Lawyer Suhasini (1987)

Lawyer Suhasini (1987)

Lawyer Suhasini Lyrics

సామజవరగమనా… లిరిక్స్

చిత్రం: లాయర్ సుహాసిని (1987)
నటీనటులు: భాను చందర్, సుహాసిని
సంగీతం: ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్. పి. బాలు, ఎస్. పి. శైలజ
దర్శకత్వం: వంశీ
నిర్మాణం : డి. ఎస్. ప్రసాద్
విడుదల తేది: 1987

సామజవరగమనా..
దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా..
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా..
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా..
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా..

దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా..
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా..
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా..
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా..

అరవిరిసిన చిరునగవుల
సామజవరగమనా..
ఇల కురిసెను సిరివెలుగులు
సామజవరగమనా..
అరవిరిసిన చిరునగవుల
సామజవరగమనా..
ఇల కురిసెను సిరివెలుగులు
సామజవరగమనా..
సొగసులమణి నిగనిగమని
సామజవరగమనా..
మెరిసిన గని మురిసెనుమది
సామజవరగమనా..
వెలసెను వలపుల మధువని
సామజవరగమనా..

దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా..
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా..
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా..
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా..

మమతల ఉలి మలచిన కల
సామజవరగమనా..
తళుకుమనెను చెలి కులుకుల
సామజవరగమనా..
మమతల ఉలి మలచిన కల
సామజవరగమనా..
తళుకుమనెను చెలి కులుకుల
సామజవరగమనా..
సుగుణములను తరగని గని
సామజవరగమనా..
దొరికినదని ఎగసెను మది
సామజవరగమనా..
అరుదగు వరమిది తనదని
సామజవరగమనా..

హ..హా…
దివిని తిరుగు మెరుపు లలన
సామజవరగమనా..
కరుణ కలిగి భువికి దిగెన
సామజవరగమనా..
బ్రతుకు వెలిగె తరుణి వలన
సామజవరగమనా..
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా..
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా..
చెలిమి కలిమి మరువగలన
సామజవరగమనా..