లోపలి మనిషి పాట… లిరిక్స్
సంగీతం: చరణ్ అర్జున్
సాహిత్యం: చరణ్ అర్జున్
గానం: చరణ్ అర్జున్
కోరస్: సాయి దీవెన్, అరుణ్ రవి
నటీనటులు: నిసార్, సంజయ్ మహేష్ వర్మ
దర్శకత్వం: మహేష్ నందు
నిర్మాణం: మల్లేష్ కొండేటి
విడుదల తేది: 13.09.2020
వేదాంతం వేధికెక్కితే… వెధవ పనులు వెనకకు వెళితే
[వెధవ పనులు వెనకకు వెళితే]
ధర్మం ఎదుటోడి కోసమే… తన బతుకంతా అధర్మమే
[తన బతుకంతా అధర్మమే]
పైకే పత్తిత్తు రూపమే… లోపలా ఆణువణువూ లోపమే
గురువిందా గింజ సందమే… గురితించదు పిచ్చి లోకమే
సుట్టూ అందరు సాత్వికులే… ఎటుపాయే కోడిపిల్లే
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
వేదాంతం వేధికెక్కితే… వెధవ పనులు వెనకకు వెళితే
[వెధవ పనులు వెనకకు వెళితే]
ధర్మం ఎదుటోడి కోసమే… తన బతుకంతా అధర్మమే
[తన బతుకంతా అధర్మమే]
నీ శెల్లెను ఎవడేమన్నంటే… చెంప షెల్లు ఎంబడే
ఎవడి శెల్లో ఎదురుగ వస్తుంటే… నీ కళ్ళే మిటమిటే
కొలువు కాడ హక్కుల కోసం… బాసు తోటి వాదన
నీ ఇంట్లో పనిమనిషంటే… నీకు ఎంత ఏలనా…
మంది పోరలు… హే మంది పోరలు
దేశం కోసం అమరులవ్వాలంట… మన పిల్లలు ఫారిన్ లోన సల్లగ సదవాలంట
ఎరగనోడు ఎదిగితే వాడిని ఉదాహరిస్తారంట…
తెలిసినోడు ఎదిగారంటే… ఎంత కడుపుల మంట
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
సిటికడంత సాయం చేసి శింపుతావు పబ్లిసిటీ…
సీక్రెట్టుగ దోసిన సొమ్ముకు… లెక్క చెప్పవేమిటి
బతికి ఉన్న మనుషులనేమో నేలకు దోస్తరు… పోయినాక పల్లకి మోస్తూ నింగికి ఆనిస్తరు
రాజ్య నేతలు… హేయ్ రాజ్య నేతలు… నీతిమంతులై నిన్ను పాలించాలే
నువ్వు మాత్రం ఓటు అడిగితే… నోటుకు సెయ్యి సాపాలే
ఇల్లు దాటి బయటికొస్తే… కృష్ణుడవతారాలు
ఇంటిలోని ఇల్లాలేమో… సీతలా ఉండాలే
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
వేదాంతం వేధికెక్కితే… వెధవ పనులు వెనకకు వెళితే
[వెధవ పనులు వెనకకు వెళితే]
ధర్మం ఎదుటోడి కోసమే… తన బతుకంతా అధర్మమే
[తన బతుకంతా అధర్మమే]
మాటలు సీరంగా నీతులే… మాపటికి సానికొంపలే
మంచైతే నీ గొప్పలే… శెడు ఇతరుల ఖాతలేసుడే
సుట్టూ అందరు సాత్వికులే… ఎటుపాయే కోడిపిల్లే
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
super song.????????????????????????