చిత్రం: లైన్ (2015)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సింహా , సుధామయి
నటీనటులు: బాలక్రిష్ణ , త్రిష , రాధికా ఆఫ్టే
దర్శకత్వం: సత్యదేవ్
నిర్మాత: రుద్రపాటి రామారావు
విడుదల తేది: 14.05.2015
పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరే
తల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరే
బత్తాయి పళ్ళులాంటి బుగ్గలేమొ సూపరే
బొడ్లోన దోపుకున్న చీరకొంగు సూపరే
నడుమట్ట తిప్పుతుంటే
నడుమట్ట తిప్పుతుంటే
నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే
కుర్రాడు పెట్టుకున్న కళ్ళజోడు సూపరే
పైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరే
మెడ్లోన ఏసుకున్న గోల్డ్ చైన్ సూపరే
గుండీల ఎనక ఉన్న గుండె దమ్ము సూపరే
మీసాన్ని తిప్పుతుంటే
మీసాన్ని తిప్పుతుంటే
మీసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే
నీ చేతి గాజులు నీ కాలి మువ్వలు
గుండెల్లో గోలిసోడ కొట్టెనే
నీ గోరు చిక్కుడు నీ గోరు గిచ్చుడు
తమాష తిమ్మిరేదొ పుట్టెనే
నీ బుగ్గ సొట్టలు వెయిస్తు లొట్టలు
ఒలమ్మో గింగిరాలు తిప్పెనే
నా చంప నొక్కులు నీ సర్వ హక్కులు
నా సిగ్గు అటక మీద ఎక్కెనే
నీ జబ్బల్ రైక చూసి వస్తినే
పొద్దు పొద్దున్న సంతకెళ్లి తెస్తినే
నీ జబర్దస్తు నేను చూస్తినే
ఓ రబ్బా వాయనాలిస్తినే
పిక్కపైకి చీరకట్టి నీళ్ళబింది సంకనెట్టి
చిత్తరాల సుప్పనాతిరా
నడుమట్ట తిప్పుతుంటే
నడుమట్ట తిప్పుతుంటే
నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే
కుర్రాడు ఎట్టుకున్న కళ్ళజోడు సూపరే
పైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరే
పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరే
తల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరే
పున్నాగ పువ్వులా దీవాళి జువ్వలా
జవాని జిగ్ జిగ్ మన్నదే
అరిటాకు అందమే తాటాకు మంటలా
నీ వల్ల భగ్గు భగ్గు మన్నదే
నీ వంపు సొంపులు కడియాలు మెట్టెలు
గుమ్మెత్తి గుప్పు గుప్పు మన్నవే
తర్వాని కుండలా కుర్వాని విందులా
నా ఈడు ఆవురావురన్నదే
నువ్వు పచ్చా పావడాయి వస్తివే
పచ్చి పాల మీగడాయి తెస్తివే
ఆ కుర్ర ఆవకాయ చూస్తివే
కొంగులాగి ఆగడాలు చేస్తివే
గంగరాల చెట్టుకాడ గంపనెత్తి కెట్టుకుంటు
కైకలూరి కన్నెపిల్లలా
నడుమట్ట తిప్పుతుంటే
నడుమట్ట తిప్పుతుంటే
నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే
నీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే
కుర్రాడు ఎట్టుకున్న కళ్ళజోడు సూపరే
పైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరే
పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరే
తల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరే