Lakshyam (2007)

చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కార్తిక్ , శ్రేయగోషల్
నటీనటులు: గోపిచంద్, జగపతిబాబు, అనుష్క శెట్టి, కళ్యాణి
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
విడుదల తేది: 05.07.2007

చక్కెరకేళి పండు చక్కెర కేళి పండు నాతోడు
నీడై నువ్వుండు
పిప్పరమెంటు పిల్లా, పిప్పరమెంటు పిల్లా నా ఈడు
జోడై నువ్వుండు
తొలిప్రేమ నేడు నీ పేరు రాదా, పిలిచింది చూడు
నిజంగా నిజంగా
మనసైన వాడు చెయ్యందుకోగా ముందె ఉన్నాడు
నిజంగా నిజంగా
ఆమాటే మళ్ళి అను

చరణం: 1
నేనంటే నువ్వంటూ చేతల్లో చూపెట్టు నా మనసు
నమ్మేట్టుగా
నాలోనే నువ్వుంటూ, నేనన్ను దీవింతు
సందేహము వింతగా
వద్దనుకున్నా నేను ఊపిరిలా ఉంటాను
ఇద్దరమంటూ లేనేలేమని నేనంటున్నాను

చరణం: 2
రాకాసి చూపుల్తో నాకేసి చూస్తావేం నేనరిగిపోనా మరీ,
మారాణి నవ్వుల్తో ప్రాణాలు లాగేసి గారాలు పోకే మరీ,
సర్లే కానీ బాబూ ఈ సారికి ఇలా కానివ్వు.
ఇప్పుడు ఎప్పుడు తప్పని సరిగా చేస్తాలే తప్పు

**********   *********   ***********

చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: మధుబాలకృష్ణన్

గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా
ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనురా
అలుపే రాని కేరింతలు తను మురిసీ మన రాగాలలో
అనురాగాలలో తను కూడా మనలాగే మురిసీ

చరణం: 1
ఇందరుండగా ఇరుకైన ఇంటిలో
కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా
కాంతులుండగా ప్రతి వారి కంటిలో
ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా
చొరవలు లేని సంతోషం అలకలు ఉన్నా అరనిమిషం
ఎన్నెన్నొ ఉన్నాయి లేని దొకటే కల్మషం

చరణం: 2
అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి
ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి
అన్నగోపురం వదినమ్మ గుమ్మమై
ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి
మనసే ఏ తిధులు లోకాలే అతిధులు

*******   *******   *******

చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: రంజిత్

ఎవడు..ఎవడు..ఎవడు..
ఎవడూ..ఎవడూ…ఎవడూ…

నా కాఫీ కలిపేవాడు, నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
నా కూడా ఉండేది. నా డ్రెస్ పిండేది
నన్నే ఇస్త్రీ చెయ్యనిదీ నాక్కావాలి
నా పైట చిక్కేవాడు, నా వెనకా నక్కేవాడు, నా
ముందు మొక్కేవాడు నాక్కావాలి
నా పైకే ఎక్కేది, నా బ్యాకే నొక్కేది, నన్నొదిలి
చెక్కేయనిది నాక్కావాలి
సరియైన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరూ
ఎన్నో బంధించేవాడు, ఎదురేదీ ఎరగనివాడు A.T.M
అయ్యేవాడు ఎవ్వడు ఎవ్వరు ఎవ్వడు ఎవ్వరు
ఎవ్వడు ఎవ్వడు హే…

చరణం: 1
మందూ, సిగరెట్టూ చెడు అలవాటంటూ ఉండని
వాడే కావాలి
లాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పేలేడీ
కావాలి
అమ్మా, ఆంటీస్ అస్సలెవ్వరివంకా చూడనివాడే
కావాలి
చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని
తనుతొలగాలి
ఎంతందముగా ఉన్నావంటూ పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి.
నవ్వుతానే తీర్చాలి
ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు ఆ తగిన
పసివాడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ
హే…

చరణం: 2
పెళ్ళే అయ్యాక ఇక లవ్వాడే వాడే వడే కావాలి
లవ్వే చేశాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానేరావాలి
అయిదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
నా వాళ్ళూ నాకూ కావాలి
సాకులు చెప్పే రాజస్థానే నిండాలి
కన్నీళ్ళు కూడా కరగాలి

*******   *******   *******

చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:
గానం: హేమచంద్ర

నిలువమని నన్ను అడుగవలన..నిలువకుండ పొతివి లలన..
ఒర చూపుల చిన్నదాన..ఒక సారి రావె లలన…

నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..

నీ నడకల హొయలున్నదె జాణ..
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదె నా మనసు..
ఊ లలన అది నీకెం తెలుసు..
నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..
నీ నడకల హొయలున్నదె జాణ..

ఎవరని ఎంచుకుని నవొ..వరుడని బ్రాంతి పడినవొ..
ఎవరని ఎంచుకుని నవొ..బ్రాంతి పడినవొ..సిగ్గు పడి తొలగేవొ..
విరహాగ్నిలొ నన్ను తొసిపొయేవొ..
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు..
ఊ లలన అది నీకెం తెలుసు..

ఒక సారి నన్ను చుడరాద..జంట చెర సమయం ఇది కాద..
ఒక సారి నను చుడరాద..సమయం ఇది కాద..చాలు నీ మరియాద..
వగలాడివె నీ వాడనె కాన…
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు..
ఊ లలన అది నీకెం తెలుసు..

నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..
నీ నడకల హొయలునదె జాణ..
నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు..
ఊ లలన అధి నీకెం తెలుసు..

నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన..
నీ నడకల హొయలున్నదె జాణ..

**********   *********   *********

చిత్రం: లక్ష్యం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సుజాత

సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవేమే పిసినారి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు బ్రహ్మచారీ బ్రహ్మచారీ నడవొద్దు నువ్వే అడ్డదారి
మనసిచ్చావే ముద్దుగా మాటిచ్చావే ముద్దుగా
మనసిచ్చాగా ముద్దుగా మాటిచ్చాగా ముద్దుగా
అవసరమొచ్చి ముద్దిమ్మంటే
హరి హరి హరి హరి నువ్వు చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి

చరణం : 1
ఆడా ఇడా ఇమ్మంటే నీడ మిద ముద్దిస్తావు ఆటాడేద్దాం రమ్మంటే
నై నై నై నై నై నై పోను పోను పోనంటే ఫోనులేనే ముద్దిస్తాను పై పై
కెళదాం పదమంటే
నై నై నై నై నై నై అబ్టా అబ్టా చేస్తుంటే తలనొప్పిగుందని అంటావు
మంటై వెంటై పడుతుంటే ఇది మంచి రాస కాదంటాను
ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే హరి హరి హరి హరి నువ్వు చాలా చాలా పొదుపరి
కిరి కిరి కిరి కిరి ఇక చాలోయ్ చాలోయ్ గడసరి

చరణం: 2
చేతికి ముద్దే పెట్టేస్తే చెంప మీద ఇమ్మంటావు చెంపకి ముద్దే రుద్దేస్తే
తకతై తై తకతై తై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటావు గీతే దాటి నువ్వొస్తే
తకతై తై తకతై తై
సిగ్గు బిడియం ఇవ్వడమూ నోకు దాగి మరి నవ్వడమూ మరి మగవాళ్ళంతా
ఎప్పుడూ ఇంతే

error: Content is protected !!