Lakshadhikari (1963)

చిత్రం: లక్షాధికారి (1963)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: వి.మధుసూధన రావు
నిర్మాతలు: సి. తమ్మారెడ్డి కృష్ణమూర్తి, డి.వెంకటపతి రెడ్డి
విడుదల తేది: 27.09.1963

పల్లవి:
ఆ.. ఆ.. ఆ..
ఓ…ఓ.. ఓ..
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది
ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది

చరణం: 1
చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను
చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను

చేయి చేయి కలపగానే మెరుపు మెరిసెను
ఆ మెరుపులోన నా మేను జలదరించెను

ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది

చరణం: 2
కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి
కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి

మధురమైన మైకమేదో కలుగుచున్నది
ఆ మైక మందు నేనేదో మారిపోతిని

ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది

చరణం: 3
చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది
చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది

కన్నెవలపు అతని చుట్టు తిరుగుతున్నది
ఆ వన్నెకాణ్ణి విడిచి తాను రానన్నది

ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది

******   ******  ******

చిత్రం:  లక్షాధికారి (1963)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల,  పి.సుశీల

సాకీ:
హాయ్.. హాయ్.. హాయ్
నా చెంప తాకగానే… చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే… అరెరె.. నాజూకు తగ్గెనేమో
నా చెంప తాకగానే… చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే… అరెరె.. నాజూకు తగ్గెనేమో

నాపైన నీకు కోపమా.. కాదేమి విరహతాపమా
నాపైన నీకు కోపమా విరహతాపమా
పలుకగా రాదా… అలుక మరియాదా
నీ పదునౌ చూపుల అదిరింపులకే బెదరను బెదరను బెదరనులే

పల్లవి:
దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే

చరణం: 1
నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె
నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె

అయ్యారే మేని అందము.. బంగారు తీగ చందము
అయ్యారే మేని అందము.. తీగ చందము
మరులుగొలిపేనూ.. మనసు దోచేనూ
ఈ కమ్మని రాతిరి కరిగేదాకా.. కదలను కదలను కదలనులే

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే

చరణం: 2
నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను
నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను

నువు లేకపోతే ఓ చెలీ.. ఈ లోకమంతా చలి చలి
నువు లేకపోతే ఓ చెలీ.. లోకమే చలి
ఏమి చేసేనే..  ఎటుల సైచేనే
నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా.. విడువను విడువను విడువనులే

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే

******   ******  ******

చిత్రం: లక్షాధికారి (1963)
సంగీతం: టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల

పల్లవి:
దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే

చరణం: 1
నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది
నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది
నీ ఓర చూపులను గని.. బంగారు తూపులనుకొని
నీ ఓర చూపులను గని..  తూపులనుకొని మురిసిపోతానూ.. పరవసించేనూ
 నీ కన్నులు రమ్మని పిలిచేదాక కదలను..కదలను..కదలనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను..వదలను..వదలనులే

చరణం: 2
పొదలలోన వున్నా పూల గంధాలు దాగలేవు
మట్టిలోన వున్నా.. మణుల అందాలు మాసిపోవు
నీలోని రూపమును గని.. రతనాల దీపమనుకొని
నీలోని రూపమును గని.. దీపమనుకొని
మదిని నిలిపేను.. జగము మరచేనూ
నీ పెదవుల నవ్వులు విరిసే దాక విడువను..విడువను..విడువనులే

దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే

******   ******  ******

చిత్రం: లక్షాధికారి (1963)
సంగీతం:  టి. చలపతిరావు
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల,  సుశీల

పల్లవి:
మబ్బులో ఏముంది…
నా మనసులో ఏముంది.. నా మనసులో ఏముంది?
మబ్బులో కన్నీరు..

నీ మనసులో పన్నిరు.. నీ మనసులో పన్నీరు..
అవునా..ఉహు..ఊ..ఊ….

చరణం: 1
తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
తోటలో మల్లియలు.. నీ మాటలో తేనియలు.. నీ మాటలో తేనియలు ..
ఉహు..ఊ..ఊ..ఊ..
ఊహు..ఊ..ఊ..ఊ..

చరణం: 2
చేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?.. నా మేనులో ఏముంది?
చేనులో బంగారం.. నీ మేనులో సింగారం… నీ మేనులో సింగారం

ఏటిలో ఏముంది?.. నా పాటలో ఏముంది?… నా పాటలో ఏముంది?
ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు… నీ పాటలో సరిగమలు

నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?… నీవులో ఏముంది?
నేనులో నీవుంది… నీవులో నేనుంది… నీవులో నేనుంది

నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేనులో నీవుంది…
అహ..ఆ..అహ..ఆ..
అహ..ఆ..అహ..ఆ..

error: Content is protected !!