లాలి ముద్దుల గుమ్మాడి… లిరిక్స్
సంగీతం: జిఎల్ నాందేవ్
సాహిత్యం: శ్రీ పాల్ బొల్లెద్దు
గానం: శిరీష
విడుదల తేది: 20.09.2020
అహ లాలి లాలి లాలి లాలి… లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
లాలి ముద్దుల గుమ్మాడి… ఓ లాలి ముద్దుల గుమ్మాడి
నాకేదో గాలి తాకినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
పైర గాలి తాకినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
నన్నెటో పరుగు పెట్టిస్తుంది… లాలి ముద్దుల గుమ్మాడి
లాలి లాలి… అహ లాలి లాలి లాలి లాలి… లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
మరి నిన్నాగాక మొన్నానేమో… లాలి ముద్దుల గుమ్మాడి
నాకు నిండుకున్నాయి పదారేళ్లు… లాలి ముద్దుల గుమ్మాడి
గా సిరిమల్లె పువ్వులు నాకు… లాలి ముద్దుల గుమ్మాడి
నా సిగన వాలుతంటున్నాయి… లాలి ముద్దుల గుమ్మాడి
సిగన వాలుతంటున్నాయి… లాలి ముద్దుల గుమ్మాడి
నాకు చెక్కిలిగింతలు వెడుతున్నాయి… లాలి ముద్దుల గుమ్మాడి
లాలి లాలి… అబ్బ లాలి లాలి లాలి లాలి… లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
గా నిండు సందమామ కూడ… లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను నిమ్మాలంగ రమ్మంటుంది… లాలి ముద్దుల గుమ్మాడి
అబ్బో సందామామ పిలుపులకి… లాలి ముద్దుల గుమ్మాడి
నాలో వలపు కులుకు మొదలయ్యింది… లాలి ముద్దుల గుమ్మాడి
జామురాతిరి జాబిలమ్మ… లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను జాగు చెయ్యకంటున్నాది… లాలి ముద్దుల గుమ్మాడి
లాలి లాలి… అబ్బ లాలి లాలి లాలి లాలి… లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
అగ్గో పొద్దూ పొడుపు ముద్దూ సూరీడు… లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను ముద్దూ వెట్టుకున్నట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
ఇగా ఎండా పొద్దు ఎక్కినకొద్దీ… లాలి ముద్దుల గుమ్మాడి
నాకు వెచ్చనైన గుబులు రేగే… లాలి ముద్దుల గుమ్మాడి
వెచ్చానైనా కోరికతోటి… లాలి ముద్దుల గుమ్మాడి
పొద్దు మచ్చిక చేసుకున్నట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
లాలి లాలి… అబ్బ లాలి లాలి లాలి లాలి… లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
హొయ్ హొయ్… వానా జల్లు అల్లుకుంది… లాలి ముద్దుల గుమ్మాడి
ఆ ప్రేమ ముళ్ళు గుచ్చుకుంది… లాలి ముద్దుల గుమ్మాడి
ఈ ప్రాకృతమ్మ పరవశించే… లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను పరితపింప జేస్తున్నాది… లాలి ముద్దుల గుమ్మాడి
ప్రేమ గాలి తాకిందేమో… లాలి ముద్దుల గుమ్మాడి
నన్ను పెళ్లి చేసుకోమ్మంటుంది… లాలి ముద్దుల గుమ్మాడి
లాలి లాలి… అహా లాలి లాలి లాలి లాలి… లాలి ముద్దుల గుమ్మాడి
నా మనసుకేమో అయినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
లాలి ముద్దుల గుమ్మాడి… ఓ లాలి ముద్దుల గుమ్మాడి
నాకు ప్రేమ గాలి తాకినట్టుంది… లాలి ముద్దుల గుమ్మాడి
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
Super
7063991671
hi