Leta Manasulu (1966)

చిత్రం: లేతమనసులు (1966)
సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల
నటీనటులు: హరనాథ్, జమున, బేబీ (కుట్టీ) పద్మిని, గరికపాటి వరలక్ష్మి
దర్శకత్వం: కృష్ణన్-పంజు
నిర్మాతలు: ఏ.వి.మరియప్పన్
విడుదల తేది: 1966

పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం: 1
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
ఆ పురుటికందు మనసులో దైవముండును
ఆ పురుటికందు మనసులో దైవముండును
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
అంత మనిషిలో దేవుడే మాయమగునులే
అంత మనిషిలో దేవుడే మాయమగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం: 2
వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును
వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును
మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును
మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం : 3
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
మాయమర్మమేమి లేని బాలలందరు
మాయమర్మమేమి లేని బాలలందరు
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

***********   ********  *********

చిత్రం: లేతమనసులు (1966)
సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.బి.శ్రీనివాస్, పి. సుశీల

పల్లవి :
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

చరణం: 1
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
కురుల మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం: 2
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురుల మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడి సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం: 3
నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

***********   ************  ************

చిత్రం: లేతమనసులు (1966)
సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: దాశరధి
గానం: పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు

హల్లో మేడం సత్యభామ పైనకోపం లోన ప్రేమా
నీవు నేను ఏకమైతే స్వర్గలోకం..
నీవులేని జీవితమే పెద్ద శాపం..
లవ్..లవ్..లవ్..లవ్…బౌ..బౌ..బౌ బౌ..

సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా
డూ డూ డూ..డూ…డూ… భామా
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా……

హల్లో మేడం సత్యభామ .. భామా
పైనకోపం లోన ప్రేమా .. ప్రేమా..
నీవు నేను ఏకమైతే స్వర్గలోకం..లోకం..
నీవులేని జీవితమే పెద్ద శాపం..
లవ్..లవ్..లవ్..లవ్…బౌ..బౌ..బౌ బౌ..

చరణం: 1
ఇంకా బిడియమేలా … ఏలా.. నన్నే నమ్మలేవా….లేవా
నాపై జాలిరాదా… రాదా.. హృదయం విప్పరాదా….
లా లా లా..లా..లా…లా…లా… లా..లా….లా…లా….లా
దైవం ఏమిచేసే… చేసే…. స్త్రీనే సృష్టి చేసే … చేసే..
స్త్రీనే సృష్టి చేసి….చేసి… మాపై విసిరివేసే….
లా..లా…లా…లా…లా….లా.. లా..లా… లా.. లా….లా..

సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా
డూ డూ డూ..డూ…డూ… భామా
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా…… !! హల్లో మేడం !!
లవ్..లవ్..లవ్..లవ్…బౌ..బౌ..బౌ బౌ..

చరణం: 2
హంసా..లాంటి వాకింగ్….వాకింగ్..
హల్వా.. వంటి టాకింగ్…..టాకింగ్
చాలూ చాలు కాలేజీ… కాలేజ్.. చేస్కో ఇంక మ్యారేజ్….
అమ్మాయిగారి మౌనం… మౌనం.. తెలిసే… మాకు అర్థం…. అర్థం
మదిలోన వున్నమాట…. మాట.. కనులే పలుకునంటా…
లా..లా…లా…లా…లా….లా.. లా..లా… లా.. లా….లా..

సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా
డూ డూ డూ..డూ…డూ… భామా
మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా…… !! హల్లో మేడం !!
లవ్..లవ్..లవ్..లవ్…బౌ..బౌ..బౌ బౌ..

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Buchi Babu (1980)
error: Content is protected !!