా
చిన్నవాడ నిన్ను నమ్ముతాను లేవోయి
అల్లరెందుకు ఇంకా పల్లకిని తేవోయి
కోతివేషాలు మానితే చాలు
నిన్ను వెన్నంటే వుంటాను ఏనాడు

పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా
పొరబాటిది తటబాటిది గుంజీలేతీసెయ్యనా
ఏదో పాపం పసివాణ్ణి జాలిచూపి వదలండి మన్నించండి
అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా
అతి తెలివితో మతిపోయేనా నీ వేషం నాముందరా

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Nari Nari Naduma Murari (1990)
error: Content is protected !!